బాలీవుడ్ బ్యూటీ దంగల్ ఫేమ్ నటి ఫాతిమా సనా షేక్‌కు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ కూడా తన ప్రొఫెషనల్ విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను, వివిధ ఫోటో షూట్ పిక్స్‌ను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నతి అధిరిపోయే మెరుపుల చీరతో సరైన గ్లామర్ అర్థం ఏమిటో తెలిపింది. ఫ్యాషన్ ప్రియుల మనసును దోచింది.
ఫాతిమా సనా షేక్ డిజైనర్ నీత లుల్లా కలెక్షన్స్ నుంచి సేకరించిన అందమైన ఆకుపచ్చని చీరను తన తాజా ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది. ఈ చీరతో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మెరుపుల చీరతో మాయ చేస్తున్న ఫాతిమా:
విభిన్న కథాంశాలతో వచ్చిన సినిమాల్లో నటించడంతో పాటు విభిన్న వార్డ్రోబ్ ఎంపికలతో ఎప్పుడు తన అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది ఫాతిమా సనా. ఇటీవల ఈ సుందరి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీత లుల్లా షెల్ఫ్ నుంచి సేకరించిన సీక్విన్డ్ చీరను ధరించి చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సీక్విన్స్‌తో ఉన్న పాస్టెల్ గ్రీన్ చీర లో ఫాతిమా అదిరిపోయింది. చీరమొత్తం మెరుపుల డీటైల్స్ ఉండటంతో దీనికి మ్యాచింగ్‌గా అదే రంగులో ఉన్న బ్యాక్‌లెస్ ప్లంగింగ్ నెక్లైన్ కలిగిన ప్లెయిన్ బ్లౌజ్‌ను ఎన్నుకుంది. స్లీక్ పోనీటైయిల్ వేసుకుని, చెవులకు డాంగ్లింగ్ ఇయర్రింగ్స్ పెట్టుకుని న్యూడ మేకప్‌తో కారామెల్ లిప్ కలర్ టింట్‌తో మెరిసేటి ఐలిడ్స్తో తన లుక్‌ను పూర్తి చేసి ఎంతో అందంగా కనిపించింది ఈ భామ.
డ్యుయల్ టోన్డ్ కో-ఆర్డ్ సెట్లో మైండ్ బ్లాక్ చేస్తున్న బ్యూటీ:
ఇటీవల ఫాతిమా సనా షేక్ డిజైనర్ నిఖిల్ తంపి షెల్ఫ్ నుంచి సేకరించిన డ్యుయల్ టోన్డ్ కో -ఆర్డ్ సెట్ వేసుకుని హల్ చల్ చేసింది. ఫ్రంట్ జిప్ డీటైల్స్ కలిగిన తెల్లటి క్రాప్ టాప్కు జోడీగా నలుపు, తెలుపు రంగుల్లో ప్రింటెడ్ డీటైల్స్‌తో వచ్చిన ప్యాంట్స్ ను వేసుకుంది. ఈ అవుట్ ఫిట్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించి కుర్రకారు గుండెల్లో గుబులు పెంచింది ఫాతిమా. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా స్టైలిష్ లుక్స్‌లో కనిపించేందుకు పాదాలకు బ్లాక్ హీల్స్ వేసుకుంది. మొఖానికి నల్లటి సన్‌గ్లాసెస్ పెట్టుకుంది. సముద్రపు అలలాగా కనిపించే లా తన కురులను లూజ్‌గా వదులుకుంది. ఫాతిమా మినిమల్ మేకప్‌తో ఎంతో మెస్మరైజింగ్‌గా కనిపించింది.
వన్ షోల్డర్ డ్రెస్‌లో వెరీ హాట్ :
ఇక వేసవి వేల మరింత వేడి పెంచే విధంగా ఫాతిమా మినీ డ్రెస్‌తో మతులుపోగొడుతోంది. ఆరేంజ్ తెలుపు రంగుల్లో ప్రింట్స్‌తో వచ్చిన ఈ మినీ డ్రెస్‌లో ఎంతో హాట్‌గా కనిపించింది ఈ చిన్నది. స్టైలిస్ట్ అక్షిత, ఖుషిలు ఫాతిమాకు స్టైలిష్ లుక్స్‌ను అందించారు. ఈ వన్ షోల్డ్ మినీ డ్రెస్‌కు వచ్చిన డ్రమాటిక్ స్లీవ్ అవట్ఫిట్ను స్టైలిష్ గా మర్చింది. థై దగ్గర వచ్చిన థ్రెడ్ డీటైల్స్ వెరీ అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా ఈ బ్యూటీ హై పోనీటెయిల్‌ను వేుకుంది. చెవులకు హూప్ ఇయర్రింగ్స్, చేతి వేళ్లకు ఉంగరాలను పెట్టుకుంది. పాదాలకు అవుట్‌ఫిట్ కలర్లో ఉన్న హీల్స్ వేసుకుని వివిధ ఫోజుల్లో ఫోటోలు దిగి కుర్రకారు మనసు దోచేసుకుంది.