collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / సోయగాలతో మతులు పోగొడుతున్న సాహో సుందరి - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

సోయగాలతో మతులు పోగొడుతున్న సాహో సుందరి

2022-05-30  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

shradha Kapoor-3
 

సాహో సుందరి శ్రద్ధ కపూర్ తన సొగసులతో అందరినీ మైమరపింపచేస్తోంది. లేత గులాబీ రంగు దుస్తులు ధరించి తన లేలేత అందాల విందు పంచుతోంది. తాజాగా ఈ సుందరి చేసిన ఓ ఫోటోషూట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫిదా అయిన ఫాన్స్ పొగడ్తలతో ఇన్
బాక్స్ ను ముంచేస్తున్నారు. 
 
మైండ్ బ్లాక్ చేస్తున్న బ్యూటీ అందాలు: 
శ్రద్ధ కపూర్ ఫ్యాషన్స్ అందరికీ బాగా నచ్చుతుంది. అకేషన్ కు తగ్గట్టుగా అవుట్ ఫిట్స్ ధరించడంలో ఈ బ్యూటీ మొదటి స్థానంలోనే ఉంటుంది. రెడ్ కార్పెట్ లుక్స్ అయినా , క్యాజువల్ డ్రెస్సులు అయినా, డేట్ నై ట్స్ అయినా తన స్టైలిష్ ఫ్యాషన్ లుక్స్ తో ఆదరగోట్టేస్తుంది. తన వార్డ్ రోబ్ లో ఉన్న ఎత్నిక్,  మోడర్న్ అవుట్ ఫిట్స్ ఎప్పుడూ సోషల్ మీడియా ఫాలోవర్స్ మనసు దోచేస్తుంటాయి. తాజాగా ఈ సుందరి లేత గులాబీ రంగు బస్టియర్ మినీ డ్రెస్ వేసుకుని ఫోటో షూట్ చేసింది. ఆ పిక్స్ ను  శ్రద్ద  తన ఇన్ స్టా లో పోస్ట్ చేసి అభిమానుల మనసు దోచేసింది.  ఈ ఫోటోల కింద వై థింక్ జస్ట్ పింక్ అని క్యాప్షన్ ను జోడించింది . 

shradha Kapoor-2
 

పొట్టి డ్రెస్ లో పొడవుకాళ్ల సోయగాలు: 
ఈ అద్భుతమైన మినీ డ్రెస్ ను శ్రద్ధా కపూర్ తన ఫేవరెట్ క్లోతింగ్ లేబుల్  స్టెల్లా ఎంసీకార్ట్నీ నుంచి ఎన్నుకుంది.  ప్లంగింగ్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ ,  కాలర్ పింక్ లేస్, బాడీకాన్ డీటైల్స్ , మినీ హెమ్ లైన్త్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ శ్రద్ధా కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది.  ఈ పొట్టి డ్రెస్ లో తన పొడవు కాళ్లను చూపిస్తూ కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా మినిమల్ మేకప్ , యాక్సెసరీస్ ను ఎంచుకుంది శ్రద్ధా కపూర్.  మెడలో స్లీక్ గోల్డ్ చైన్ వేసుకుని, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు స్టేట్ మెంట్ ఉంగరాలు, పాదాలకు పాయింటెడ్ హిల్స్ వేసుకుని తన లుక్ ను పూర్తి చేసింది. 

shradha Kapoor-1
 

అందం ఈ అమ్మాయి సొంతం: 
తన కురులను మధ్య పాపిట తీసి లీవ్ చేసింది శ్రద్ధా కపూర్. కోరల్ బ్లూ నెయిల్ పాలిష్ ను గోర్లకు వేసుకుంది.కను రెప్పలకు సబ్టిల్ స్మోకీ ఐ షాడో, ఐ లైనర్ మస్కారా వేసుకుంది. పెదాలకు పింక్ లిప్ షేడ్ వేసుకుని మెరిసేటి ఛర్మం తో మెరిసిపోయింది. 

shradha Kapoor
 

 
 


2022-05-30  Lifestyle Desk