6tvnews

collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / ఆదాయ పన్నుకు చెల్లుచీటి!

ఆదాయ పన్నుకు చెల్లుచీటి!

2022-01-13  Business Desk

 

Money
 

కేంద్రప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దీపన పథకాలు ప్రకటిస్తూ వస్తోంది. అయితే దాని ప్రభావం ప్రభుత్వం ఖజానాపై భారం పడుతోంది. దీంతో వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం పన్ను సంస్కరణలు చేపట్టి ఇటు ఖజానాపై భారం పడకుండా మరో వైపు ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసుకొనే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపుదిద్దుతోంది.   

 

 ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అమలు చేసే విధంగా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపులో మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఉద్దీపన పథకాలు ప్రత్యక్షపన్ను రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయంపై ఇన్‌కం టాక్స్‌ వసూలు చేసేవారు. దాని  స్థానంలో ఎక్స్‌పెండిచర్‌ టాక్స్‌ వసూలు చేయాలనే ఆలోచనలో ఆర్థికమంత్రిత్వశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.    

 

వ్యక్తిగత ఆదాయపుపన్నును ఎత్తివేస్తే సుమారు 6.32 కోట్ల మందికి ప్రతి ఏడాది వార్షిక ఇన్‌కం టాక్స్‌ రిటర్న్న్‌ (ఐటిఆర్‌) ఫైల్‌ చేయాల్సిన బాధ తప్పుతుంది. ఈ ఐటీఆర్‌ వల్ల కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వారు కొత్త గా స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభించాలనుకునే వారి ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లు అవుతోంది. ఎందుకంటే వీరికి  వ్యక్తిగత ఆదాయం పన్ను నుంచి మినహాయింపు లేదు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే వివిధ రకాల పైల్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోట్లాది పైల్స్‌ను స్క్రూటినీ  

 చేయాల్సి ఉంటుంది. అటు తర్వాత పన్ను చెల్లింపుదార్లును సవాలక్ష ప్రశ్నలు వేయడం, వారి నుంచి క్లారిఫికేషన్‌ (వివరణ)లు తీసుకోవడం, రీఫండ్స్‌, అటు తర్వాత కర్సస్పాండెన్స్‌, లిటిగేషన్స్‌ ఇవి కోర్టులో ఓ పట్టాన తేలవు. సంవత్సరాల పాటు కోర్టులో కేసులు కొనసాగుతుంటాయి. దీంతో పన్ను చెల్లింపుదారుడితో పాటు ప్రభుత్వానికి కూడా అనవసరపు ఇబ్బంది ప్రయాస. దీంతో ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు వ్యక్తిగత ఆదాయ పు పన్నురిటర్న్స్‌ పద్దతిని ఎత్తివేసి దాని స్థానంలో వేరే ఏదైనా కొత్త పద్దతి ద్వారా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవాలని సలహాలు ఇచ్చారు.  

 

 పలు దేశాల్లో  ఇన్‌కంటాక్స్‌ లేదు  

 

ప్రపంచంలోని పలు దేశాల్లో ఉదారణకు యూఏఈ, ఖతర్‌, ఒమాన్‌, కువైట్‌, కేమన్‌ ఐలాండ్స్‌, బహ్రేన్‌, బెర్ముడా, సౌదీ అరేబియా, బ్రూనీ దారుసలామ్‌ లాంటి దేశాల్లో అక్కడి ప్రజలు ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దాని బదులు సోషల్‌ సెక్యూరిటీకి కొంత కంట్రీబ్యూట్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ దేశాలు పన్ను ఎగ్గొటే వారికి స్వర్గథామాలుగా పిలుస్తుంటారు.  ప్రకృతి సహజంగా లభించిన వనరుల ద్వారా ఇక్కడి ప్రభుత్వాలు ఆదాయం సమకూర్చుకుని ప్రభుత్వం నడుపుతుంటాయి.   

 

పన్ను చెల్లించేది ఉద్యోగులే!  

 

మనదేశంలో నిజాయితీగా ప్రభుత్వానికి పన్ను చెల్లించేది కేవలం ఉద్యోగులు మాత్రమే. ఏడాదికి రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు మనదేశంలో కేవలం 8,600 మంది మాత్రమేనని అలాగే 42,800 మంది ఏడాదికి రూ.1కోటి ఆదాయం వస్తున్నట్లు ఐటి శాఖ తెలిపింది.నాలుగు లక్షల మంది మాత్రమే ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం చూపించారు. మొత్తం పన్ను చెల్లించే వారిలో వీరి వాటా 1 శాతం కాగా.. 63 శాతం మంది మాత్రమే వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లిస్తున్నారు. దేశ జనాభాలో మొత్తం 1.5 కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. వారిలో 99 శాతం మంది ప్రజలు మాత్రం కేవలం ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం జరుగుతోంది. వారి చెల్లించే పన్ను కూడా పెద్దగా ఏమీ ఉండదు. ప్రధానంగా ఉద్యోగస్తులే చెల్లిస్తారు. అటు తర్వాత  ఆ మొత్తాన్ని రీఫండ్‌ రూపంలో తిరిగి పొందుతుంటారు.  

 

 ఎక్స్‌పెండిచర్‌ టాక్స్‌  

 

ప్రస్తుతం ప్రభుత్వం ఆదాయపు పన్ను స్థానంలో ఎక్స్‌పెండిచర్‌ టాక్స్‌ను అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో సంపన్నులు ఎంత మొత్తం వ్యయం చేస్తారో దానిపై పన్ను విధిస్తారు. సాధారణంగా సంపన్నులు తమ మూలధనం నుంచి ఈ వ్యయం చేయరు కాబట్టి వారికి కూడా ఇబ్బంది ఉండదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.   

 

ఆదాయపు పన్న ఎత్తివేయడంతో ఉద్యోగుల్లో అనవసరపు ఖర్చులు తగ్గించుకొని పొదుపును ప్రోత్సహిస్తే ఒక విధంగా ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని ఆర్థిక నిపుణులు ఆర్థికమంత్రికి సూచించారు. దీనిపై ఆర్థికమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఫిబ్రవరి 1వ తేదీతో తేలిపోతుంది.   


 


2022-01-13  Business Desk