collapse
...
Home / జాతీయం / Link language: ఇంగ్లీష్‌తోనే మ‌నం మ‌న‌గ‌లమంటున్న ఏఆర్ రెహ‌మాన్‌ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telug...

Link language: ఇంగ్లీష్‌తోనే మ‌నం మ‌న‌గ‌లమంటున్న ఏఆర్ రెహ‌మాన్‌

2022-05-13  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ar rehman
 

దేశమంతా ఒకే భాష ఉండాలనీ..అది హిందీ భాష అయి ఉండాలన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. దేశాన్ని ఏకం చేసే సామర్ధ్యం ఉన్న భాష హిందీ అని   షా ట్విట్ట‌ర్‌లో వ్యాఖ్య‌లు చేసిన నాటి నుంచి దేశంలో భాషా వివాద‌o రేగుతునే ఉన్నాయి. కొందరు హిందీ భాష‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతుంటే... ద‌క్షిణాది రాష్ట్రాల‌లో మాత్రం దీనికి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతునే ఉంది.

మ‌రింత లోతుగా ఈవిష‌యంపై మ‌నం మాట్లాడుకోవాల‌నుకుంటే... వాస్త‌వానికి  విభిన్న సంస్కృతులు, భాషలతో కలగలిసిన కూటమి. అందుకే  మ‌న‌కు  స్వాతంత్య్రం లభించిన ఈ డెబ్బై అయిదు ఏళ్ళయినా దేశమంతటికీ ఒకే భాష విధానాన్ని ప్రవేశపెట్టుకో లేకపోయారు. 

400ఏళ్ల‌ త‌ర‌బడిమ‌న‌ల్ని పాలించిన‌  బ్రిటీషు ప్రభావంతో పాటు, వివిధ దేశాలు, ప్రాంతాల వారితో మ‌న దేశం సత్సంబంధాలు ఏర్ప రుచుకోవడానికి ఇంగ్లీషు తప్పనిసరి అయింది.  అందుకే అప్ప‌టిప్ర‌భుత్వం రెండు అధికార భాషల్లో ఒకటి ఆంగ్లంను  మరోదాన్ని హిందీగా గుర్తించింది.  అయితే దేశమంతటికీ అధికార భాష అన్నది ఒకటి ఉండాలన్న ప్రయత్నాలు చాలా కాలం నుండే జరుగుతూ వచ్చాయి.

60వ‌ద‌శ‌కంలొ  అప్ప‌టి ప్ర‌భుత్వం హిందీని జాతీయ భాషగా దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని చూసినా  ద‌క్షిణాదిన‌, అందునా తమిళనాడులో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైంది. తమకు రాని భాషను తమపై రుద్దటమేంటని, ఇది ఒక విధంగా హిందీ రాని ప్రజలకు అన్యాయం చేసినట్లే అవుతుంద‌ని డిఎంకే సార‌ధ్యంలో జ‌రిగిన‌ ఈ ఆందోళనలో దాదాపుగా డెబ్భైమంది  వరకు మరణించి ఉంటారన్నది అప్ప‌టి ప్రభుత్వ అంచనా.

దీంతో  ఆనాటి ప్రధాని లాల్‌ ‌బహద్దూర్‌ ‌శాస్త్రి  దిగి వ‌చ్చి హిందీయేతర రాష్ట్రాలవారు కోరుకున్నంతకాలం ఆంగ్లం దేశ అధికార భాషగా కొనసాగుతుందని హామీ ఇవ్వ‌టంతో నాటి ఉద్యమం సద్దుమణిగిందన్న‌ది ప్ర‌స్తావ‌న‌ర్హం.ఈ వ్యతిరేకత దృష్ట్యా రెండు భాషలను వినియోగించే విధానం అమలులోకి వచ్చింద‌న్న‌ది నిజం.

