collapse
...
Home / అంతర్జాతీయం / పాఠ్య‌పుస్త‌కాల‌లో జాత్యహంకార, అశ్లీల చిత్రాలు - చైనీయుల ఆగ్ర‌హం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telu...

పాఠ్య‌పుస్త‌కాల‌లో జాత్యహంకార, అశ్లీల చిత్రాలు - చైనీయుల ఆగ్ర‌హం

2022-05-31  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

chaina-1
 

చిన్నారులు చదువుకునే పాఠ్యాంశాలలో 'జాత్యహంకార, అశ్లీల' చిత్రాలు చోటు చేసుకోవటం చైనా దేశస్ధుల ఆగ్రహానికి కారణమైంది. ప్రధానంగా అమెరికన్ వ్యతిరేక భావజాలాన్ని పాఠంగా పుస్తకాలను ఇటీవల బ్లూమ్బెర్గ్/వీబో చైనా అనే పేరుతో ప్రభుత్వ పబ్లిషర్ ప్రచురించింది. ఈపుస్తకాలలో  'జాత్యహంకార,   అశ్లీలతలతో కూడిన చిత్రాలు కూడా ఉండటంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈవిషయమై నిరసనప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి.   ప్రభుత్వ-పబ్లిషర్ ప్రచురించిన పుస్తకాలులో చిన్న కళ్లతో పిల్లలను చిత్రించడంతో పాటు నక్షత్రం-చారల చొక్కాతో ఉన్న బాలుడి చిత్రం కూడా ఉంది.  ఇది ప్రజలలో తీవ్ర కోపాన్ని కలిగించడంగమనార్హం.

తమ పిల్లల పుస్తకాలలో జాత్యాహంకార వికారాన్ని, అశ్లీల  దృష్టాంతాన్ని ఉపయోగించారని  ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రచురణకర్త పట్ల చైనీస్ ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేర కు  చైనీస్ విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలతో విచారణ జరిపిన బ్లూమ్బెర్గ్ నివేదిక అందించారు.  ఈ నివేదికపై స్పందించిన ప్రభుత్వం పీపుల్స్ ఎడ్యుకేషన్ ప్రెస్ ప్రచురణలలో ప్రాథమిక పాఠశాల పాఠ్యపుస్తకాలలోని దృష్టాంతాలను తక్షణం మార్చమని ప్రచురణకర్తలకు ఆదేశించింది. సదరుతప్పును 'సరిదిద్దండంతో పాటు పుస్తకాలలో మార్పులు చేయాలని ప్రచురణకర్తను కోరింది.   సెమిస్టర్ లోగావీటిసవరణలుపూర్తి చేసి తక్షణం విద్యాశాఖకు అందించాలని,  సదరు మంత్రిత్వ శాఖ సమీక్షించి ఆమోదించాకనే పాఠ్యపుస్తకాలను విడుదల చేయాలని తన ఆదేశాలలోస్పష్టం చేసింది.

చైనీస్ ప్రజానీకం దృష్టాంతాలు జాత్యహంకారంగా ఉన్నాయని చెబుతూ ఈ సమస్యలను లేవనెత్తారు,   . కొన్ని చిత్రాలలో, అబ్బాయిలు వారి ప్యాంటుపై పురుష జననేంద్రియాల రూపురేఖలతో కనిపిస్తున్నారని చైనా లో ఎక్కువగా వినియోగించే సోషల్ మీడియా అవుట్లెట్ వీబోలో కొందరు పేర్కొన్నారు. దీంతో గత వారం నుండి చైనాలొని ఆ వీబో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో  టాప్ ట్రెండింగ్ ఐటెమ్లలో ఒకటి గా మారిపోయింది.  నెటిజన్లు ఎత్తిన సమస్యపై   హ్యాష్ట్యాగ్ 2.2 బిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించబడటం గమనార్హం.

దీంతో చైనా ప్ర‌భుత్వం దిగి రాక తప్పలేదు. చిత్రాలు అగ్లీగా, అశ్లీలంగా మరియు జాత్యహంకారంగా ఉన్నాయని విస్తృతంగా బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తడంతో,  అత్యుత్తమ చైనీస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి  అనుగుణంగా ఉండేలా ప్రజలుచేస్తున్న వ్యాఖ్యలు- సలహాలను తీవ్రంగా పరిగణిస్తూ సమస్యను  పరిష్కరించేందుకు శనివారం (మే 28) ఈ ఆదేశాలు జారీ చేసిందని జనం మాట.

మరోవైపు  పబ్లిషర్ కూడా శనివారం తన అధికారిక ఉయ్చాట్ ఖాతాలో బహిరంగ క్షమాపణలు చెపుదూ పోస్టు పెట్టారు. ప్రజల ఆందోళనలతో తమ సంస్ధ తీవ్ర అపరాధ భావనలోనికి వెళ్లి పోయిందని చెప్పుకొచ్చింది విద్యా పుస్తకాలను పునఃరూపకల్పన చేసి కొత్తవి  అందించేందుకు  నాణ్యమైన డిజైనర్లను ఎంపిక చేయనున్నామని,ఈ క్రమంలో ఇతర బోధనా సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి  తల్లిదండ్రులను,  ఉపాధ్యాయులకు అవకాశం అందిస్తామని, వారి అమూల్యమైన సలహాలను వినడానికి ప్రత్యేక ఓ కార్యవర్గం కూడా ఏర్పాటు చేసినట్టు వివరించింది. చిన్నారుల బోధనా సామగ్రి ని సరైన   విలువ లతో రూపొందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది.

ఏది ఏమైనా చైనా  విద్య మంత్రిత్వ శాఖ సారద్యంలో ప్రచురిత మైన పాఠ్యపుస్తకాలు వివాదం కావటం విమర్శలకు తావిచ్చిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ప్రాథమిక మరియు మధ్య-పాఠశాల పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్న డిమాండ్  చైనా లోని ట్విట్టర్ వైబో లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో   అగ్ర ట్రెండింగ్ అంశాలలో ఒకటిగా కొనసాగిందనే చెప్పక తప్పదు.

 2022-05-31  News Desk