6tvnews

collapse
...
Home / తెలంగాణ / వనమా కేసులో కఠిన శిక్షలు అమలయ్యేనా ?

వనమా కేసులో కఠిన శిక్షలు అమలయ్యేనా ?

2022-01-09  News Desk

తండ్రి పదవిని చూసుకొని నిలువెల్లా గర్వం.. నియోజకవర్గం నిండా అతనిదో రాక్షస పర్వం.. వెలుగులోకి ఎన్నో లీలలు.. కానీ పోలీసుల ముందుకు రాని ఫిర్యాదులు.. పోలీసులు స్వయంగా పిలుపునిచ్చినా ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఫిర్యాదు మినహా మరే ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు అన్వేషణలో పడ్డారు.. కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలో వనమా రాఘవ కు సంబంధించిన ఈ వ్యవహారంలో బాధితుల నుంచి ఫిర్యాదులు ఆహ్వానిస్తున్నారు.

జవాబు లేని ప్రశ్నలు.. 

శుక్రవారం రాత్రి వనమా రాఘవ ను అరెస్ట్ చేసిన పోలీసులు పాల్వంచ ఏఎస్పీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వనమా మీద వచ్చిన ఆరోపణలు అన్నిటి మీద ప్రశ్నలు జవాబులు రాబట్టేందుకు ప్రయత్నించారు. రామకృష్ణ కు సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో తలదూర్చడం తో మొదలు పెట్టివనమా భూదందాలుఅడ్డగోలు వసూళ్లుసెటిల్మెంట్ వ్యవహారాలుపర్సెంటేజీ లుమామూళ్లు తదితర అంశాలపై పై తెల్లవారుజామున మూడు గంటల వరకు ప్రశ్నించారు. అయితే వీటిలో పూర్తి స్థాయిలో  అతని నుంచి సమాధానాలు రాలేదని తెలుస్తోంది. కాగా రాఘవ ప్రధాన అనుచరులు గిరీష్మురళీకృష్ణ తదితర లో నుంచి కొంత మేరకు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

ముందుకు రావాలి.. 

వనమా రాఘవను కఠినంగా శిక్షించాలంటూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి.  కఠిన శిక్షలు అమలు కావాలంటే అతని వల్ల నష్టపోయిన బాధితులు ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న నాగ రామకృష్ణను బెదిరింపులకు గురి చేసినట్లు  రాఘవ అంగీకరించాడని ఏఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. వనమా రాఘవ పై ఇప్పటిదాకా 12 కేసులు ఉన్నాయనిఅతని వల్ల నష్టపోయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఫిర్యాదుదారులు ముందుకు రావడానికి భయపడుతున్నారు. భవిష్యత్తులో తమకు అతనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలీసులు మాత్రం ఫిర్యాదుదారులు ముందుకు వస్తే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్తున్నారు.


2022-01-09  News Desk