collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన టర్బనేటర్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన టర్బనేటర్

2021-12-24  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

HB circleofcricket 
 

భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఆనందంగా, చిరస్మరణీయంగా చేసిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.  

జలంధర్ కు చెందిన హర్భజన్ సింగ్ భారత తరపున 103 టెస్టులు, 236 వన్డే మ్యాచులు, 28 టీ 20 మ్యాచులు ఆడాడు. 1998లో షార్జాలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో అరంగేట్రం చేసిన హర్భజన్ తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2001లో ఆసీస్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో హ్యాట్రిక్ సాధించాడు. మొత్తం 3 టెస్టుల్లో కలిపి 32 వికెట్లు పడగొట్టారు. అంతర్జాతీయంగా అందరి దృష్టిని   ఆకర్షించాడు.  



2021-12-24  Sports Desk