Courtesy: twitter/Ruhani Sharma
బాలీవుడ్ పరిశ్రమ.. తెలుగు దర్శకులకు పెద్ద పీట వేస్తోంది. తమ సినిమాలు దర్శకత్వం చేయమని కోరుతోంది. తెలుగులో హిట్ సినిమాలు అందించిన కొందరు దర్శకులవైపు మొగ్గు చూపుతోంది. మొన్న సందీప్ రెడ్డి, నిన్న గౌతమ్ తిన్ననూరి, నేడు శైలేశ్ కొలను...బాలీవుడ్ నుంచి ఆహ్వానాలు అందుకుంటున్నారు. ఈ ముగ్గురు దర్శకులు తెలుగులో హిట్ సినిమాలు తీశారు. ఆ సినిమాలు బాలీవుడ్లో కొందరికి తెగ నచ్చాయి. తమ ప్రేక్షకులకు అందించేందుకు వారు సిద్ధమయ్యారు. తెలుగు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి...వాటిని హిందీలో తెరకెక్కించారు. తెలుగులో ఏ డైరెర్టరైతే దర్శకత్వం వహించాడో అదే డైరెక్టర్‌తో హిందీలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కాలంలో ముగ్గురు దర్శకులకు ఆ అవకాశం లభించింది. వారిలో సందీప్ వంగా మొదటి స్థానంలో ఉన్నాడు.
సందీప్ వంగా
తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయదేవరకొండ నటించిన ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. విమర్శకలు ప్రశంసలు సైతం అందుకుంది. దర్శకుడు సందీప్ వంగా పేరు మారుమ్రోగిపోయింది. హిందీ నిర్మాతల దృష్టి ఈ సినిమాపై పడింది. అదే సినిమాను హిందీలో రీ మేక్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. సందీప్ వంగానే ఈ సినిమాకు దర్శకుడిగా తీసుకున్నారు. ఒరిజినల్ తీసిన ఆ దర్శకుడే హిందీ రీమేక్‌కు వంద శాతం న్యాయం చేస్తాడని భావించారు. సందీప్‌కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. షాహిద్ కపూర్, కైరా అద్వానీలు హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను తెరకెక్కించారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే సందీప్ వంగా అదరహో అనిపించారు. కబీర్ సింగ్ పేరుతో విడుదలైన ఆ సినిమా అక్కడ కూడా సంచలనాలను నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది.
జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి
హీరో నానీతో తీసిన జెర్సీ సినిమా సూపర్ హిట్ అయింది. 2019లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఆ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దశ తిరిగింది. బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. కబీర్ సింగ్ ద్వారా హిట్ అందుకున్న షాహిద్ కపూర్ మరోసారి తెలుగు దర్శకుడి ప్రతిభకు ఫిదా అయ్యాడు. గౌతమ్‌కు కబురు పంపాడు. జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేసే బాధ్యతలు అప్పగించాడు. తనకు అప్పగించిన బాధ్యతలను గౌతమ్ చక్కగా నిర్వర్తించాడు. జెర్సీ హిందీ రీమేక్‌ను అదరహో అనేలా తెరకెక్కించాడు. ఎమోషనల్ సీన్లు బ్రహ్మాండంగా వచ్చాయి. జెర్సీ హిందీ ప్రీమియర్ షో చూసినవాళ్లంగా ఫిదా అయ్యారు. దర్శకుడు గౌతమ్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన జెర్సీ సినిమా షాహిద్ కపూర్ కెరీర్లో మరో హిట్‌ను చేర్చింది.
హిట్ సినిమా దర్శకుడు
తెలుగు హీరో విశ్వక్ సేన్ నటించిన హిట్ (H.I.T)సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు శైలేశ్ కొలను ప్రతిభ సినిమా ప్రపంచానికి తెలిసింది. అక్కడి నుంచి శైలేశ్ వెనుదిరిగి చూడలేదు. అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తునే ఉన్నాయి. బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. H.I.T సినిమాను హిందీలో చేయమని కోరారు. అందివచ్చిన అవకాశాన్ని శైలేశ్ కాదనలేకపోయాడు. హిందీ రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావును లీడ్ రోల్‌కు తీసుకున్నారు. సాన్యా మల్హోత్రా కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. విడుదలకు సిద్ధమయింది. జూలై 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ సినిమా విడుదల తర్వాత శైలేశ్ కొలను ప్రతిభ సినీ ప్రపంచానికి మరోసారి తెలియనుంది.
RAJKUMMAR RAO - SANYA MALHOTRA: 'HIT' RELEASE DATE LOCKED... #Hit: #TheFirstCase - the #Hindi remake of #Telugu film #Hit - to release on 15 July 2022... Stars #RajkummarRao and #SanyaMalhotra... Directed by Dr #SaileshKolanu, who had also directed the original #Telugu version. pic.twitter.com/WDrxVUabmC
— taran adarsh (@taran_adarsh) May 13, 2022