collapse
...
Home / జాతీయం / అది వసూలు చేసేది నిరసనకారుల నుంచే - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | New...

అది వసూలు చేసేది నిరసనకారుల నుంచే

2021-12-25  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Narottam_Mishra_Cabinet_Minister_MP (3)
పబ్లిక్ , ప్రైవేట్ ప్రాపర్టీకి నష్టం జరగకుండా నిరోధించడం , నష్టాల రికవరీ బిల్లు  2021( పబ్లిక్ అండ్ ప్రైవేటు ప్రాపర్టీ అండ్ రికవరీ ఆఫ్ డ్యామేజి బిల్  2021) ని మధ్యప్రదేశ్ అసెంబ్లీ    మూజువాణి   ఓటు ద్వారా ఆమోదించింది. ఇటువంటి బిల్లులను ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ , హర్యానా   ఆమోదించాయి.   

భిల్లులోని కీలకఅంశాలు       

అల్లర్లు , ప్రజా నిరసనల సమయంలో ఆస్తి నష్టం జరిగిన దావాలను పరిశీలించే ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అశాంతి లేదా ఆందోళనల సమయంలో విధ్వంసానికి పాల్పడిన వారి నుండి నష్టపోయిన ఆస్తి విలువను తిరిగి పొందే నిబంధన బిల్లులో ఉంది. అటువంటి సంఘటనల తరువాత క్లెయిమ్‌లను పరిశీలించడానికి విశ్రాంత న్యామూర్తి , ఐఎఎస్ అధికారితో కూడిన క్లెయిమ్ ట్రైబ్యునల్‌ఏర్పాటు చేయాలని బిల్లు పేర్కొంది. విధ్వంసం జరిగిన  30 రోజులలోపు పబ్లిక్ ప్రాపర్టీ లేదా ప్రైవేట్ ఆస్తి యజమానులు   సంబంధిత విభాగం అధికారులకు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన మూడు నెలల్లోగా పరిహారంపై ట్రైబ్యునల్‌ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా   ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఇప్పుడు రాష్ట్రంలో శాంతి , సామరస్యాన్ని కొనసాగించడానికి బిల్లు దోహదపడుతుందని’’అన్నారు. ‘‘రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే సంఘ వ్యతిరేకశక్తులను కూడా అరికడుతుంది. విధ్వంసకర చర్యలను విచారించిన ట్రైబ్యునల్‌ఇప్పుడు జరిమానా విధించే అవకాశం ఏర్పడుతుందని’’ అన్నారు.

హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేష్ రాజోరా మాట్లాడుతూ , అసెంబ్లీ ఆమోదంచిన ఈ బిల్లు  బాధితులకు అనుకూలమైనదే గాక వేగంగా నష్టాన్ని రికవరీ చేసే నిబంధనలను కలిగి ఉన్నందున ఇతర రాష్ట్రాల కంటే భిన్నమైనదని  తెలిపారు. ఈ బిల్లునుగవర్నర్ మంగూభాయ్ పటేల్‌ ఆమోదం కోసం పంపారు.     

విపక్షాలు ఏమంటున్నాయి..     

బిల్లు ఆమోదంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ చౌదరి స్పందిస్తూ.. '‘బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిచేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంతో మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రజల గొంతును అణిచివేసేందుకు , అధికార దుర్వినియోగానికి చట్టాలు చేస్తున్నారు. తమ అభిప్రాయాలను చెప్పేందుకు ప్రతిపక్షాలను అనుమతించడం లేదు. అందుకే వారు మొదట ఓబీసీ తీర్మానంపై తన అభిప్రాయాలను తెలియజేయకుండా ప్రతిపక్ష నేత (కమల్‌నాథ్‌)ని అడ్డుకున్నారు. తర్వాత ప్రతిపక్షం లేకపోవడంతో బిల్లులను ఆమోదించారు"అని విమర్శించారు.   



2021-12-25  News Desk