collapse
...
Home / తెలంగాణ / సెలవులు ప్రకటించి ప్రభుత్వం తప్పు చేసిందా ? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Te...

సెలవులు ప్రకటించి ప్రభుత్వం తప్పు చేసిందా ?

2022-01-05  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

rural school
తెలంగాణాలో విద్యాసంస్థలన్నిటికీ అత్యవసర ప్రాతతిపదికపై సెలవులు ప్రకటించడం తొందరపాటు చర్య అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోవిడ్ 19కరోనాఒమిక్రాన్ కరోనా వ్యాప్తి వేగవంతం అవుతున్ననేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8నుంచి 16వరకు సెలవులు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం సరికాదని తెలంగాణలోని గుర్తింపు పొందిన విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం (తెలంగాణా రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్-టీఆర్ఎస్ఎంఏ) అభిప్రాయపడుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అసోసియేషన్ ఒక లేఖను కూడా రాసింది.

TRSMA     సంస్థ ఆవేదన   

వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూస్తున్న అమెరికాబ్రిటన్ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా    విద్యా సంస్థలను మూసివేయాలనే ఆలోచన కూడా చేయడం లేదని ఆ సంస్థ రాసిన లేఖలో అసంతృప్తి వ్యక్తం   చేసింది. విద్యా రంగానికి నిర్దేశించిన క్యాలెండర్ నిబంధనలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది.ఈ క్యాలెండర్ ను ప్రభుత్వమే నిర్ణయించి ప్రకటించినప్పుడు దానికి కట్టుబడి ఉండవలసిన బాధ్యత ప్రభుత్వానికే లేదా అని వారు నిలదీశారు. ఎందుకు ప్రభుత్వం ఇంత తొందరపాటుతో    సెలవు దినాలను ముందుకు జరపాల్సి వచ్చిందని అసోసియేషన్ ప్రెసిడంట్ వై. శేఖరరావు అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు విద్యా క్యాలెండర్ను పక్కన పెట్టేసిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటిలాగే ఎన్నో సార్లు రాత్రికి రాత్రే సెలవులను ప్రకటించి విద్యార్థులను ఇబ్బందుల్లో పడేసిందని ఆయన అన్నారు. 

govt sss (2)
మరో విద్యాసంవత్సంర కోల్పోతాం   

సంక్రాంతి సెలవులను ఇలా ప్రీ పోన్ చేయడం వల్ల విద్యార్థులకువారి కుటుంబాలకు తప్పుడు సంకేతాలు వెడతాయని ఆయన అన్నారు. సెలవుల తరువాత చాలా మంది విద్యార్థులు విద్యా సంస్థలకు హాజరుకాకపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేసారు. సెలవుల కారణంగా ఒమిక్రాన్ బూచి తీవ్రతను ఎక్కువ చేసి చూపినట్లు అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే జరిగితే మరో విద్యాసంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోతారని ఆయన హెచ్చరించారు. 

విద్యాగ్రహణ శక్తి కోల్పోతున్నారు   

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వ నాశనమైపోయిందని అసోసియేషన్ సభ్యులు కొందరు ఆవేదన వ్యక్తంచేసారు. ఇప్పటికే రెండేళ్లుగా విద్యా సంస్థలు సాఫీగా పనిచేయడం లేదని వారు గుర్తుచేశారు. విద్యార్థులలో క్రమశిక్షణ లోపిస్తోందని. వారంతా ఇంటర్నెట్ కు బానిసలుగా మారుతున్నారని. వారు విద్యాగ్రహణ శక్తి దెబ్బతింటున్నదని వారు చెప్పారు. ప్రాథమిక అంశాలను కూడా వారు మరిచిపోయారని తెలిపారు. విద్యా వ్యవస్థను చక్కదిద్దదడం మానివేసిప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దాన్ని మరింతగా దిగజారుస్తున్నట్లు అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎస్. మధుసూదన రావు ఆరోపించారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలలోని విద్యార్థులుఉపాధ్యాయులు తమకు గతంలో ఇచ్చిన క్యాలెండర్ ఆధారంగా సంసిద్ధులయి ఉన్నారనివారంతా ఇప్పుడు అయోమయంలో పడ్డారని మరొకరి తెలిపారు. 



2022-01-05  News Desk