మెట్ గాలా 2022ఎంతో వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలంతా అదిరిపోయే అవుట్‌ఫిట్స్ ధరించి రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు.అమెరికన్ యూట్యూబర్ 21ఏళ్ల ముద్దుగుమ్మ ఎమ్మా ఛాంబెర్లేన్ కూడా తనదైన శైలిలో రెడ్‌కార్పెట్‌పై సందడి చేసింది. ఈ ఏడు జరిగిన మెట్ గాలాలో ఎమ్మ చారిత్రక, గొప్ప వారసత్వం కలిగిన లుక్‌లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద డైమండ్ ను నెక్లెస్‌గా మార్చి తన మెడలో అలంకరించకుని రెడ్కార్పెట్పైన స్పెషల్ గా కనిపించి అందరినీ అవాక్కు చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ లుక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు ధరించిన వజ్రాల నెక్లెస్ గురించే అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు.
మెట్ గాలాలో మహారాజా పటియాలా కాలం నెక్లెస్ ? :
ఈ ఏడు మెట్ గాలాలో ఎమ్మా ఛాంబెర్లేన్ లుక్ హెడ్‌లైన్స్‌గా మారింది. కార్టియర్ బ్రాండ్ అంబాజడర్గా ఈ అమెరికన్ యూట్యూబర్ రెడ్ కార్పెట్‌పై నడిచి హొయలు పోయింది. ఈ రెడ్ కార్పెట్ లుక్ కోసం ఎమ్మా లూయిస్ విట్టన్ అవుట్‌ఫిట్‌ను ధరించింది. డ్రమాటిక్ స్లీవ్స్ కలిగిన క్రీమ్ కలర్ టాప్కు కాంట్రాస్ట్ గా బాడీ హగ్గింగ్ వైట్ స్కర్ట్‌ను వేసుకుని రెడ్‌కార్పెట్‌పై రెచ్చిపోయింది ఎమ్మా. 21ఏళ్ల ఈ బ్యూటీ లుక్స్ అందరినీ ఫిదా చేశాయి. అంతే కాదు ఈ అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా మెడలో ధరించిన ఆభరణమే ఇప్పుడు అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎమ్మడా రెడ్ కార్పెట్‌పైన అత్యంత పురాతనమైన ఆభరణాన్ని ధరించింది. ఆ చోకర్ మహారాజా పటియాలా భూపిందర్ సింగ్‌కు చెందినదని నెటిజెన్లు పాయింట్ చేశారు. ఇది ఎంతో అందంగా ఉందని చారిత్రక గుర్తుగా భావిస్తున్నామని నెటిజెన్లు కామెంట్లు చేశారు.
ప్రపంచంలోనే ఏడవ అతి పెద్ద వజ్రం:
1928లోనే పటియాలా మహారాజు ప్రపంచంలోనే ఏడవ అతి పెద్ద డి బీర్స్ వజ్రాన్ని చోకర్‌గా మార్చి వారసత్వ సంపదగా అందజేయాలని భా వించారు. అరుదైన రత్నాలు, వజ్రాలతో నెక్లెస్, చోకర్ సెట్‌ను తయారు చేయించేందుకు రాజు సిద్ధమయ్యారు. ఐదు వరుసల ప్లాటినమ్ చైన్స్, 2930వజ్రాలు, బర్మీస్ కెంపులతో తయారు చేసిన ఈ నెక్లెస్ అపఖ్యాతి పాలైన పటియాలా నెక్లెన్ అని పిలవబడేది. ఈ నెక్లెస్ మధ్యలో 234.6క్యారెట్ల డి బీర్స్ డైమండ్‌ను జోడించి నెక్లెస్‌ను అందంగా మార్చారు. ఆ తరువాత 1948లో అకస్మాత్తుగా నెక్లెస్ పటియాలా రాయల్ ఖజానా నుంచి కనిపించకుండా పోయింది. నెక్లెస్‌తో పాటు చోకర్ కూడా కనిపించలేదన్న వార్త వివాదాలకు దారితీసింది.
32 ఏళ్లకు పురాతన వస్తువుల షాపులో నెక్లెస్ ప్రత్యక్షం:
ఆ తరువాత ఆ నెక్లెస్ మిస్ అయిన 32ఏళ్లకు 1998లో పురాతన వస్తువులు కలిగిన షాప్‌లో నెక్లెస్ భాగాలు కనిపించాయి. అయితే నెక్లెస్ లోని రత్నాలు మాత్రం ఇప్పటికీ కనిపించలేదు. ఇక కార్టియర్ ఆ నెక్లెస్‌ను తీసుకుని మిస్సింగ్ స్టోన్స్‌ను రీప్లేస్ చేసి నెక్లెస్‌ను సిద్ధం చేశాడు. నిజానికి ఒరిజినల్ నెక్లెస్ ధర ఇప్పటి రోజుల్లో చూసుకుటే 30మిలియన్ల డాలర్లని తెలుస్తోంది.