బంగార్రాజుకు అన్నీ కలిసివస్తున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. RRR మూవీ, రాధే శ్యామ్ వంటి చిత్రాలు వాయిదా పడడంతో బంగార్రాజుకు పోటీ లేకుండా పోయింది. అజిత్ నటించిన వలైమా చిత్రం కూడా ఇప్పటికే వాయిదా పడింది. దీంతో సంక్రాంతి బరిలో నిలిచిన ఏకైన పెద్ద సినిమా బంగార్రాజు మాత్రమే. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఈ సినిమాకు కలిసి రానుంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో థియేటర్ల వద్ద ఆంక్షలను కూడా సడలించింది. దీంతో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే అవకాశం కలిగనుంది. ఏపీలో టిక్కెట్ల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ విడుదలైన నాలుగైదు రోజుల్లో విపరీతంగా కలెక్షన్లు వసూలు అవుతాయని సిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.