collapse
...
Home / బిజినెస్ / ఆటోమొబైల్ / దుమ్మురేపిన మే నెల మారుతి కార్ల అమ్మకాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telug...

దుమ్మురేపిన మే నెల మారుతి కార్ల అమ్మకాలు

2022-06-02  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

maruthi cars
 

దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అమ్మకాలు గత మే నెలలో 161,413 యూనిట్లు విక్రయించింది.  కాగా దేశీయ మార్కెట్లో 128,000 యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. కాగా గత నెలలో 27,191 యూనిట్లు ఎగుమతులు చేసినట్లు తెలిపింది.  ఒక నెలలో ఈ స్థాయిలో కార్ల ఎగుమతులు చేయడం ఇదే మొదటిసారని పేర్కొంది.  కాగా మారుతి సుజుకి గత నెల అమ్మకాలు .. క్రితం ఏడాదితో పోల్చుకుంటే మెరుగ్గానే ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే మే నెలలో మారుతి 46,555 యూనిట్లు విక్రయించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో మాత్రం ఏకంగా 312,074 యూనిట్లు విక్రయించి రికార్డు నెలకొల్పింది. క్రితం ఏడాది ఇదే ఏప్రిల్‌ నెలలో  206,204 యూనిట్లు విక్రయించినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా మారుతి సుజుకి ఇతర ఓఈఎంలు అమ్మకాలు కూడా గణనీయంగా పెంచుకుంది గత మే నెలలో. కాగా జపాన్‌కు చెందిన టయోటా కార్లను గత నెలలో 6,222 యూనిట్లు విక్రయించగా.. క్రితం ఏడాది ఇదే నెలలో  1,522 యూనిట్లు విక్రయించింది.  కాగా మారుతి సుజుకి మోడల్‌ షేరింగ్‌ పార్ట్‌నర్‌ షిప్‌ను టయోటా కిర్లోస్కర్‌తో ఒప్పందం కుదర్చుకుంది. అలాగే సుజుకి - టయోటా గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ కూడా కొనసాగుతోంది. కాగా ఇండియాలో టయోటా అర్బన్‌ క్రూయిసర్‌, గ్లాన్జా మోడల్‌ కార్లను విక్రయిస్తోంది. కాగా ఈ మోడల్స్‌ను మారుతి సుజుకి నుంచి  సేకరించి విక్రయిస్తోంది. టయోటా విటారా బ్రెజ్జా బలెనోలను ఇతర మార్కెట్లలో విక్రయిస్తాయి.

అయితే గత నెల మేలో వీటి అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది అమ్మకాలు మెరుగుపడ్డాయి. మారుతి సుజుకి అమ్మకాలు కాస్తా మందగించడానికి ప్రధాన కారణం సప్లయి చెయిన్‌లో కొంత ఆటంకాలు తలెత్తాయని పేర్కొంది. దీనికి వివరణ ఇస్తూ.. ప్రధానంగా మైక్రోచిప్‌ల సరఫరాలో తీవ్ర ఆటంకం కలిగిందని దీంతో మారుతి సుజుకి వాహనాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రకటనలో వివరించింది. అయితే దాని ప్రభావం ఎగుమతులపై పడలేదని పేర్కొంది. మరో అంశం ఏమిటంటే గత ఏడాది అమ్మకాలతో ఈ ఏడాది మే నెల అమ్మకాలు పోల్చరాదని కోరింది. ఎందుకంటే గత ఏడాది మే 2021లో కోవిడ్‌ తీవ్రంగా ఉంది. ఆసమయంలో కార్లు ఎవరు కొంటారని ప్రశ్నించింది. 

ఇక కార్ల అమ్మకాల యూనిట్ల విషయానికి వస్తే మినీ కార్ల అమ్మకాలు వాటిలో ఆల్టో, ఎస్‌-ప్రెస్సో గత  మే నెలలో 17,408 యూనిర్ట్లు విక్రయిస్తే.. క్రితం ఏడాది ఇదే నెలలో 4,760 యూనిట్లు విక్రయించింది. కాంపాక్ట్‌ కార్ల సెగ్మెంట్‌లో స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బలెనో, డిజైర్‌ ఈ ఏడాది మే నెలలో 67,947 యూనిట్లు విక్రయిస్తే.. క్రితం ఏడాది ఇదే నెలలో 20,343 యూనిట్లు విక్రయించింది. మిడ్‌ సైజ్‌ సెడాన్‌ సియాజ్‌  మొత్తం 586 యూనిట్లు విక్రయిస్తే.. గత ఏడాది ఇదే నెలలో 349 యూనిట్లు విక్రయించింది. యుటిలిటి వాహనాల విషయానికి వస్తే వాటిలో విటారా బ్రెజ్జా, ఎస్‌ క్రాస్‌, ఎర్టిగాలు కలిసి 28,051 యూనిట్లు విక్రయిస్తే... గత ఏడాది ఇదే నెలలో 6,355 యూనిట్లు విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. వ్యాన్‌ డిస్పాచ్‌ల విషయానికి వస్తే 10,482 యూనిట్లు విక్రయిస్తే.. గత ఏడాది ఇదే నెలలో 11,262 యూనిట్లు విక్రయించింది. ఎగుమతుల విషయానికి వస్తే 27,191 యూనిట్లు ఎగుమతి చేయగా.... క్రితం ఏడాది ఇదే మే నెలలో 11,262 యూనిట్లు విక్రయించినట్లు మారుతి సుజుకి ప్రకటనలో వివరించింది.

 

మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి



2022-06-02  Business Desk