collapse
...
Home / చదువు / ప్రశ్నాపత్రానికి రెక్కలు.. జవాబు లేని ప్రశ్నలు.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News f...

ప్రశ్నాపత్రానికి రెక్కలు.. జవాబు లేని ప్రశ్నలు..

2022-04-28  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

paper
 

పరీక్షలు వచ్చాయంటే చాలు ప్రశ్నాపత్రాలకు రెక్కలు రావడం  సర్వసాధారణంగా మారిపోతుంది. ప్రతి యేటా ఎక్కడో ఓ చోట తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది అధికారులు లోపమా.. నిర్వహణలో నిర్లక్ష్యమా.. పాలనా వైఫల్యమా.. అన్న జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఉదంతాల ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో జరిగిన మరో సంఘటన పలు అనుమానాలను తెర మీదకు తెస్తుంది. అధికారులు అంకితభావాన్ని సవాలు చేస్తోంది..

ఏం జరుగుతుందిక్కడ..  
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాజాగా ఎస్ఎస్సీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. పరీక్ష నిర్వాహకుల్లో ఒకరైన టిఆర్పి రాజేష్ తన మొబైల్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి తొమ్మిది మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేయడం, వారు వాటిని విద్యార్థులకు పంపించడం జరిగిపోయింది. అయితే ఈ నిజం ఎక్కువసేపు దాగలేదు. వెలుగులోకి రావడంతో వెంటనే జిల్లా కలెక్టర్  మనజీర్ జిలానీ సామూన్ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడైన రాజేష్ తో పాటు ఉపాధ్యాయులు నీలకంటేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మీ దుర్గ,  ఆర్యభట్టు, పోతునూరు, రంగనాయకులు లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన చీఫ్ సూపరిండెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్,  ఫ్లయింగ్ స్వాడ్ లను  సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఇది కొత్త కాదు..  
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. పరీక్షలు వచ్చినప్పుడల్లా ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత ఏడాది తిరుపతిలో నారాయణ విద్యా సంస్థ లో తెలుగు ప్రశ్న పత్రం లీక్ కావడం సంచలనం సృష్టించింది. ఇతర 2018లో తెలంగాణలో జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల లో  ప్రశ్నా పత్రాలు లీక్ కావడం సంచలనం సృష్టించింది. ఆదిలాబాద్ లో ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం, మహబూబ్నగర్ జిల్లా మరికల్ లో పి టి ల ద్వారా గణిత ప్రశ్నాపత్రం లీక్ అయ్యాయి. ఇదే ఏడాది ఆంధ్రప్రదేశ్లోని నగరిలో ప్రశ్నాపత్రం లీక్ అయిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు అనే తేడా లేకుండా ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ప్రశ్నా పత్రాలు లీక్ అవుతూనే ఉన్నాయి. మంచి రిజల్ట్ సాధించాలన్న తపనతో ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థ ఇచ్చిన టార్గెట్ ను రీచ్ కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇలాంటి లీకేజీ లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం రానురాను ఆందోళనకరంగా మారుతోంది.

ఏం చేస్తే బాగు..  
ప్రధానంగా సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి  ప్రశ్నాపత్రాలు బయటకు రావడం ఎక్కువగా చోటు చేసుకుంటుంది. వాట్సాప్ లలో అత్యంత తేలికగా ప్రశ్నాపత్రాలను ఫోటో తీసి క్షణాల్లో బయటకు పంపిస్తున్నారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు ఆ ప్రశ్నలకు సమాధానాలను చేకూర్చి విద్యార్థుల వద్దకు పంపుతున్నారు. దీనితో నూటికి నూరు శాతం ఫలితాలను సాధించాలని ఉద్దేశంతో ఉపాధ్యాయులంతా ఒక క్లబ్గా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లను తీసుకు వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇక ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల పరంగా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టవలసిన అవసరం ఉంది. అధికారులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రశ్నాపత్రాల చౌర్యం అరికట్టడం సాధ్యం కాదు. ప్రశ్నాపత్రాలు ఇలా బయటకు రావడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంటుంది. అది ఏమాత్రం క్షేమదాయకం కాదని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వాలు ఈ చర్యలను ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉందని  అభిప్రాయపడుతున్నారు.



2022-04-28  Education Desk