Courtesy: twitter.com/Mohanku
తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మరోసారి ఫైర్ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఓ ఉన్నతాధికారిపై మండిపడ్డారు. వంశపారంపర్య అర్చకులను బలవంతంగా టీటీడీ ఉద్యోగులుగా మార్చారని ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థను పరిరక్షించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని రమణదీక్షితులు మండిపడ్డారు. పరిణామాలు ఇలాగే ఉంటే కోర్టును ఆశ్రయించడమేనా అంటూ ప్రశ్నించారు. ఈ విషయమై సలహా ఇవ్వాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామిని ట్యాగ్ చేశారు.
@Swamy39 Tirumala temple admin forcibly converted hereditary sambhavana archakas to regular employees. AP govt's orders to protect hereditary archaka system disobeyed by TTD admin. What nxt? Legal battle again? Pl advice.
— Ramana Dikshitulu (@DrDikshitulu) December 24, 2021