collapse
...
Home / చదువు / గజనీలాగా పోరాడారు..యూపీఎస్సీ ఇంజనీరింగ్‌లో ర్యాంక్ కొట్టారు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu Ne...

గజనీలాగా పోరాడారు..యూపీఎస్సీ ఇంజనీరింగ్‌లో ర్యాంక్ కొట్టారు

2022-06-02  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

upsc-2
 

యూపీఎస్‌సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్‌లో ఫెయిలైన అనేకమంది అభ్యర్థులు ఎలాగైనా సరే పరీక్షల్లో నెగ్గాలనే పట్టుదలతో ముందుకు సాగారు. ఈ క్రమంలో వైఫల్యాలనుంచి నేర్చుకోవడమే కాదు... ఈ ఇంజనీర్లు పరీక్షలను పాస్ కావడమే కాదు.. టాప్ ర్యాంకును పొందారు. పూనే నివాసి కుల్దీప్ యాదవ్ యూపీఎస్‌సీ ఈఎస్ఈ 2021లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో అఖిల భారత స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించారు. ఇక అభిషేక్ కుమార్ శర్మ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అఖిల భారత స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించారు. విజయగాధకు ప్రతిరూపాలుగా మారే ముందు ఈ ఇద్దరు టాపర్లూ తమ వైఫల్యాలను పరస్పరం పంచుకున్నారు.

అభిషేక్ కుమార్ శర్మ  

యూపీఎస్‌సీ ఈఎస్ఈ 2021 పరీక్షల్లో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో అభిషేఖ్ కుమార్ శర్మ అఖిల భారత స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించాడు. బిహార్ లోని ముజఫర్‌పూర్ నుంచి వచ్చిన శర్మ 2018, 2019, 2020 సంవత్సరాలకు గాను పరీక్షలకు కూర్చున్నాడు కానీ 2021 వరకు ఒక్కసారి కూడా ఫైనల్ లిస్టు చేరలేకపోయాడు. 2018 నుంచి అతడు బీహార్ ఎలెక్ట్రిసిటీ డిపార్ట్‌మెంటులో అసిస్టెంట్ ఎలెక్ట్రికల్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. తనకు విద్యుత్ రంగంలోనే పనిచేయాలని మొదటి నుంచి ఉందన్నాడు.

2018, 2020, 2021 సంవత్సరాల్లో యూపీఎస్‌సీ ఈఎస్ఈ పరీక్షలు రాశాడు. 2020లో ప్రిలిమ్స్ గట్టెక్కాడు కానీ మెయిన్స్‌కి అర్హత సాధించలేకపోయాడు. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను కానీ లిస్టులో నా పేరు చూసుకోలేక పోయాను అన్నాడు. ఎట్టకేలకు 2021లో టాపర్‌గా నిలిచాడు. ఈ ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ బోలెడు టెస్ట్ సీరీస్‌లకు సిద్ధమయ్యాను. 35 నుంచి 40 మెయిన్స్ టెస్ట్ సీరీస్‌లకు సిద్ధమయ్యాను. దీంతో మెయిన్స్ లో ఎలాంటి పేపర్ కైనా సరే సమాధానాలు రాయగలననే నమ్మకం వచ్చేసింది. ఈ పరీక్షల్లో మెయిన్స్ అతి ముఖ్యమైన దశ. సబ్జెక్టుపైన ఖచ్చితమైన పరిజ్ఞానం, పరీక్షా కేంద్రంలో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. వీటిని సాధించడంలో టెస్టు సీరీస్ నాకు ఎంతో సహాయం చేశాయి అని శర్మ చెప్పాడు.

