ఇద్దరు పురుషులు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలో మొదటి గే కపుల్ గా రికార్డు క్రియేట్ చేశారు. ఎనిమిదేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సుప్రియో, అభయ్ లు మొదట స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ పెద్దలను ఒప్పించారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వికారాబాద్ హై వేలోని ట్రాన్స్ గ్రీన్ ఫీల్డ్ రిసార్ట్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. బంధు మిత్రుల సమక్షంలో జరిగిన ఈ వివాహం ప్రత్యేకతను సంతరించుకుంది. తొలి స్వలింగ సంపర్కుల వివాహం కావడంతో ఈ వార్త వైరల్ గా మారింది.
అభయ్, సుప్రియో లు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. సుప్రియో హైదరాబాద్ లోని ఓ హోటల్ మేనేజ్ మెంట్ స్కూల్ లో లెక్టరర్ గా పనిచేస్తున్నాడు. అదే విధంగా అభయ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో డెవలపర్ గా పనిచేస్తున్నాడు.
ఇద్దరు మగవాళ్లు గానీ ఇద్దరు ఆడవాళ్లు గానీ పెళ్లి చేసుకోవడం మన దేశంలో చాలా అరుదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటివి ఇప్పటి వరకు జరిగిన దాఖలాలు లేనే లేవు.