collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / టీడీపీకి దివ్యవాణి రాజీనామా.... అసలు మహానాడులో ఏం జరిగింది? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu Ne...

టీడీపీకి దివ్యవాణి రాజీనామా.... అసలు మహానాడులో ఏం జరిగింది?

2022-05-31  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

divyavani-6
ఒక నేత పార్టీకి రాజీనామా చేస్తున్నారు అంటే.. ముందు నుంచే ఊహాగానాలు మొదలవుతాయి. బుజ్జగింపులు జోరందుకుంటాయి. కొన్ని రోజుల హడావుడి అయితే నడుస్తుంది. కానీ ఏ హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా తాను టీడీపీకి రాజీనామా చేసినట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి తేల్చేశారు. ట్విటర్ వేదికగా తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. తనకు మహానాడులో అవమానం జరిగిందని ఆరోపించారు. అసలు మహానాడులో ఏం జరిగింది? కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న తెలుగు తమ్ముళ్లలో ఫుల్ జోష్ నింపిన మహానాడులో అసలు ఏం జరిగింది. అంతా బాగుంది.. ఇక వైసీపీ ప్రభుత్వంపై సమరమే అన్నట్టుగా సాగిన మహానాడు ఒక మహిళా నేత రాజీనామా వరకూ ఎందుకెళ్లింది? పైగా ప్రముఖ వైసీపీ నేత కూతురు సైతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయి తాను పార్టీలోకి రానున్నట్టు సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే మరికొన్ని వలసలు కూడా ఉంటాయన్న ఊహాగానాలు ఊపందుకుంటున్న సమయంలో దివ్యవాణి రాజీనామా విషయం పార్టీకి ఒకింత షాకే.

స్ట్రాంగ్ కౌంటర్లకు కొదవ లేదు..

‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల  ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో దివ్యవాణి పేర్కొన్నారు. టీడీపీలో మంచి వక్తగా, టీడీపీ తరఫున గట్టి స్వరం వినిపిస్తూ వస్తున్నారు దివ్యవాణి. వైసీపీ అధినేత మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలకు, మహిళా నేతలకు సైతం స్ట్రాంగ్ కౌంటర్లకు కొదవ లేకుండా ఇస్తుంటారు. నిన్న మొన్నటి వరకూ దివ్యవాణి అదే తీరును కొనసాగించారు. మరి ఇంత సడెన్‌గా రాజీనామా ఎందుకు చేసినట్టు? ఇది ముంది నుంచి అనుకుని చేశారా? లేదంటే అప్పటికప్పుడు ఏదో అవమానం జరిగిందని చెప్పారా? అంటే బయటకు రాకున్నప్పటికీ ఆమె ప్రి ప్లాన్డ్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది.

దివ్యవాణి రాజీనామా ప్రీ ప్లాన్డా?

ఇటీవల దివ్యవాణి వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి కొడాలి నాని గురించి మాట్లాడిన వ్యాఖ్యలే తన రాజీనామా ప్రీ ప్లాన్డ్ అనడానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్యవాణి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ.. మాజీ మంత్రి కొడాలి నానితో కానీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే దివ్యవాణి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి చూస్తే.. దివ్యవాణి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సుముఖంగా ఉన్నారని.. ముందుగానే అనుకుని పార్టీ మారేందుకు కారణాలు వెతుక్కున్నారని టీడీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు.

మహానాడులో ఏం జరిగింది?

తన రాజీనామాకు మహానాడులో జరిగిన అవమానమే కారణమని దివ్యవాణి చెప్తున్నారు. తనకు ఘోర అవమానం జరిగిందని రెండ్రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని.. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. తానేమీ మాటలు రాని వ్యక్తిని కానని.. నిస్వార్ధంగా పార్టీకి సేవ చేస్తున్నానని తెలిపారు. టీడీపీలో తన సేవలకు గుర్తింపే లేదన్నారు. ఒక క‌ళాకారుడు (NTR) పెట్టిన పార్టీలో తనలాంటి క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డం కలచివేసిందన్నారు. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదన్నారు. ఇన్ని రోజులు ాను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నానని దివ్యవాణి చెప్పుకొచ్చారు.

 

 

 



2022-05-31  News Desk