collapse
...
Home / అంతర్జాతీయం / అరుదైన వ్యాధితో ఎదురీదుతున్న గ్రామీ అవార్డ్ విన్నర్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | New...

అరుదైన వ్యాధితో ఎదురీదుతున్న గ్రామీ అవార్డ్ విన్నర్

2022-05-30  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

billish eilish
Courtesy:Twitter/@comforteilishs 

 


డేవిడ్ లెట్టర్‌మాన్ నెట్‌ఫ్లిక్స్ షో 'మై నెక్స్ట్ గెస్ట్ నీడ్స్ నో ఇంట్రడక్షన్' కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్బంగా గ్రామీ అవార్డ్ విన్నర్ బిల్లీ ఐలిష్ తాను టౌరెట్టోస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. 11వ ఏటనే  నరాల అపసవ్యత సమస్యకు చికిత్స్ చేయించుకున్న సుప్రసిద్ధ గాయని బిల్లీ తనకు ఏం జరుగుతోందని ప్రజలు అపార్థం చేసుకునేవారని చెప్పింది. నేను ఫన్నీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని ప్రజలు భావించబట్టే వారు నాకేసి నవ్వేవారని, కానీ వారి పరహాసానికి తానెంతో గాయపడేదాన్నని బిల్లీ చెప్పింది.  


సుప్రసిద్ధ అమెరికన్ గాయని బిల్లీ 18 సంవత్సరాల వయసు లోనే నాలుగు టాప్ గ్రామీ అవార్డూలు గెల్చుకున్న పిన్న వయస్కురాలిగా సంచనలం రేపింది. 2020లో న్యూ ఆర్టిస్ట్, ఆల్బమ్, రికార్డ్, సాంగ్ అనే నాలుగు విభాగాల్లో ఒకేసారి గ్రామీ అవార్డులు గెల్చుకోవడంతో బిల్లీ పేరు సింగీత ప్రపంచలో మార్మోగిపోయింది. కాని తనలోని కొన్ని సంకోచాలు తగ్గుముఖం పట్టేవి కానీ, కొన్ని సంకోచాలు మాత్రం ఇప్పటికీ తనలో సూక్ష్మరూపంలో ఉంటున్నాయని తెలిపింది. తనతో యధాలాపంగా సంభాషణలు జరిపేవారు తనలోని ఈ లక్షణాలను అసలు గమనించేవారు కాదని, కాని తనలోని ఆ సంకోచాలను చూసి తనకు తాను విసిగిపోయేదాన్నని బిల్లీ ఆలస్యంగా తన సమస్య గురించి చెప్పింది.  


టౌరెట్స్ సిండ్రోమ్ అంటే...  

 

టౌరెట్స్ సిండ్రోమ్‌ని నాడీ వ్యవస్థకు చెందిన ఒక సమస్యగా గుర్తించారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ ప్రివెన్షన్ నిర్వచించింది. ఇది ప్రజలను ఉన్నట్లుండి సంకోచానికి గురి చేస్తుంది. ఉన్నట్లుండి వారు కదులుతారు, నడుస్తారు లేక ప్రజలు రిపీట్ చేసే సౌండ్స్ సృష్టిస్తారు. సంకోచాలతో సతమతమయ్యే వారు ఈ చర్యలను తమ శరీరం చేయకుండా ఆపలేరు. ఉదాహరణకు ఈ నెర్వస్ ప్రాబ్లమ్ కి గురైనవారు పదే పదే కళ్లు ఆర్పుతుంటారు. లేదా ఇష్టం లేకున్నా పెద్దగా అరుస్తుంటారు.  


దీన్ని ఎలా పరీక్షిస్తారు  

 

దురదృష్టవశాత్తూ, టౌరెట్ సిండ్రోమ్‌కి పరీక్షలు లేవు. రోగి చరిత్ర మరియు లక్షణాలను బట్టి అంచనా వేస్తారు.  


లక్షణాలను ఇలా అంచనా వేస్తారు  

 

అవసరం లేకున్నప్పటికీ పదే పదే సంకోచాలకు (టిక్స్) గురవుతూ ఉండటం, స్వరం తడబడుతుండటం.ఒక రోజులో చాలాసార్లు ఇలా సంకోచాలు కలుగుతుండటం, ఇది ప్రతిరోజూ సంవత్సరం పాటు కొనసాగుతుంటుంది.18 సంవత్సరాల వయసులో టిక్స్ ప్రారంభమవుతుంటాయి.  

మందులవల్ల ఈ టిక్స్ లేదా సంకోచాలు రావు. ఇతర పదార్థాలు లేదా ఇతర మెడికల్ కండిషన్స్ వల్ల ఇవి సంభవిస్తాయి. లొకేషన్, ప్రీక్వెన్సీ, టైప్, కాంప్లెక్సిటీ, తీవ్రత వంటి వాటి రీత్యా టిక్స్ మారతుంటాయి.  


నివారణ ఎలా    

 

టౌరెట్ సిండ్రోమ్‌కి నివారణ లేదు.పలు మారు మందులు మారుస్తూ పోవడం ద్వారా దీనికి చికిత్స చేస్తారు. పలురకాల థెరపీలను ప్రయోగిస్తారు. రోజువారీ జీవితంలో టిక్స్‌ని కంట్రోల్ చేయడంపైనే దృష్టి పెడతారు.  


ఎంతమందికి ఈ వ్యాధి వస్తుంది  

 

ఈ వ్యాధికి గురైంది ఐలిష్ ఒక్కతే కాదు. అమెరికాలో దాదాపు 2 లక్షలమందికి టౌరెట్ సిండ్రోమ్ తీవ్ర లక్షణాలు పొడసూపాయి. ప్రతి నూరుమందిలో ఒక అమెరికన్ స్వల్ప స్థాయి లక్షణాలు వస్తున్నట్లు తేలింది.  

 

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  
 

 2022-05-30  News Desk