6tvnews

collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / చేతన్ శర్మ గురించి మీకేం తెలుసు ?

చేతన్ శర్మ గురించి మీకేం తెలుసు ?

2022-01-03  Sports Desk

Chetan sharma.. 
చేతన్ శర్మ.. ఈ పేరు క్రికెట్ వర్గాల్లో చాలా మందికి తెలుసు. ఆయన ప్రస్తుతం భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. 1980 దశకంలో భారత తరపున 88 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన చేతన శర్మ 128 వికెట్లు పడగొట్టారు. 

ఒక బౌలర్ హ్యాట్రిక్ సాధించడమంటే చాలా గొప్ప విషయం. అటువంటిది ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ సాధించడమంటే మహా అధ్బుతం. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు చేతన్ శర్మ. 1987లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో చేతన శర్మ హ్యాట్రిక్ సాధించాడు. కపిల్ దేవ్ వంటి దిగ్గజ బౌలర్లు టీమిండియా జట్టులో ఉన్న ఆ సమయంలో చేతన శర్మకు ఈ అరుదైన ఘనత సాధించే అదృష్టం కలిగింది. 

అదొక చిరస్మరణీయ ఘట్టం.         

ఓ బౌలర్ కు ఇతర జట్లలోని బ్యాట్స్ మెన్ బౌల్డ్ అవ్వడం ద్వారా వికెట్ లభిస్తుంది. ఒక ఫీల్డర్ క్యాచ్ పట్టడం ద్వారా వికెట్ వస్తుంది. కీపర్ స్టంప్ చేయడం ద్వారా కూడా వికెట్ లభిస్తుంది. కానీ చేతన్ శర్మకు సాధించిన హ్యాట్రిక్ గొప్పతనం ఏంటంటే..అతను సాధించిన మూడు వికెట్లు కూడా బౌల్డ్ రూపంలో వచ్చినవే. మూడు బంతుల్లో వరుసగా మూడు 3 వికెట్లు పడగొట్టాడు. మొదటి బంతికి హాఫ్ సైడ్ లో ఉన్న వికెట్ పడింది. ఆ తర్వాతి బంతికి మిడ్ వికెట్ పడింది. ఆ తర్వాత వేసిన బంతికి లెగ్ సైడ్ వికెట్ లభించింది. ఈ మూడు వికెట్లు పడి హ్యాట్రిక్ సాధించిన అనంతరం చేతన్ శర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నేల మీద పడి దొర్లాడు. జట్టు సభ్యులందరినీ కౌగిలించుకున్నాడు.    ఆ సందడే వేరు. అదొక చిరస్మరణీయ ఘట్టం. 

బీసీసీఐ శుభాకాంక్షలు    

నేడు చేతన్ శర్మ జన్మదినం. చేతన్ శర్మ  1966,  జనవరి 3వ తేదీన జన్మించాడు. టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న చేతన్ శర్మకు బీసీసీఐ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. 

 


2022-01-03  Sports Desk