collapse
...
Home / చదువు / వేదభూమి....గణితానికి మాతృభూమి - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Te...

వేదభూమి....గణితానికి మాతృభూమి

2021-12-22  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

srinivasa ramanujan
 

ప్రాచీన భారతంలో సకల శాస్త్రాలు, కళలూ వికసించాయి, విలసిల్లాయి. గణనాథం భజే అన్నవారు గణితం లో అద్భుతాలనూ ఆవిష్కరించారు. నేటి శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగతికి కారణమైన పునాదులను వేశారు.

సనాతన తాత్వికత మాత్రమే కాదు...భారతీయ గణితం సైతం ‘శూన్యా’న్ని ఆలింగనం చేసుకుంది. గణితం లో ‘సున్నా’... భావనను ఆవిష్కరించింది భారతదేశమే. అలా ‘అనంతాన్ని’ ప్రపంచానికి అందించింది. ‘సున్నా’ శక్తి  

భారతీయ తాత్వికత లోని ‘శూన్యం’ సున్నా భావనకు ప్రాణం పోసింది. రోమన్ అంకెల్లో సున్నాకు ఒక రూ పం, అంకె, అక్షరం గానీ లేవు. సున్నాభావన గురించి యురోపియన్లకు 1500 దాకా తెలియదు. సు న్నా గురించి తెలిసిన తొలినాళ్లలో యూరప్ ఎంతో తికమక పడింది. సున్నా ఏంటని ఎంతగానో ఆలోచిం చింది. కొందరు దాన్ని అద్భుతమని అన్నారు...మరి కొందరు దాన్ని దయ్యం చేసిన పని అంటూ అభివర్ణించా రు. సున్నా అయోమయాన్ని, కష్టాలను తీసుకొచ్చిందంటూ ఫ్రెంచ్ రచయిత ఒకరు రాశారు. ఆ తరువాత నెమ్మదిగా మిగితా ప్రపంచం అంతా కూడా సున్నాను ఆమోదించింది. భారతదేశం నుంచి ‘సున్నా’ భావన తూర్పు దేశాలకూ విస్తరించింది. 1930లో కాంబోడియాలో వర్తమాన శకం 683కు చెందిన రాతిశాసనం ఒకటి బయటపడింది. అందులో సున్నాను బిందురూపంలో ఉపయోగించారు. 

అందుకే   ‘లెక్కపెట్టడమెలాగో నేర్పించిన భారతీయులకు మనం ఎంతగానో రుణపడి ఉన్నాం... అదే గనుక లేకుంటే శాస్త్రీయ ఆవిష్కరణలేవీ సాధ్యమయ్యేవి కాదు’’ అని అల్బర్ట్ఐన్ స్టీన్అన్నారు.

నేడు ప్రపంచమంతా వినియోగిస్తున్న దశాంశమానం రూపుదిద్దుకుంది భారతదేశంలోనే. గణిత, అంతరిక్ష శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట దశాంశమానంలోని 10 అంకెలకు ఆల్ఫాన్యూమరిక్ విధానాన్ని రూపొందిం చారు. 

అంకెలకు   అక్షరాలను కేటాయించి, వాటిని శ్లోక రూపంలో వ్యక్తీకరించడం వల్ల శ్లోకాలకు ఒక అర్థం, వాటిని డీకోడ్ చేస్తే మరో అర్థం వస్తాయి.

ఒకప్పుడు పాశ్చాత్య ప్రపంచానికి తెలిసిన అతిపెద్ద సంఖ్యలు: 

గ్రీకులకు తెలిసిన అతిపెద్ద సంఖ్య మైరియడ్ (10,000 అంటే 10 పవర్ 4)

రోమన్లకు తెలిసిన అతిపెద్ద సంఖ్య (1000 అంటే 10 పవర్ 3)

భారతీయులు మాత్రం అప్పటికే 10 తరువాత పదిహేను సున్నాలు (10 పవర్ 16) ఉండే సంఖ్యను అత్యంత సాధారణమైందిగా ‘పరార్ధ్’పేరుతో వ్యవహరించారు. 

అరేబియా నుంచి యూరప్  

భారతీయ సంఖ్యామానం గురించి బాగ్దాద్ కు చెందిన అల్-ఖ్వార్జిమి వర్తమాన శకం 850లో ‘ఆన్ ఇండి యన్ నెంబర్స్’ పేరిట ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన భారతీయ సంఖ్యామానం గురించి వివరిం చారు. దశాంశమానం గురించి తెలిపారు. యూరప్ గణితశాస్త్రవేత్త అడెలార్డ్ దాన్ని 12వ శతాబ్దంలో ఇంగ్లీ షు లోకి అనువదించారు. పర్షియన్ చరిత్రకారుడు అల్- బిరుని వర్తమాన శకం 1030లో   ‘కితాబ్ –ఉల్ హింద్’ అనే పుసక్తం రాశారు. అందులో భారతీయ సంఖ్యామానం గురించి ప్రస్తావించారు. 523 622 198 443 682 439   వంటి పెద్ద సంఖ్యను భారతీయులు ఎలా రాస్తారో తెలిపారు. దాని వివరణ నిజానికి ఒక శ్లోకం రూపంలో ఉన్నప్పటికీ, నిజానికి అది ఒక శాస్త్రీయ భావన వ్యక్తీకరణ. అలాంటి శ్లోకాలు భగవత్ ఆరా ధనలో కూడా అనేకం ఉండడం ఓ విశేషం. గణితం అప్పట్లో ఆధ్యాత్మికతతో పెనవేసుకుపోయింది అనేం దుకు అది ఓ ఉదాహరణ. శివుడి స్తోత్రాలలో కూడా గణిత విశేషాలను చూడవచ్చు. 