కాలేజీలో బేసిక్ సిలబస్ పూర్తి చేశాక మొదటి నుంచి గేట్ పరీక్షలను మూడుసార్లు రాసిన శర్మకు 2018లో 797, 2020లో 652, 2021లో 342 ర్యాంక్ వచ్చింది. 2018 గేట్ ర్యాంక్ ఆధారంగానే అతడికి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. అలాగే 2015లో జేఈఈ మెయన్  మరియు అడ్వాన్స్‌డ్ పరీక్షలకు కూర్చుంటే మెయిన్‌లో 17 వేల ర్యాంకు వచ్చింది. జార్కండ్ కంబైన్డ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా రాశాడు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ప్రాతిపదికన ధన్ బాద్‌లో బిఐటీలో అడ్మిషన్ దొరికింది.

శర్మ తండ్రి రైల్వేస్‌లో సీనియర్ షంటింగ్ డ్రైవర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. తన తల్లి గృహిణి. జంషెడ్‌పూర్ లో డిఏవీ పబ్లిక్ స్కూల్ నుంచి 12వ తరగతి పూర్తి చేశాడు. ధన్‌బాద్ లోని సింద్రి బిట్ నుంచి 2018లో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాడు.

కుల్దీప్ యాదవ్   

యూపీఎస్‌సి ఈఎస్ఈ 2021లో అఖిలభారత స్థాయిలో ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో టాప్ ర్యాంకు సాధించిన కుల్దీప్ యాదవ్ పూనే నివాసి. 2020లో తొలిసారి పరీక్షలకు కూర్చున్న కుల్దీప్‌కి ఏ ర్యాంకూ రాలేదు. రెండోసారి మళ్లీ ప్రయత్నించాడు. గ్రూప్ ఏ గెజిటెడ్ ఆపీసర్ కావాలన్నది నా లక్ష్యం. అందుకే 2020లో 2021లో ఈఎస్ఈ పరీక్షకే సిద్దమయ్యానని కుల్దీప్ చెప్పాడు. 2020 యూపీఎస్‌సీ ఈఎస్ఈ పరీక్షలో  13 మార్కులతో కటాఫ్‌ను మిస్సయ్యాడు. సులభమైన ప్రశ్నలను తేలిగ్గా తీసుకోకుండా వాటిని కూడా పూర్తి ఏకాగ్రతతోనే సాల్వ్ చేయడానికి మాగ్జిమం ప్రయత్నించాను కానీ సాధించలేకపోయాను అని కుల్దీప్ చెప్పాడు.

2020 ఈఎస్ఈలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ప్రతి స్టేజి లోనూ నా తప్పులను విశ్లేషించుకున్నాను. ప్రిలిమ్స్, మెయిన్స్ లో తప్పులను గ్రహించి పూర్తిగా సిద్దమే తదుపరి ప్రయత్నలో వాటినుంచి బయటపడ్డాను. 2021 ఈఎస్ఈలో పేపర్ 1, పేపర్ 2కి మ్యాగ్జిమం కష్టపడ్డాను. తర్వాత మెయిన్స్ విషయానికి వచ్చేసరికి ఆన్ లైన్ లెక్చర్స్ విన్నాను. టెస్టు సీరీస్‌లో పాల్గొన్నాను. ఈ సారి నా తప్పులను సవరించుకున్నాను. గత సంవత్సరం మెయిన్స్ లో నేను మార్క్ చేసిన ప్రశ్నలను గుర్తుంచుకుని ఇంకా కఠినమైన ప్రశ్నలను సాల్వచేయడానికి ప్రయత్నించాను. సాధించాను అన్నాడు.

29 ఏళ్ల కుల్దీప్ యాదవ్ ఢిల్లీలోని అంబేడ్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2016లో ఈసీఈలో బీటెక్ పూర్తి చేశాడు.  మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన కుల్దీప్ 2012లో ఎస్డీ పబ్లిక్ స్కూల్ నుంచి 12వ తరగతి పాస్ అయ్యాడు. పదేళ్ల తర్వాత తన కలను సాకారం చేసుకున్నాడు.ఈ ఇద్దరు టాప్ ర్యాంకర్ల జీవిత నేపథ్యాలను, వారు సాధించిన విజయాలను చూస్తే  బోధపడేది ఒకటే. విజయానికి రాచబాటే కానీ అడ్డదారులు ఉండవు.
 2022-06-02  Education Desk