collapse
...
Home / చదువు / ఉత్త‌ర ప్ర‌దేశ్ కుర్రాడికి గూగుల్ భారీ ఆఫ‌ర్‌.. ఎన్ని కోట్లో తెలుసా! - 6TV News : Telugu in News | Telugu News | Latest...

ఉత్త‌ర ప్ర‌దేశ్ కుర్రాడికి గూగుల్ భారీ ఆఫ‌ర్‌.. ఎన్ని కోట్లో తెలుసా!

2022-06-01  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

pratham prakash
Courtesy:Twitter/@JagsVishwakarma 

 

అల‌హాబాద్ లోని  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో  గ్రాడ్యుయేట్ అయిన  ప్రథమ్ ప్రకాష్ గుప్తా అనే విద్యార్ధి కి సెర్చి ఇంజ‌న్ గూగుల్  (Google) లో  రూ. 1.4 కోట్ల వార్షిక వేతనంతో ( నెలకు దాదాపు రూ. 11.6 లక్షల) ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ఇత‌నితో పాటు IIIT అలహాబాద్ సంస్థ‌లోని  M.Tech బ్యాచ్‌కు చెందిన పలువురు  విద్యార్థులు కూడా ప్ర‌ముఖ  టెక్ కంపెనీల‌లో ఉద్యోగాలు సంపాదించారు.

గూగుల్ లండన్ బ్రాంచ్‌లో గుప్తా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. అత‌ను ఈ యేడాదిలో ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది అయితే ఖ‌చ్చిత‌మైన  టైమ్  త‌దిత‌ర వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు.

గుప్తా  తన అధికారిక లింక్డ్‌ఇన్ ఖాతాలో టెక్ దిగ్గజం నుండి ఆఫ‌ర్ అందుకున్నాన‌ని  ఎంతో ఆనందంతో  ప్రకటించాడు. “గత కొన్ని నెలలుగా, నేను ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద సంస్థల నుండి అద్భుతమైన అవ‌కాశాల‌ను  పొందే అదృష్టం కలిగింది. నేను గూగుల్ (Google) నుండి వ‌చ్చిన 
ఆఫర్‌ను అంగీకరించాను. ఈ విష‌యాన్ని  మీతో పంచుకోవడానికి  ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత త్వరలో వారి లండన్ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరబోతున్నాను. నా కెరీర్‌లో ఈ కొత్త దశ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను! ”  అంటూ గుప్తా లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

IIIT అలహాబాద్ M.Tech బ్యాచ్‌కి చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ సంవత్సరం కోట్లాది రూపాయ‌ల ప్యాకేజీలను అందుకున్నారు. అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్, యాపిల్ , నెట్‌ఫ్లిక్స్ వంటి అగ్ర‌శ్రేణి  టెక్ కంపెనీలు ఈ విద్యార్థులకు ఆఫర్‌లను అందించాయి.

గూగుల్ అందించే 1.4 కోట్ల ప్యాకేజీ అన్నింటికంటే భారీ  ఆఫ‌ర్‌. ఆ తర్వాత అమెజాన్ అనురాగ్ మ‌కాడే కు రూ.1.25 కోట్లు, రుబ్రిక్  కంపెని  అఖిల్ సింగ్ కు రూ.1.2 కోట్ల ప్యాకేజీలను అందిస్తున్నాయి.  దాదాపు 48% మంది బి.టెక్‌(B.Tech) విద్యార్థులు ఫేస్ బుక్ (Facebook), యాపిల్ (Apple), అమెజ‌సాన్ (Amazon) వంటి ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ‌ల నుండి ఉద్యోగ అవ‌కాశాల‌ను  పొందారు.  అలహాబాద్‌లోని ఐఐఐటి  M.Tech విద్య‌మార్ధుల‌కు  100% ప్లేస్‌మెంట్ రావడం ఇదే ప్ర‌థ‌మం.

 

మరిన్ని చదువు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

 

 



2022-06-01  Education Desk