collapse
...
Home / తెలంగాణ / కత్తి తిప్పుతున్న తెలంగాణ బిడ్డలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | New...

కత్తి తిప్పుతున్న తెలంగాణ బిడ్డలు

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

bhavani devi
Courtesy:Twitter/@achyuta_samanta  

 

ఏడాది క్రితం టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరిగిన సమయానికి మన దేశంలో చాలా కొద్ది మందికి ఫెన్సింగ్ కత్తి పోరాటాలు) క్రీడ గురించి చాలా కొద్ది స్థాయిలో మాత్రమే పరిచయం ఉండేది. అయితే చెన్నైకి చెందిన భవానీ దేవీ ఈ విషయంలో చరిత్ర సృష్టించారు. మెగా ఈవెంట్స్ కు ఎంపిక కావడం ఆమె సాధించిన తొలి విజయం. అప్పటి నుంచి యువతరంలో ఈ క్రీడ గురించిన ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ రకంగా ఫెన్సింగ్ క్రీడకు ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి ముందే తెలంగాణ రాష్ట్రంలోని ఒక కుటుంబం తమ జీవితాలనే ఈ క్రీజ పురోగతికి అంకింత చేశారు. నల్గొండ జిల్లా చందూరు మండలం బంగారి గడ్డ గ్రామానికి చెందిన ఆర్టీసీ లో సాధారణ బస్సు డ్రైవర్ షేక్ హుస్సేన్. ఆయన తన ముగ్గురు పిల్లలను – షేక్ ఫౌజియా, షేక్ నజియా, షేక్ ఇలియాసొద్దీన్ - ఫెన్సింగ్ క్రీడలోకి ప్రోత్సహించారు.  చాలా చిన్నతనంలోనే వారు హకీంపేట లోని రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూలులో ప్రవేశించి శిక్షణ పొందుతూ వచ్చారు. ముందుగా షేక్ ఫౌజియా తన 19వ ఏట కత్తి చేత పట్టింది. ఆమెతో మాట్లాడినప్పుడు ఆసక్తికరమైన అంశాలు కొన్ని తెలిశాయి. తండ్రి షేక్ యూనిఫారమ్ ఉండే వృత్తులపైనే విపరీతమైన మోజు ఉన్న వాడు. అంటే పోలీసు, ఆర్మీ, లేదాడిఫెన్స్ సంబంధిత ఉద్యోగాలనే అభిమానించేవాడు. కానిస్టేబుల్ కావాలన్న ఆశతో ఆయన నాలుగు సార్లు ప్రయత్నించి విజయం సాధించలేకపోయాడు. ఇక ఆర్థిక సమస్యలు నిత్యం ఉండేవే. వాటి నుంచి గట్టెక్కడానికే ఆయన ఆర్టీసీలో ఉద్యోగం చేపట్టాడు. నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే ఫౌజియా స్పోర్ట్స్ స్కూలులో అడుగు పెట్టింది. మొదట్లో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ ప్రారంభించింది. ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంతో ఫెన్సింగ్ శిక్షణకు సిద్ధమైంది. ఆరో తరగతిలో ఉన్న సమయం అది. కోచ్ తుకారాం ప్రోత్సాహం కూడా అందుకు కారణమని చెప్పాలి. చాలా శ్రద్ధగా ఆయన తర్ఫీదు ఇచ్చేవాడు. రెండేళ్ల తరువాత చెల్లెలు నజియా, తమ్ముడు ఇలియాసొద్దీన్ ఆమె వెంట అడుగులు వేశారు. అప్పటికి ఇలియాసొద్దీన్ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్) చదువుతుండేవాడు.    

ఎన్నో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న నజియా జూనియర్ నేషనల్స్ పోటీలో బ్రాంజ్, జూనియర్ నేషనల్స్ లో సిల్వర్ పతకం సాధించింది. తరువాత కొద్ది కాలం ఆర్మీలో ఆఫీసర్ అయ్యేందుకు ఫెన్సింగ్ కు విరామం ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఆసక్తి పూర్తిగా ఆర్మీ ప్రవేశంపైనే ఉంది.  దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది ఇప్పుడు ఆమె లక్ష్యం. సైన్యంలో చేరితే మెరుగైన అవకాశాలు, సదుపాయాలు లభిస్తాయని ఆమె గట్టిగా విశ్వసిస్తోంది. బంధువులు, మిత్రులు ఎందరు అడ్డగించినా తండ్రి ప్రోద్బలమే తనను ముందుకు నడిపిస్తోందని ఆమె సోదరి నజియా తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నజియా ఇప్పటికి మూడు అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, తాష్కెంట్ లో జరిగిన ఆసియన్ చాంపియన్ షిప్ పోటీలలో టీమ్ ఈవెంట్ లో సిల్వర్ పతకాన్ని సాధించింది. వ్యక్తిగత పోటీలలో 26వ ర్యాంకు సాంధించింది. ఈ ఏడాది దోహా ఈపీ గ్రాండ్ ప్రిక్స్ పోటీలలోనూ, దుబాయ్ లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ లలోనూ కూడా పాల్గొని సంప్తికరమైన ఫలితాలు సాధించింది. ప్రస్తుతం ఆమె ఔరంగాబాద్ లోని స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నది. ఒలింపిక్ మెడల్ సాధనే లక్ష్యంగా ఆమె కృషి చేస్తోంది. ఇక చిన్నవాడు (పదో తరగతి) ఇలియాసొద్దీన్ మినని నేషనల్స్ పోటీలలో సిల్వర్ విజేత గా నిలిచాడు.    

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి   
 



2022-06-01  News Desk