collapse
...
Home / జాతీయం / స‌రికొత్త విద్యావిధానం అమ‌లుకు బాట‌లు వేస్తున్న యూజిసి - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News |...

స‌రికొత్త విద్యావిధానం అమ‌లుకు బాట‌లు వేస్తున్న యూజిసి

2022-05-30  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ugc-1
విద్యా రంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన క్ర‌మంలో   విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులను అంచనా వేసే విధానాన్ని మార్చాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) యోచిస్తోంది,   ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న   ప‌దో త‌ర‌గ‌తి.  ఇంటర్ , డిగ్రీ , పీజీ  , పీజీ డిప్లొమా గా ఉన్న విద్యార్హ‌త‌ల స్ధానంలో స‌రికొత్త విధానం తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం

విద్యార్థుల సామర్థ్యాల స్థాయిని  బ‌ట్టి  వివిధ విద్యార్హతలకు స్థాయిలు (లెవల్స్‌ను) నిర్ణయించే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నూతన విధానాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషనల్  సైతం ఇదే త‌ర‌హాలో విద్యార్హ‌త‌ల‌కు సంబంధించిన వివ‌ర‌ణ‌ల‌తో కూడిన‌ ముసాయిదాను విడుదల చేసింది కూడా  దీని ప్ర‌కారం విద్యార్దులు త‌మ చ‌దువుల‌ను ఇక‌పై  లెవెల్స్‌లో పిలుచుకోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికి 5 నుండి 10 స్థాయిలలో  ఉన్న వీటిని స‌మూల ప్ర‌క్షాళ‌న దిశ‌గా యుజిపి త‌న ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 

నిజానికి ప్రస్తుత విధానం ప్రకారం, లెవల్ 5 సర్టిఫికేట్ స్థాయికి అనుగుణంగా ఉంటుంది, డిప్లొమా స్థాయి 6 మరియు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు లెవల్ 8, పిజి డిప్లొమాలు లెవల్ 9 డాక్ట‌రేట్ లెవెల్ 10 గా ఉన్నాయి.  దీంతో  దేశంలోని  విద్యా రంగంలో మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనుంది యుజిసి.  కొత్త విధానం ప్రకారం, స్థాయి 4.5 సామర్థ్యాలతో విద్యార్థి మొదటి సంవత్సరం ముగుస్తుంది. వారి UG కోర్సు లేదా సర్టిఫికేట్‌కు అర్హత కలిగి ఉండాలి. .  ప్రస్తుత వ్యవస్థలో  వ్య‌వ‌హ‌రిస్తున్న  ప్రకారం, లెవల్ 10 అంటే డాక్టరేట్‌ స్థాయి ని సూచిస్తుంది.  అయితే తాజాగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం, ఈ క్రెడిట్‌ల పరిధి 4.5 నుండి 8కి మార్చబడుతుంది.

కొత్త వ్యవస్థ కళాశాలల అంతటా విద్యార్థులు అభ్యాస ఫలితాల ఆధారంగా ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉండేలా చేస్తుంది. ఇది భారతీయ విద్యార్థుల అకడమిక్ క్రెడిట్‌లను విదేశీ కళాశాలలతో సమకాలీకరించడాన్ని కూడా నిర్ధారించ‌డంతో పాటు   వివిధక‌ళాశాల  విద్యార్థులు తాము చ‌దువుతున్న కోర్సుని కాలేజినీ సులభంగా  మార్చుకునే వీలుద‌క్కుతుంద‌ని యూజిసి వ‌ర్గాలు చెపుతున్నాయి. 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మూడేళ్లు ఉన్న డిగ్రీ కోర్సుని ప్రతిపాదిత నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌గా  చేసేందుకు కూడా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఒక విద్యార్ధి ఒకే సమయంలో వేర్వేరు డిగ్రీ లను చేయడానికి, రెండు కళాశాలల్లో ఏకకాలంలో చదువుకోవడానికి వీలు క‌లిపిస్తుంది.   విద్యార్ధి ఏ సమయంలోనైనా ఏ కోర్సులో ప్రవేశించడానికి  లేదంటే మ‌ధ్య‌లో మానివేయ‌టానికి కూడా తాజా ప్ర‌తిపాద‌న‌లు అంగీక‌రించ‌డం విశేషం. 

