Courtesy: twitter.com/PopCrave
కోవిడ్ పాజిటివ్ లతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో ఇప్పుడు ప్రపంచమంతా బ్రిటన్ చూసి కలవరపాటుకు గురిచేస్తోంది. డిసెంబర్ 18న ఒక్క రోజే 90 వేల కోవిడ్ కేసులు బయటపడగా, అందులో 10 వేల కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే కావడం గమనార్హం. బ్రిటన్ లో ఒమిక్రాన్ మరణాల సంఖ్య ఏడుకు చేరింది. డిసెంబర్ 17 నాడు 3201 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, డిసెంబర్ 18న ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగి, అమాంతంగా 10,059 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968 కి పెరిగింది.
చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం
గత 24 గంటల్లోనే 90, 418 కోవిడ్ కేసులు నమోదు కావడంతో అదుపు చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. శాస్త్రవేత్తల సమాచారం, సలహాలపై కఠినమైన లాక్డౌన్ ఆంక్షలకు ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ దావిద్ తెలిపారు. ఇదిలావుండగా సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ తొలి కేసు వెలగుచూసిన విషయం సంగతి తెలిసిందే.