collapse
...
Home / అంతర్జాతీయం / పుతిన్‌కు ముదిరిన క్యాన్సర్.. ఇక మూడేళ్లే జీవిస్తారట..! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News |...

పుతిన్‌కు ముదిరిన క్యాన్సర్.. ఇక మూడేళ్లే జీవిస్తారట..!

2022-05-31  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

putin-6
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు క్యాన్సర్‌ వ్యాధి బాగా ముదురిపోయింది. మహా అయితే ఇక ఆయన మూడేళ్లకు మించి జీవించరని రష్యా ఇంటెలిజెన్స్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. FSB (రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్) మాజీ  అధికారి బోరిస్ కార్పిచ్కోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. 69 ఏళ్ల పుతిన్ ఈ క్రమంలోనే తన కంటి చూపును సైతం కోల్పోతున్నారు. పుతిన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందన్న ఊహాగానాల మధ్య ఈ సమాచారం వచ్చింది. అయితే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆదివారం నాడు అధ్యక్షుడు పుతిన్ అనారోగ్యంతో ఉన్నారనే ఊహాగానాలను కొట్టిపారేశారు. ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదని తేల్చి చెప్పారు. అంతగా సందేహం ఉంటే.. పుతిన్ ప్రసంగాల వీడియోలను చూడాలని సూచించారు. అయితే బ్రిటన్‌కు సంబంధించిన మీడియా సంస్థలు మాత్రం.. తన అనారోగ్య విషయాన్ని వైద్యులు పుతిన్‌కు సైతం చెప్పేశారని వెల్లడిస్తున్నాయి.

పుతిన్ శరీర అవయవాలు పూర్తిగా బలహీనమయ్యాయి..

మరో బ్రిటన్ మీడియా సంస్థకూడా గతంలో పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి ఓ కథనాన్ని ప్రచురించింది. పొత్తి కడుపులోని కొన్ని స్రావాలను తొలగించేందుకు సంబంధించిన శస్త్రచికిత్సను పుతిన్ చేయించుకున్నారనేది ఆ కథనం సారాంశం. ‘‘పుతిన్ శరీర అవయవాలు పూర్తిగా బలహీనమయ్యాయి. వాటి పనితీరు ప్రస్తుతం అదుపులో లేదు’’అంటూ బ్రిటన్‌కు చెందిన ‘మెట్రో’ మీడియా వెబ్ సైట్ కూడా ఒక స్టోరీని ఇటీవల ప్రచురించింది. బ్రిటన్‌ మీడియా సంస్థ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. "పుతిన్ తలనొప్పితో బాధపడుతున్నాడని మాకు తెలిసింది. ఆయన టీవీలో కనిపించినప్పుడు తన ప్రసంగ పాఠమంతా పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. ప్రతి పేజీలో రెండు వాక్యాలు మాత్రమే ఉన్నాయి. దీనిని బట్టి ఆయన దృష్టి పూర్తిగా క్షీణిస్తోందని అర్థమవుతోంది’’ అని పేర్కొంది.

సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు..

అయితే దృష్టి లోపం ఉన్నట్లు అంగీకరించడం పుతిన్‌కు ఇష్టం లేదని బోరిస్ పేర్కొన్నారు. అంతేకాదు పుతిన్‌ కాళ్లూ, చేతులు వణకడం సమస్య బాగా పెరిగిపోయిందని తెలిపారు. తన కింద పనిచేసే సిబ్బందిపై చీటికీమాటికీ కోపగించుకుంటున్నారని, విపరీతమైన చిరాకుతో పాటు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని సదరు నిఘా అధికారి చెప్పారు. ఇక యూకే ఇంటెలిజెంట్‌ అధికారి క్రిస్టోఫర్‌ స్టీల్‌ కూడా పుతిన్‌ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని తెలిపారు. సమావేశాలను పూర్తి చేయకుండానే పుతిన్‌ మధ్యలో వెళ్లిపోతున్నారని, ఆయన పరిస్థితి నానాటికీ దిగజారుతోంది అనడానికి ఇదే నిదర్శనమని క్రిస్టోఫర్‌ తెలిపారు.

విచక్షణ ఉన్నవాడేవడూ.. ఇలా ప్రవర్తించడు..

క్రిస్టోఫర్ వ్యాఖ్యలను సైతం సెర్గీ లావ్రోవ్ కొట్టిపడేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. ‘విచక్షణ ఉన్నవాడేవడూ.. ఇలా ప్రవర్తించడు, ఉత్త ప్రచారాలు చేయడు’ అంటూ పుతిన్‌ అనారోగ్య కథనాలపై ఒకింత ఫైర్ అయ్యారు. ఈ అక్టోబరుతో పుతిన్‌కు 70 ఏళ్లు నిండుతాయని... అయినా రోజూ ఆయన వార్తల్లో కనిపిస్తున్నారు కదా? అని ప్రశ్నించారు. ‘నిత్యం టీవీల్లోనూ ప్రసంగిస్తున్నారు.. కొందరికి కళ్లు మూసుకుపోయినట్టున్నాయి.. అయినా పుకార్లను వ్యాప్తి చేయడం వాళ్లకేం కొత్త కాదు’ అంటూ పాశ్చాత్య మీడియాను ఉద్దేశించి సెర్గీ లావ్రోవ్ మండిపడ్డారు.

 

 

 

 2022-05-31  News Desk