collapse
...
Home / చదువు / కర్ణాటకలో మరో వివాదం.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telugu

కర్ణాటకలో మరో వివాదం..

2022-04-28  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

school
 

కర్ణాటకలో హిజాబ్ అంశం ఇంకా పూర్తిగా సద్దుమణగనే లేదు.. బైబిల్, భగవద్గీత వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. తమ స్కూల్లో బైబిల్ బోధనలను తప్పనిసరి చేయాలంటూ బెంగుళూరులోని ఓ పాఠశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆ పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.  ఈ వివాదం మొదలు కాగానే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బి.సి.నగేష్ ... దీనిపై స్పందిస్తూ.. ఇకపై స్కూళ్లలో భగవద్గీతను ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. భగవద్గీత మతపరమైన బుక్ కాదని, అది మతాచారాల గురించి ప్రస్తావించదని అన్నారు. ప్రార్థనలు ఎలా చేయాలన్న దాన్ని కూడా ఈ పవిత్ర గ్రంథం బోదించదని..అసలు అన్నింటికీ ఇది అతీతమని ఆయన చెప్పారు. విద్యార్థుల నైతికతను పెంచే ఏ మోరల్ సైన్స్ నయినా స్కూళ్లలో చేర్చాలన్నదే తమ అభిమతమన్నారు. ( బెంగుళూరు లోని క్లియరెన్స్ హైస్కూల్ అన్న పాఠశాల.. స్కూల్లోకి బైబిల్ ని తీసుకువచ్చేందుకు తమ పిల్లలకు అభ్యంతరం చెప్పబోమని , ఇలా సంతకం చేయాలని  వారి పేరెంట్స్ హామీ ఇవ్వాలంటూ ఓ సర్క్యులర్ జారీ చేయడంతో వివాదం మొదలైంది). ఇది పెను వివాదమే కావడంతో ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ శాఖ ఈ నెల 26 న ఈ పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఈ స్కూలు యాజమాన్యం ఇచ్చిన సమాధానం చూశాక తాము తగిన చర్య తీసుకుంటామని మంత్రి నగేష్ చెప్పారు. కాగా క్లియరెన్స్ హైస్కూలు యాజమాన్యం.. క్రెస్తవేతర విద్యార్థులను బైబిల్ చదవవలసిందిగా ఒత్తిడి తెస్తోందని హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి మోహన్ గౌడ ఆరోపించారు. ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ విధమైన వివాదాలను తమ సంస్థ తీవ్రంగా పరిగణిస్తుందని, ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలని ఆయన కోరారు.  

స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్  
నగరంలోని  క్లియరెన్స్ స్కూలు నిర్వాకంపై ఎంక్వయిరీ జరపవలసిందిగా బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్.. బెంగుళూరు జిల్లా కమిషనర్ కి ఓ లేఖ రాసింది. ఈ పాఠశాల ఉత్తర్వులు భారత రాజ్యాంగంలోని 25 వ అధికరణాన్ని ఉల్లంఘించేవిగా  ఉన్నాయని, అందువల్ల దీనిపై ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిషన్ ఆదేశించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కూలు మేనేజ్ మెంట్ ఏడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరింది. అయితే బైబిల్ వివాదంపై సంకుచిత రాజకీయాలు నడుస్తున్నాయని ఈ పాఠశాల ప్రిన్సిపల్ జెర్రీ జార్జి ఆరోపించారు. తమ స్కూల్లో 75 శాతం మంది విద్యార్థులు క్రిస్టియన్లేనని, తమ స్కూలు నిబంధనల గురించి ప్రతి విద్యార్థికీ  వారి అడ్మిషన్ కి ముందే వివరించామని ఆయన చెప్పారు. అటు బైబిల్ అంశంపై ప్రభుత్వం ఈ స్కూలుకు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని బెంగుళూరు ఆర్చ్ బిషప్ పీటర్ మచాడో ఖండించారు. ప్రభుత్వ చర్య తనను బాధించిందని ఆయన అన్నారు. క్రెస్తవ స్కూళ్లలో చదువుతున్న మరే ఇతర మతాల విద్యార్థులనైనా క్రెస్తవ మతంలోకి మారాలన్న నిబంధన విధించారా అని ఆయన ప్రశ్నించారు. క్రెస్తవేతర విద్యార్థులు బైబిల్ చదవవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.  

జాతీయ భాషపై నటుడు సుదీప్ వైఖరి సబబే.. సీఎం బసవరాజ్ బొమ్మై  
జాతీయ భాషపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య రేగిన ట్విటర్ వార్ పై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై.. సుదీప్ చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని స్పష్టం చేశారు. భాషా ప్రతిపాదికపైనే మన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ దృష్ట్యా సుదీప్ స్టేట్ మెంట్ సరైనదేనని, ప్రతివారూ దాన్ని గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. హిందీ జాతీయ భాష కాదని, ఇది తన అభిప్రాయమని కిచ్చా సుదీప్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యను అజయ్ దేవ్ గన్ ఖండిస్తూ.. అలాంటప్పుడు మీ మాతృ భాషలో వచ్చిన చిత్రాలకు హిందీ డబ్బింగ్ అవసరం కావడంలేదా అని ట్వీట్ చేశారు. అవి హిందీలో డబ్ అవుతున్నాయని గుర్తు చేశారు. హిందీ ఎప్పుడూ మన మాతృ భాషేనని, అది జాతీయ భాష అని ఆయన అన్నాడు. కాగా...  సుదీప్ ప్రకటన హేతుబద్ధంగా ఉందని, దీన్ని ఎవరూ ఖండించజాలరని సీఎం బసవరాజ్ బొమ్మై అభిప్రాయపడ్డారు.  2022-04-28  Education Desk