collapse
...
Home / చదువు / పాఠశాలల్లో శ్లోకాల పఠనం –భగ్గుమంటున్న విపక్షాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News fo...

పాఠశాలల్లో శ్లోకాల పఠనం –భగ్గుమంటున్న విపక్షాలు

2022-05-02  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

sans
 

 అసలే దేశమంతటా భాషా వివాదం చిచ్చు పెడుతోంది. ఈ దశలో సంస్కృతం పేరు చెబితే అదేదో పెద్ద దోషం అంటున్నాయి ప్రతిపక్షాలు. హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాలల్లో సంస్కృత శ్లోకాల పఠనాన్ని ఒక బోధనా అంశంగా చేర్చారు. ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. 

హిమాచల్ ప్రదేశ్ పాఠశాల విద్యా బోధన బోర్టు 3వ తరగతి నుంచి సంస్కృత భాషా బోధనను ప్రారంభించాలని నిర్ణయించింది. అదే సమయంలో 6వ తరగతి నుంచి వేద గణితం ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించింది. అంతే కాకుండా, 9 నుంచి 12వ తరగతి వరకు వచ్చే ఏడాది నుంచి భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చేందుకు కూడా ఆలోచిస్తోంది. ఇంకేముంది ప్రతిపక్షాలు తాడెత్తున లేస్తున్నాయి. ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించడానికి బదులు, సంస్కృత బోధన ద్వారా విద్యను కాషాయీకరిస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇంగ్లీషు భాషలో మాత్రమే ఉన్నత ప్రమాణాలతో విద్య అందించడం సాధ్యమవుతుందని, గణిత శాస్త్రం, లేదా శాస్త్ర విజ్జ్ఞానం ఆంగ్లంలో బోధిస్తేనే ప్రయోజనం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. బాల్యంలోనే చిన్నారుల మనసులను కలుషితం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నదని వారు ఆరోపిస్తున్నారు. 

జీవిత విలువలను, నైతిక విలువలను బోధించడంలో ఎలాంటి తప్పు లేదని విద్యా శాఖ మంత్రి గోవింద్ ఠాకూర్ సమాధానమిచ్చారు. చిన్నారులు ముందుగా తమ సాంస్కృతిక ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. భగవద్గీత అంశాలను సంస్కృతంలోనూ, హిందీ మాధ్యమంలోను బోధిస్తారని ఆయన తెలిపారు. ఇంతకు ముందు గుజరాత్ ప్రభుత్వం కూడా భగవద్గీత బోధనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు భగవద్గీత పాఠ్యాంశంగా ఉంటుంది. హిమాచల్ రాష్టంలో 3వ తరగతి విద్యార్థుల సంఖ్య సుమారు లక్షన్నర మంది ఉంటారు. 6వ తరగతికి వచ్చే సరికి వారి సంఖ్య 1.25 లక్షలు. ప్రాథమిక విద్యా స్థాయిలో సంస్కృత భాషను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా హిమాచల్ స్థానం సంపాదించుకుంది.

సంస్కృత అధ్యయనంలో ముస్లిం బాలిక ప్రావీణ్యం  
లక్నో యూనివర్సిటీలో ముస్లిం బాలిక ఒకరు సంస్కృత భాషలో ఎంఏ పట్టా సొంతం చేసుకున్నారు. ఉత్తమ సంస్కృత విద్యార్థినిగా గజాలియా అయిదు మెడల్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని లక్నో వర్సిటీ గత నవంబర్ లో నిర్వహించిన స్నాతకోత్సవ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. కోవిడ్ కారణంగా మెడల్స్ కొందరికే అందించగలిగారు. గజాలియా కు మాత్రం అవార్డుల ప్రదానం ఇటీవలే జరిగింది. డీన్ ఆర్ట్స్ విభాగం డీన్ శశి శుక్లా మెడల్స్ అందించారు. 

గజాలియా రోజువారీ కూలీగా జీవితం గడిపే కుటుంబానికి చెందిన నిరుపేద బాలిక. అయినా కూడా ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృత భాషల్లో ఆమె ఉన్నత ప్రమాణాలు సాధించింది. ఆమె పదో తరగతి చదువుతుండగా తండ్రి మరణించడంతో విద్యాభ్యాసం కొనసాగించడం పెద్ద సమస్యగా తయారైంది. ఆ కారణంగా అప్పటికి 13 ఏళ్లున్న సోదరుడు షాదాబ్, 10 ఏళ్లున్న మరో సోదరుడు నయాబ్ తమ చదువులను అటకెక్కించి, కూలీ పనిచేస్తూ కుటుంబ పోషణ బాధ్యత చేపట్టారు. అందుకే గజాలియా తనకు వచ్చిన మెడల్స్ తన సోదరులకు అంకితం చేసింది. ఇక భవిష్యత్తులో తాను సంస్కృతం ప్రొఫెసర్ గా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు గజాలియా తెలిపింది. వర్సిటీ ప్రాంగణంలో సంస్కృత శ్లోకాల పఠనం, గాయత్రీ మంత్ర పారాయణం, సరస్వతీ వందనం కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలను సుసంపన్నచేసి అందరి మన్ననలు అందుకుంది. అన్ని దేశ భాషలకూ మాతృకగా దేవ భాష అయిన సంస్కృతం వినసొంపుగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయిదో తరగతిలో ఉండగానే ఆమెకు సంస్కృత భాషతో ఏర్పడిన పరిచయం రోజురోజుకూ పెరగి పిహెచ్.డి చేసే స్థాయికి చేర్చింది.



2022-05-02  Education Desk