collapse
...
Home / బిజినెస్ / ఆటోమొబైల్ / నేటి నుంచి పెరిగిన మోటారు వాహ‌న బీమా ప్రీమియం ధ‌ర‌లు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | N...

నేటి నుంచి పెరిగిన మోటారు వాహ‌న బీమా ప్రీమియం ధ‌ర‌లు

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

insurence
 

వేతన జీవులు.. కరోనా   నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి.  నెల స‌రి జీతాలు తప్పించి మార్కెట్‌లో కొనుగోలు చేసేవ‌స్తువుల‌ అన్నింటి ధ‌ర‌లు పెరిగిపోతు ఆకాశంవైపుప‌రుగులుపెడుతుంటే ఏం చేయ‌లేని నిస్సాహ‌స్థితి లో ఉన్న‌  ఆ వేదన వారిది.  ధరాఘాతాల దెబ్బల్ని తట్టుకోవటం కష్టంగా మారుతున్న త‌రుణంలోపెట్రో, డీజ‌ల్‌ద‌ర‌లు అమాతం రోజు వారీ   పెంచేసి, ఏదోతాము మాత్రం సామాన్యుడికోస‌మే ఉన్నామంటూ రూపాయ‌ల్లో త‌గ్గించి చిద్విలాసాలు పోయే కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా వాహ‌న భీమాను అమాంతం పెంచేసి మ‌రోమారు జ‌నంన‌డ్డి విరిచింది.  ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

కొవిడ్ నేపథ్యంలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ మీద రెండేళ్లు విధించిన మారిటోరియం విధించిన కేంద్రం  తాజాగా ప్రీమియం రేట్లను  పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  దీంతో మ‌న దేశంలో ఇక  లో కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోళ్లు, అమ్మ‌కాలు ఖరీదైపోవ‌టంఖాయ‌మ‌ని వ్యాపార‌వేత్త‌లు ఆందోళ‌న‌వ్య‌క్తం చేస్తున్నారు.  ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవ‌ల ఇచ్చిన‌ కొత్త నోటిఫికేషన్‌తో, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్  ప్రీమియం అమాంతం పెరిగి, వాహనాలు మరింత ఖరీదైనవిగా మార్చేస్తున్నాయ‌ని ఆవ‌ర్గాలు చెపుతున్నాయి.  

కొత్త మరియు పాత వాహనాలకు కొత్తగా పెరిగిన బీమా ప్రీమియం ఓ సారి ప‌రిశీలిస్తే...

150 సిసి కంటే ఎక్కువ ప్రీమియం బైక్‌లు 15%,  1000-1500 సిసి మధ్య కార్లు 6%, 1000 సిసి వరకు కార్లు 23%, 150 సిసి కంటే తక్కువ ఉన్న స్కూటర్ మరియు మోటార్ సైకిళ్ళు 17% పెరిగాయి.   ఈ  ప్రీమియం పెంపు కొత్త కార్లు , ద్విచక్ర వాహనాల ఆన్-రోడ్ ధరపై ప్రభావం చూపుతుందని వాహ‌న‌కొనుగోళ్లు త‌గ్గే ఆస్కారం ఉంద‌ని షోరూంల నిర్వ‌మౄకులు చెపుతున్నారు.

ఇప్పటికే   పెరిగిన ముడిసరుకు ధరలతో వాహ‌న మార్కెట్‌ అల్లకల్లోలాన్ని ఎదుర్కొంటోంది.   విక్రయాల పరంగా వాహన తయారీదారుకు సైతం ఇది  ఇబ్బంది కలిగించే ప‌రిణామం.   పెరిగిన బీమా ప్రీమియంతో కలిపి,  కొనుగోలుదారులు కొత్త వాహన   కొనుగోళ్లపై అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇప్ప‌టికే  ఓఈఎంలు వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి దీనికితోడు  వాహ‌న అమ్మ‌కందారుల లాభాలు క‌లుపుకుంటే  స‌ద‌రు వాహ‌నం మరింత ప్రియం కావ‌టం ఖాయంగాక‌నిపిస్తోంది..

మార్కెట్‌లోని ద్విచక్ర వాహనాలు వాటి ఆన్-రోడ్ ధరలలో దాదాపు 15 శాతం పెరుగుదల ఖాయంగా క‌నిపిస్తోంది.   బీమా ప్రీమియం పెంపు  కార‌ణంగా బజాజ్ పల్సర్, కేటీఎం ఆర్‌సి 390, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్  తోస‌హా అనేక ఇతర 150 సిసి కంటే ఎక్కువ సిసి  కొత్త మోటార్‌సైకిల్ కొనుగోలుదారులు బీమా కోసం 17 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని షోరూం నిర్వాహ‌కులు చెపుతున్నారు. ఈపెంపుద‌ల‌కార‌ణంగా కొనుగోళ్లు మంద‌గించే అవ‌కాశాలూ ఉన్నాయన్న‌ది వారి ఆవేద‌న‌.

మంత్రిత్వ‌శాఖ విడుద‌ల చేసిన‌ నోటిఫికేషన్ ప్రకారం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు, పెరిగిన ప్రీమియంపై 7.5 శాతం సడలింపు అందించబడుతుంది. 30 కిలో వాట్   సామర్థ్యం కంటే ఎక్కువ ఉన్న బిఈవిలకు, రూ. 2904 ప్రీమియం వసూలు చేయబడుతుంది, అయితే తక్కువ సామర్థ్యం ఉన్న వాటికి, రూ. 1,780 విధించబడే అవ‌కాశాలున్నాయి.

ప్ర‌స్తుతం ఉన్న ప్రీమియం వాహనాలకు, ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా థర్డ్-పార్టీ ప్రీమియం 23 శాతం పెరిగింది. అలాగే 1000  సిసి నుండి 1500 సిసి మధ్య ఇంజ‌న్ సామ‌ర్ధ్యం ఉన్న‌ కార్ల కొత్త రిజిస్ట్రేషన్లు స‌మ‌యంలో థర్డ్-పార్టీ బీమా ప్రీమియం  11 శాతం పెంపు ఉంటుంది.అంటే ఈ కార్లు 3,221 రూపాయల- 3,416 రూపాయల భీమా పెరిగే ఆస్కారంఉంది, అలాగు కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ప్రైవేట్ యాజమాన్యంలోని పాతకాలపు కార్లపై 50% తగ్గింపు, విద్యుత్ వాహ‌నాల కోసం కొత్త ప్రీమియంపై 15 శాతం సడలింపు అనుమతించబడుతుంది. ఇక టూవీల‌ర్స్ విష‌యానికి వ‌స్తే 150 సిసి కంటే ఎక్కువ కానీ 350 సిసి కంటే ఎక్కువ కాని ఉంటే  1,366 మరియు 350 సిసి కంటే ఎక్కువ ఉంటే, సవరించిన ప్రీమియం రూ. 2,804 ఉండ‌బోతోంది. ఇలా స‌వ‌రించిన బీమా ప్రీమియంలు అన్నీజూన్ 1నుంచి అంటే ఈ రోజు నుంచే అమ‌లు కానున్నాయి.

 

 2022-06-01  News Desk