6tvnews

collapse
...
Home / వినోదం / తెలుగు / ఇండస్ట్రీ బిడ్డగానే చర్చలకు వచ్చా

ఇండస్ట్రీ బిడ్డగానే చర్చలకు వచ్చా

2022-01-13  Entertainment Desk

Chiru meets Jagan
మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను    కలిశారు. సినీ పరిశ్రమకు    చెందిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. తాడేపల్లి కార్యాలయంలోకి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడిన చిరంజీవి తాను ఇండస్ట్రీ బిడ్డగానే చర్చలకు వచ్చానని చెప్పారు.

ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని బేగం పేట విమానాశ్రయం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న చిరంజీవి..అక్కడి నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం జగన్ తో చిరంజీవి భేటీ విషయంలో సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీ తర్వాతైనా సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 

సమాధానం లేని ప్రశ్నలు   

జీఓ నెంబర్ 35పై చర్చ జరిగే అవకాశం ఉందా ?

టిక్కెట్ల వ్యవహారం ఇప్పటికైనా కొలిక్కి వస్తుందా ?

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం చెప్పింది ?

14 మందితో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏం సాధించింది ?

ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వనుందా ?

మొదటి రెండు వారాల్లో టికెట్ల రేట్లు పెంచుకునే ఛాన్స్ ఉంటుందా?

కరోనా వేళ పరిశ్రమను ఆదుకునే విధంగా చర్చలు ఉంటాయా ?


2022-01-13  Entertainment Desk