Courtesy:Twitter/@more2417
అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్రాలజీ కన్సెల్టింగ్ కంపెనీ అమరికాలోని టెక్సాస్ కు చెందిన ఎడ్జైల్ను 230 మిలియన్ డాలర్లకు టేకోవర్ చేసింది. టెక్సాస్ రాష్ర్టంలోని ఆస్టిన్‌లో ఉన్న ఈ కంపెనీ ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ కన్సెల్టింగ్ సంస్థ. ప్రధానంగా రిస్క్. కంప్లియెన్స్, ఇన్ఫర్మేషన్, క్లౌడ్ సెక్యూరిటీ, డిజిటల్ ఐడెంటిటిపై ఫోకస్ పెట్టే సంస్థ అని విప్రో బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ ఏడాది ప్రారంభంలో విప్రో తన సైబర్ సెక్యూరిటీ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకొనేందుకు ఆస్ర్టేలియాకు చెందిన సైబర్ సెక్యూరిటి సంస్థను టేకోవర్ చేసింది. అలాగే యూరోప్‌తో పాటు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటి ప్రాక్టీసెస్ కంపెనీ క్యాప్కోను టేకోవర్ చేసింది. కాగా క్యాప్కో బీఎఫ్ఎస్ఐ రంగంలో లీడింగ్ కన్సెల్టెన్సీ సంస్థ.
విప్రోకు చెందిన అనుబంధ సంస్థ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వినూత్నమైన సైబర్ సెక్యూరిటీ స్టార్టప్‌లను టేకోవర్ చేస్తోంది. విప్రో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అన్నీ రంగాల్లో అన్నీ ప్రాంతాల్లో సైబర్ సెక్యూరిటీ పరిశ్రమలో విప్రో అగ్రస్థానంలో ఉండాలనేదే ఈ టేకోవర్ల ప్రధాన ఉద్దేశమని మార్కెట్ వర్గాల అభిప్రాయం.