కానీ ఇప్పుడు మ‌రోమారు హిందీ విషయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై భిన్న‌స్వ‌రాలు వినిపిస్తునే ఉన్నాయి. రాజ‌కీయ నేత‌ల మొద‌లు సినీప్ర‌ముఖులు స్పందిస్తునే ఉన్నారు. దేశంలో ఉన్న భాషా భిన్న‌త్వాన్ని గౌర‌వించ‌డం ప్ర‌తి భార‌తీయుడి విధి ,. ప్ర‌తి భాష‌కు సంప‌న్న‌మైన చ‌రిత్ర ఉంద‌ని, దాని ప‌ట్ల గ‌ర్వ‌ప‌డాల‌న్నారు. తాను క‌న్న‌డీయునైనందుకు గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు క‌ర్నాట‌క‌మాజీ సిఎంలు సిద్ద‌రామ‌య్య , కుమార‌స్వామిలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

హిందీ భాష విష‌యంలోబాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్‌, కంగ‌నాలు హిందీ జాతీయ భాషంటూ మాట్లాడితే క‌న్న‌డ న‌టుడు సుదీప్ దీనిని వ్య‌తిరేకించారు. ఓ విధంగా వీరి మ‌ద్య ట్వీట్ల ఉద్య‌మం జ‌రిగింది.

ఇటు త‌మిళ‌నాట‌కూడా మ‌ళ్లీ హిందీ వ్య‌తిరేక ఉద్య‌మానికి అక్క‌డి అధికార డిఎంకే స‌న్నాహాలు ఆరంభించిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఇప్పుడు ఈ వివాదం పై భారతదేశం గర్వింప తగ్గ సంగీత దర్శకుడు, ఆస్కార్  అవార్డు గ్ర‌హీత‌ ఏఆర్ రెహమాన్ తనదైన రీతిలో స్పందించారు.  వివిధ భాషా సమూహాల మధ్య అనుసంధాన భాషగా ఇంగ్లీషు స్థానంలో హిందీ ఉండాలన్నప్ర‌తి పాద‌న స‌రికాద‌న్నారు.

గురువారం ఆయ‌న  ఆంగ్ల సంగీతంలో ఎదుగుతున్న ప్రతిభావంత‌మైన సంగీత క‌ళాకారుల‌ను గుర్తించే నెక్సా మ్యూజిక్ రెండో సీజన్‌ను ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొని  మాట్లాడారు. ''భారతీయ భాషల్లోని సంగీతంతో సినీ పరిశ్రమ గొప్పగా నడుస్తోంది. "ఈ చొరవ మా కళాకారులను ప్రపంచవ్యాప్తం చేయడంపై దృష్టి సారించింది, తద్వారా వారు గ్రామీలకు పోటీ పడగలరు... అలాగే అంతర్జాతీయ వేదికలపై ఉండగలరంటూ భార‌తీయ సంగీతంపై, ఇక్క‌డి క‌ళాకారుల‌పై త‌న‌కున్న గౌర‌వాన్నిచాటుకున్నారు. . "ఇతర ప్రపంచం సంగీతం పరంగా భారతదేశం కోసం ఎదురుచూస్తోంది" అని గ‌ర్వంగా ఆయన చెప్పారు.

ఈ సంద‌ర్భంగానే హిందీ భాష‌గురించి ప్ర‌స్తావిస్తూ...   ప్ర‌పంచంలోని అన్ని భాష‌ల‌నూ బేరూజు వేసుకుంటే  ఆంగ్లం ప్రపంచ భాష అని,  ఏదేశానికి వెళ్లినా అక్క‌డ ఏర్ప‌డే ప్ర‌తి కూత‌ల‌త‌ల‌ను ఎదుర్కొన‌టం తో ఆంగ్లం  సహాయపడినంత‌గా హిందీ స‌హాయ ప‌డుతుంద‌ని ఆయన అన్నారు. 

గ‌తంలో నూ ఈ భాషా వివాదం పై రెహ‌మాన్ స్పందించారు.  స్వరకర్త మనోన్మానియం సుందరం పిళ్లై రచించిన తమిళ గీతంలో  'తమిళ దేవత అంటూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అలాగే 20వ శతాబ్దానికి చెందిన తమిళ కవి భారతిదాసన్ రాసిన 'తమిలక్కం' అనే తమిళ కవితా సంకలనంలో   "ప్రియమైన తమిళం మన ఉనికికి మూలం.అని త‌మిళ భాష‌పై త‌న‌కున్న మ‌క్కువ‌ని చాటుకున్న విష‌యం తెలిసిందే. 
 
 2022-05-13  News Desk