collapse
...
Home / వినోదం / తెలుగు / పేరు మారిందా.. పెళ్లి చెదిరిపోయిందా ? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

పేరు మారిందా.. పెళ్లి చెదిరిపోయిందా ?

2022-01-18  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

sreejakalyan tt (2)
Courtesy:Twitter/@manojvalluri

సెలబ్రిటీల కుటుంబాలలో ఏదైనా జరిగిందంటే సామాజిక మాధ్యమాలకు పండగే.. అది ఇది పేరు మోసిన హీరోల కుటుంబాల్లో జరిగితే ఇక ఆపడం కష్టమే. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంలో ఐశ్వర్య, ధనుష్ ల విడాకుల వ్యవహారం  హల్ చల్ చేస్తుంది. ఇదే తరుణంలో మన తెలుగు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం లో ఇలాంటి వ్యవహారమే వార్తల్లోకి ఎక్కింది. ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో  పేరు మార్పు ఈ సందేహాలకు కారణం. వివరాల్లోకి వెళితే..

 ఇదీ సంగతి.. 

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ ను  వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో అతి ఇంటికి సంబంధించిన వేరే ఉండేది. కాగా తాజాగా ఇక్కడ శ్రీజ కొణిదెల.. అంటూ పుట్టింటి పేరు దర్శనమివ్వడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీనికి కారణం ఇటీవల సమంత అక్కినేని అనే పేరు ను తొలగించడం ద్వారా తన విడాకుల సంకేతాన్ని ఇచ్చింది. తాజాగా శ్రీజ కూడా ఇలాంటి సంకేతాన్ని ఇస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. దీనితో నిజానిజాల తో పని లేకుండా శ్రీజ విడాకులు తీసుకుంది పలు వెబ్ సైట్ లలో, యూట్యూబ్ ఛానల్ లలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.   శ్రీజ విషయానికొస్తే 2007లో ఆమెకు శిరీష్ భరద్వాజ్ తో వివాహం జరిగింది. నాలుగేళ్ల తర్వాత అతనికి విడాకులు ఇచ్చి కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. 2016లో మెగా కుటుంబం సహకారంతో అతను ఓ సినిమాలో కూడా నటించాడు. అయితే ఇటీవల కూడా ఒక సినిమా రిలీజ్ అయిన దీనిని మెగా కుటుంబం పెద్దగా పట్టించుకోలేదు. ఇవన్నీ ప్రస్తుతం అనుమానాలకు దారితీస్తున్న అంశాలు. అయితే విడాకుల వ్యవహారం ఇప్పటి దాకా శ్రీజ కుటుంబం గాని, కళ్యాణ్ దేవ్ కుటుంబం కానీ ధ్రువీకరించలేదు. ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతోంది. ఏం జరిగినా ఇది ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. ఇంకా ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే ఆ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి ఇష్టారాజ్యంగా కామెంట్లు చేయడం ఆయా కుటుంబాలను ఇబ్బందులకు గురి చేసే అంశం. విషయం వెలుగులోకి రాకుండా ప్రచారాలు చేయడం, ఇష్టారాజ్యంగా కామెంట్లు చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.



2022-01-18  Entertainment Desk