బీజ గణితం భారత్ లో పుట్టి అరేబియా ద్వారా యూరప్ చేరింది. 

అనంతం... 

‘అనంత’ భావన కూడా భారత్ లో రూపుదిద్దుకున్నదే. విష్ణుమూర్తి శయనించే ‘అనంత’ సర్పం దానికి ప్ర తీక. అనంతం అంటే కొలిచేందుకు సాధ్యపడనిది, అంతం (చివర) లేనిదని అర్థం. శతపథ బ్రాహ్మణ, బృహ దారణ్యక ఉపనిషత్ లలోని కొన్ని శ్లోకాలు ‘అనంతం’ గురించి చర్చించాయి. అనంతం నుంచి అనంతాన్ని తొలగిస్తే, మిగిలేది అనంతమే అంటూ కొన్ని వ్యాఖ్యలు వాటిలో ఉన్నాయి. 

రెండు వేల సంవత్సరాల క్రితమే భారతీయులు అంకెలను అక్షరాల రూపంలో వ్యక్తీకరించారు. నేడు మనం రకరకాల శ్లోకాలుగా వ్యవహరించే వాటిలో అనేకం అలాంటి గణిత విశేషాలకు సంబంధించినవే. దీన్నే కట పయాది సూత్రం లాంటి పేర్లతో వ్యవహరించారు. ఆ శ్లోకంలో... అక్షరాలకు ఉండే విలువలను ప్రతిక్షేపిస్తే, అందులో దాగిఉన్న సంఖ్య తెలుస్తుంది. 

 “Gopi bhagya madhuvrata, shrngiso dadhi sandhiga, khala jivita khatava, gala hala rasandara.”

దీన్నీ డీకోడ్ చేస్తే

ga=3, pa=1, bha=4, ya =1, ma=5, dhu=9, ra=2, tha=6, shru=5, ga=3, sho=5, da=8, dhi =9, sa=7, dha= 9, ga=3, kha=2, la=3, ji=8, vi=4, ta=6, kha=2, ta=6, va=4, ga=3, la=3, ha=8, la=3, ra=2, sa=7, da=9, ra=2

 

i.e. 31415926535897932384626433832792.

ఇక్కడ విశేషం ఏమిటంటే...ఇది గణిత శాస్త్రంలో అత్యంత కీలకమైన ‘పై’ విలువ (దశాంశబిందు లేకుండా).  ఈ విలువ నేటి అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లతో చేస్తే వచ్చే విలువ అంతటి అత్యంత కచ్చిత మైంది కాదని, చివరి అంకెలో కొద్దిపాటి తేడా ఉందని అనే వారూ ఉన్నారు.   

 శ్లోకంలో అక్షరాలను బట్టి చూస్తే ఒక అర్థం వస్తుంది. వాటిని గణిత విలువల్లోకి మార్చుకుంటే మరో అర్థం వస్తుంది. 

సంగీతంలోనూ గణితాన్ని ఆవిష్కరించారు భారతీయులు. సామవేదంలో దాన్ని చూడవచ్చు. 

నేటి గణితశాస్త్రంలోని ట్రిగనామిట్రీ...పూర్వకాలంలో త్రికోణమితిగా వాడుకలో ఉండింది. ట్రిగనామిట్రీ లోని సైన్, కాస్, ట్యాన్ వంటి వాటిని 6వ శతాబ్దంలోనే భారత్ లో ఉపయోగించారు. 

360 డిగ్రీలను సూచించేందుకు వృత్తం చక్కగా ఉపయోగపడుతుందని భారతీయులు వేదకాలంలోనే గుర్తించారు. 

రుగ్వేదం లోని రుక్కు (164) రాశిచక్రం   గురించి ప్రస్తావించిందని చెబుతారు. 12 రాశులు...30 రోజులు... 360 యూనిట్లుగా చెబుతారు. 

వాదాలు, వివాదాలూ ఎలా ఉన్నప్పటికీ ....ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్ లాంటి భారతీయ శాస్త్రవేత్తలు గణితానికి చేసిన సేవలను మానవజాతి ఎన్నటికీ మరిచిపోలేదు. 2021-12-22  Education Desk