స‌ద‌రు కోర్సుల‌లో చేరిన విద్యార్ధి  తాము ఇచ్చిన సామర్థ్యాల స్థాయిని ఆధారంగానే వారికి సంబంధిత డిగ్రీ/సర్టిఫికేషన్ ఇస్తారు.  పాఠశాలల మాదిరిగానే, ఉన్నత విద్యలో కూడా విద్యార్థుల ప్ర‌తిభ ఆధార‌ ఫలితాలు ప్రామాణికంగా ఓ ఫ్రేమ్‌వర్క్ చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా వార్షికంగా అంచనా వేస్తారు.

ఇప్ప‌టికే ఈ విష‌యంపై మే 25న యుజిసి చైర్మ‌న్  ఎం  జగదీష్  వర్చువల్ మోడ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మరియు సంస్థల వైస్-ఛాన్సలర్‌లతో నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌లో ప్రతిపాదిత  అంశాల‌నూ చర్చించే  సమావేశాన్ని నిర్వహించారు. ఇది మొద‌లు ఈత‌ర‌హాలో వరుస సమావేశాలను నిర్వ‌హిస్తామ‌ని యుజిసి ప్ర‌క‌టించింది.  ఈ కొత్త మార్గదర్శకాల అమలును పై దేశంలోని వివిధ విద్యాసంస్ధ‌ల ప్ర‌ధాన నిర్వ‌హ‌కులు, విశ్వ విద్యాల రిజిస్ట్రార్లు, వైస్ చైర్మ‌న్‌ల‌తో   కనీసం నాలుగు సమావేశాలు యూజిసి నిర్వహించనున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఇదే   ముసాయిదా  పై రాష్ట్రాల అభిప్రాయాలను సైతం యూజీసీ కోరింది.

ప్ర‌తిపాదిత ముసాయిదా ద్వారా దేశీయ విద్యా విధానంలో అనేక మార్పులు రానున్న‌ట్టు యూజిసి వ‌ర్గాలు చెపుతున్నాయి. కేవ‌లం ఈ విధానం  అకడమిక్  విద్య‌కేకాకుండా ఇత‌ర   సాంప్రదాయ కోర్సులకు నైపుణ్యం-ఆధారిత,  వృత్తిపరమైన కోర్సులతో అనుసంధానిస్తారు. త‌ద్వారా కళాశాల  విద్య  అందునా   ఇంటర్ విద్య మ‌రింత డిసిప్లినరీగామారుతుంద‌ని, విద్యార్ధుల‌కు కూడా అత్యంత‌ సౌకర్యవంతమైనదిగా ఉంటుంద‌ని యూజిసి వ‌ర్గాల మాట‌.అంటే సాంకేతిక విద్య, సాధార‌ణ‌ కోర్సులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులకు సైతం విడివిడిగా లెవల్స్‌ నిర్ధారించనున్నట్టు యూజీసీ తెలిపింది. దీంతో ఏ విద్యార్థి అయినా విదేశాలకు వెళ్లినప్పుడు త‌ను ఏ లెవల్ పూర్తిచేసిందీ చెప్తే సరిపోతుందని చెపుతున్నారు అధికారులు0

ఇక విద్యా భారంగా మారి విద్యార్థులపై వ‌త్తిడి పెరుగుతుండ‌టంతో ఆభారం తగ్గించేందుకు సిలబస్ ని త‌గ్గించాల‌ని నిర్ణ‌యించారు. అలాగే ఇప్ప‌టివ రుకు నిర్వ‌హిస్తున్న‌ 10+2 విధానం స్ధానంలోబదులు 5+3+3+4 విధానాన్ని తీసుకువ‌స్తారు. దీంతో  3 నుంచి 8 ఏళ్ల వరకు పిల్లలకు ఫౌండేషన్ స్టేజీ, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ స్కూల్‌, 11 నుంచి 14 ఏళ్ల వారు మిడిల్ స్కూల్, 14 నుంచి 18 ఏళ్ల వారు సెకండరీ స్థాయిలో ఉన్న‌వారిగా ప‌రిగ‌నింప‌బ‌డ‌తారు.  

