collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / Fashion: పొట్టి గౌనులో పిచ్చెక్కిస్తున్న మిల్క్‌ బ్యూటీ అందాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu...

Fashion: పొట్టి గౌనులో పిచ్చెక్కిస్తున్న మిల్క్‌ బ్యూటీ అందాలు

2022-05-12  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

tamannah-1
పాలమీగడ అందాలు ముద్దుగుమ్మ తమన్నాకే సొంతం. నెట్టింట్లోసినీ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఉన్న క్రేజే వేరు. అందంతో పాటు నటనడ్యాన్స్‌తో అభిమానులను సొంతం చేసుకున్న ఈ చిన్నది వారిని అలరించేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్‌గానే ఉంటుంది. ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ బ్యూటీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఓ వైపు టాలీవుడ్,బాలీవుడ్‌లలో సినిమాల్లో నటిస్తూఐటమ్ సాంగ్స్‌ చేస్తూ బిజీ బిజీ గా ఉన్నప్పటికీ కాస్త సమయం దొరికినా ఇన్‌స్టాఫ్యామిలీతో కనెక్ట్ అయిపోతుంటుంది. తాజాగా ఈ చిన్నది ఓ ఫోటో షూట్ కోసం వేసుకున్న పొట్టి గౌను ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి ఒంపు సొంపులు కనిపించేలా ఉన్న ఈ అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.   

tamannah 5

మూవీ ప్రమోషన్స్‌లో బిజీ బిజీ:   

2019లో విడుదలైన కామెడీ చిత్రం ఎఫ్‌2మంచి హిట్ కొట్టడంతో దీని సీక్వెల్ కు కూడా అదే రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. త్వరలో ఎఫ్‌3సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌లతో తమన్నా ఫుల్ బిజీ బిజీగా గడుపు తోంది. తాజాగా నారింజ రంగు వన్‌ షోల్డర్ మిడి డ్రెస్‌ను వేసుకుని తమన్నా తన హాట్ లుక్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ రెడ్‌ కార్పెట్ వర్తీ ఫోటోలను తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌ కింద లెట్స్ గెట్ ది పార్టీ స్టర్టెడ్‌ అని క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్‌ చూసి తమ్ము ఫ్యాన్స్ మతులు పోతున్నాయి. తమన్నా సొగసుల విందు చూసి పండుగ చేసుకుంటున్నారు.   

tamannah 4
 

బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్ అవుట్‌ ఫిట్ :   

తమన్నా వేసుకున్ని వెస్పర్ ఎమ్మా ఆరేంజ్ వన్‌ షోల్డర్ మిడి డ్రెస్‌ను ప్రముఖ బ్రిటిష్ బేస్డ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ వెస్పర్ నుంచి సేకరించింది. కట్‌ అవుట్‌ వన్‌ షోల్డర్ తో పాటు వెనుక భాగంలో వచ్చిన జిప్‌ డీటైల్స్ ఈ మిడి డ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తనమన్నా బాడీ స్ట్రక్చర్‌కు కరెక్ట్‌గా సెట్‌ అయ్యేలా ఈ అవుట్‌ఫిట్‌ ఉంటుంది. కాళ్లకు లగ్జరీ లైన్ క్రిస్టియన్ లౌబౌటిన్‌ షెల్ఫ్‌ నుంచి సేకరించిన హీల్స్‌ను వేసుకుని వయ్యారాలు పోయింది.   

ఈ అవుట్‌ఫిట్ ధర రూ.5,335. ఇది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ వెస్పర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.   

tamannah 2
 

బ్లూ డ్రెస్ చాలా కాస్ట్‌లీ గురూ:   

తమన్నా ఏ అవుట్‌ఫిట్ వేసుకున్నా అకేషన్‌కు తగ్గట్లుగా ట్రెండీగా ఉంటుంది. వేదికకు తగ్గట్లుగా మేకోవర్ అవ్వడం ఈ బ్యూటీ ప్రత్యేకత. ఈ మధ్యకాలంలోనే ఈ బ్యూటీ వేసుకున్న సీ బ్లూ కలర్ బాడీ హగ్గింగ్ డ్రెస్ అభిమానులనుఇన్‌స్టా ఫాలోవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ బాడీ హగ్గింగ్‌ పొట్టి గౌను ధర అక్షరాలా రెండు లక్షల పైనే. ఇటీవల ఈ అవుట్‌ఫిట్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. కాలి నుంచి తల వరకు ఈ డ్రెస్‌కు తగ్గట్లుగా అన్ని ఆక్సెసరీస్‌ మ్యాచింగ్ ఉండేలా చూసుకుంది మిల్క్ బ్యూటీ.   

tamannah blue dress2022-05-12  Lifestyle Desk