collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న కృతి సనన్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for T...

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న కృతి సనన్

2022-05-31  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Untitled design (19)
 

బాలీవుడ్ బ్యూటీ పొడవుకాళ్ల సుందరి కృతి సనన్ వైవిధ్యమైన వార్డ్ రోబ్ ఎంపికలను ఫ్యాషన్ స్టైల్స్‌ను ఆమె అభిరుచిని మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాము. సొగసైన చీరలైనా, అదిరిపోయే ప్యాంట్‌సూట్స్ అయినా మినీ డ్రెస్సుల్లో అయినా ఈ సుందరి అద్భుతమంగా కనిపిస్తూ అందరి మెప్పును పొందుతుంది. ఈ క్యూటీ తాజాగా జరిగిన దినేష్ విజన్స్‌ చెల్లెలు వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఓ అద్భుతమైన మిరుమిట్లు గొలిపే లెహంగా సెట్‌ను వేసుకుని ధగధగా మెరిసిపోయింది. సీమ గుజరాల్ డిజైనర్ లేబుల్ నుంచి ఈ అందమైన నల్లటి లెహంగాను ఎన్నుకుంది. నలుపు రంగులో ఉన్న మెరుపుల లెహంగా సెట్‌తో కృతి ఓ అద్భుతమైన ఫోటో షూట్ ను చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పాలమీగడ వంటి సోయగాలు ఉన్న కృతి ఈ ట్రెడిషనల్ వేర్‌లో వేరే లెవెల్‌లో కనిపించి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. 
 
మోనోక్రొమాటిక్ లెహంగా సెట్‌లో మైండ్ బ్లాక్ :  

kriti 1
 

సిల్వర్ బీడ్ వర్క్‌, మెరుపుల అలంకరణలతో వచ్చిన ఈ ఆల్ బ్లాక్ మోనోక్రొమాటిక్ అవుట్‌ఫిట్ కృతికి చాలా బాగా కుదిరింది. ఇంకా చెప్పాలంటే ఈ బ్యూటీ అందాలను ఈ లెహంగా సెట్ మరింత రెట్టింపు చేసింది. ఈ లెహంగా సెట్ మీదకు స్ట్రాపీ స్లీవ్స్, ప్లంగింగ్ నెక్‌లైన్ తో అదే రంగులో అవే ప్యాట్రన్స్‌తో ఉన్న స్పగెట్టీ క్రాప్ టాప్‌ను ధరించింది. కృతి ఈ లెంహగా, క్రాప్ టాప్ మీదకు మ్యాచింగ్‌గా ఉండేలా షిఫాన్ దుపట్టాను వేసుకుంది. కనులకు హెవీ ఐ మేకప్ వేసుకుని స్టైలిష్ లుక్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. న్యూడ్ మేకప్‌తో , పెదాలకు న్యూడ్ లిప్ గ్లాస్ వేసుకుని తన హాట్‌ అందాలతో కుర్రాళ్లను రెచ్చగొట్టింది. 
 
షరారా సెట్‌లో సొగసులు వావ్ :  

kriti 2
 

రితికా మిర్చందానీ డిజైనర్ బ్రాండ్ నుంచి ఆకర్షణీయమైన దేశీయ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుని తన గ్లామ్ బార్‌ను రెట్టింపు చేసుకుంది ఈ సుందరి. గోల్డెన్ ఎంబ్రాయిడరీ, పట్టీ వర్క్‌తో వచ్చిన ఎరుపు రంగు షరారా సెట్‌ లో హాట్ మిర్చిలా కనిపించి తన అందాలతో కనువిందు చేసింది. కృతి షరారాకు జోడీగా ప్లంగింగ్ నెక్‌లైన్ గొల్డెన్ వర్క్‌తో వచ్చిన స్పగెట్టీ క్రాప్ టాప్ వేసుకుంది. అదే విధంగా అతే రంగు, ప్యాట్రన్స్ కలిగిన పొడవైన జాకెట్‌ను షరారా సెట్ మీదుగా వేసుకుని కృతి అదరగొట్టింది. ఈ ట్రెండీ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మెడలో చోకర్ నెక్‌లెస్, చెవులకు స్టడెడ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మెరిసపోయింది. తన పట్టుకురులను లూజ్‌గా వదులుకుని న్యూడ్ మేకప్, కనులకు స్మోకీ ఐ ష్యాడో, పెదాలకు గ్లాసీ లిప్ కలర్ వేసుకుని తన గ్లామరస్ లుక్స్‌తో అందరిని ఫిదా చేసేసింది. 
 
బ్లింగ్ మిని డ్రెస్‌ చూసి కుర్రాళ్లు ఫిదా:  

kriti 3
 

కృతి సనన్ ఫ్యాషన్ సెన్స్‌ను ఆమె ధరించే అదిరిపోయే దుస్తులను బట్టి సులువా తెలుసుకోవచ్చు ఇటీవలె బీ టౌన్ లో జరిగిన కరణ్ జోహర్ 50 వ బర్త్‌డే పార్టీకి కోసం చిన్నది బ్లింగ్ మిని డ్రెస్‌ వేసుకుని అదరగొట్టింది. సూర్య సర్కార్ డిజైనర్ లేబుల్ నుంచి ఎన్నుకున్న డీప్ రెడ్ మిని డ్రెస్ లో కృతి నిజంగా అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ప్లంగింగ్ నెక్‌లైన్ , అసమాన హెమ్‌లైన్, షార్ట్ ట్రైల్ కలిగిన ఫుల్ స్లీవ్స్ బాడీ హగ్గింగ్ డ్రెస్ లో కృతి ఎంతో హాట్ గా కనిపించి యూత్ మైండ్ బ్లాక్ చేసింది. చెవులకు డాంగ్లింగ్ ఇయర్‌రింగ్స్, చేతివేళ్లకు స్టేట్‌మెంట్ ఉంగరాలను పెట్టుకుని, పాదాలకు బ్లాక్ స్ట్రాపీ హీల్స వేసుకుని అవుట్‌ఫిట్‌కు మరింత గ్లామర్‌ను జోడించింది. తన సిల్కీ హెయిర్ ను లూజ్‌గా వదులుకుని న్యూడ్ మేకప్ తో హెవీ ఐ మేకప్‌తో , పెదాలకు గ్లాసీ న్యూడ్ లిప్ కలర్ పెట్టుకుని అదరగొట్టింది. 
 
 
 
 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి  

 



2022-05-31  Lifestyle Desk