కొత్త జాతీయ విద్యా విధానం మేరకు విద్యార్థులకు ఐదో తరగతి వరకు మాతృ భాషలో బోధన సాగించాలి. అలాగే  ఆరో తరగతి నుంచి వృత్తి విద్యా కోర్సులు ఎంచుకునేందుకు వీలుకల్పించ‌డం ద్వ‌రా విద్యార్ధ‌ల సమగ్ర వికాసానికి పెద్దపీట వేయ‌టంతో పాటు చిన్న‌ప్ప‌టి నుంచే విద్యార్థులు తమకిష్టమైన కోర్సులను చదువుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఇక   అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల నుండి పీహెచ్‌డీల వరకు అన్ని కోర్సులకుఈ నియ‌మాల‌ను వర్తింప చేస్తారు.  40 క్రెడిట్స్‌ సాధిస్తే సర్టిఫికెట్‌, 80 క్రెడిట్స్‌ సాధిస్తే డిప్లొమా, 120 క్రెడిట్స్‌ సాధిస్తే డిగ్రీని జారీచేయవచ్చని యూజిసి అధికారులు చెపుతున్నారు.  అంటే అండ‌ర్ గ్రాడ్యూష‌న్‌లో డిగ్రీ   మెదటి సంవత్సరం రెండు సెమిస్టర్లు పూర్తి చేస్తే. 40 క్రెడిట్ పాయింట్లు గా నిర్ణ‌యించి ఆ విద్యార్ధిని లెవల్ 4.5 కేటగిరీలో చేరుస్తారు. అలాగే డిగ్రీ రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు) చదివితే వారికి 80 క్రెడిట్ పాయింట్లుతో.. లెవల్ 5 కేటగిరీ ఆపై డిగ్రీ మూడు సంవత్సరాలు (  ఆరు సెమిస్టర్లు)  పూర్తి చేఇస విద్య‌ర్ధికి 120 క్రెడిట్ పాయింట్లు కేటాయించి, లెవల్ 5.5 కేటగిరీలో చేరుస్తారు

ఈవిధంగానే   డిగ్రీ వొకేషన్ మూడేళ్లకు లెవల్ 5.5 కేటగిరీ.. డిగ్రీ నాలుగేళ్లు ఉంటే లేదా పీజీ డిప్లొమోకు 160 క్రెడిట్ పాయింట్లు తో లెవల్ 6 కేటగిరీగా పరిగణిస్తారు. అలాగే మాస్టర్స్ డిగ్రీ 6.5, ఎంటెక్ కోర్సు లెవల్ 7, డాక్ట‌రేట్ డిగ్రీలకు లెవల్ 8గా పరిగణిస్తారని తెలుస్తోంది.   నాలుగేళ్ల డిగ్రీ కోర్టు తర్వాత ఎం.ఫిల్ చేయకుండానే నేరుగా పీహెచ్‌డీలోకి ప్రవేశం కల్పించ‌డం ఓ విశేష‌మైతే, డిగ్రీ చ‌దువుతూ రెండేళ్ల తర్వాత మానేసిన వారికి కూడా డిప్లోమా ఇవ్వ‌టంతో పాటు ఓ వేళ‌ చదువు మానేసిన వారు దానిని  మళ్లీ కొనసాగించుకునే అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు ఒకే రకమైన నిబంధనలు ఉండ‌టంతో విద్యార్ధులు ఎక్క‌డైనా చ‌దువుకునే వీలు క‌లుగుతుందని చెపుతున్నారు. ప్ర‌స్తుతానికి ఈవిధానం అమ‌లుపై కేంద్రం, యూజిసి మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. రెండేళ్ల క్రితంకేంద్రం ఆమోదించిన కొత్త విద్యా వ్య‌వ‌స్థ ను యూజిసి మ‌రింత మెరుగు ప‌ర‌చి ఈ విద్య సంవ‌త్స‌రం నుంచే అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 



2022-05-30  News Desk