దేశంలో ఈసీజీ ఉద్యోగుల డిమాండ్ గత మూడేళ్లలో 468 శాతం పెరిగిందని తాజా నివేదికలో చెబుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే వాతావరణంలో జరుగుతున్న మార్పుల చేర్పుల కారణంగా ఈ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోందని... పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్ లేదా సుపరిపాలన దీన్నే (ఈఎస్జీ) సెక్టార్ అంటారు. గత మూడు సంవత్సరాల నుంచి మన దేశంలో 468 శాతం పెరిగినట్లు తాజా నివేదికలో సూచిస్తున్నాయి.
గత ఏడాది ఈ రంగంలో గణనీయమైన డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఈ రంగంలో ఉద్యోగాలు గణనీయంగా పెరిగాయని తాజా జాబ్ సైట్ విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తోంది. ఈ రంగంలో ఉద్యోగాలు అంతకు క్రితం ఏడాదితో పోల్చుకుంటే 154 శాతం పెరిగింది. అంతకు ముందు ఈరంగంలో ఉద్యోగాల డిమాండ్ 97 శాతంగా ఉండేదని నివేదికలో వివరించింది. ఈఎస్జీ రంగంలో ఉద్యోగాల డిమాండ్ గత దశాబ్ద కాలంగా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల కరోనా మహమ్మారి తర్వాత నుంచి ఈ ఉద్యోగాలకు డిమాండ్ మరింత పెరిగింది. ఈఎస్జీ ఉద్యోగాల డిమాండ్ 2019-2020తో పోల్చుకుంటే 2020-21లో ఏకంగా ఏడు రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 మహమ్మారితో ఈ రంగంలో ఉద్యోగాల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
అయితే భవిష్యత్తులో ఈ రంగంలో కొలువులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి రంగం, లేదా ప్రతి సంస్థ పర్యావరణానికి పెద్ద పీఠ వేస్తోంది. కాబట్టి పలు సంస్థలు ప్రత్యేకంగా తమ సంస్థలో ఈఎస్జీ పాత్ర పోషించే వారిని ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రంగంలో కొలువుల విషయానికి వస్తే ... ఇంజినీర్ల నుంచి రీసెర్చి ఎనలిస్టులు కన్సల్టెంట్ల వరకు ఉంటాయని నివేదికలో వివరించింది.
డిమాండ్ ఉండే రంగాలు :
ఈఎస్‌జీలో అత్యధిక డిమాండ్ ఉండే రంగాల విషయానికి వస్తే హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్యూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) తో పాటు కన్సెల్టింగ్ రంగాలుంటాయి. ఈఎస్జీ రంగంలో పెద్దగా రిక్రూట్మెంట్ చేసుకోవాలనుకునే రంగాల విషయానికి వస్తే మరో మూడు రంగాలు కూడా టాప్‌లో ఉన్నాయి. అవి మైనింగ్, ఎఫ్ఎంసీజీ, తయారీరంగాలని కూడా నివేదికలో వివరించింది. దీంతో పాటు కంపెనీలు ప్రత్యేకంగా తమ కంపెనీల్లో ఉద్యోగాల్లోకి తీసుకొనే వారికి ప్రత్యేక విద్యార్హత కలిగి ఉండేలా చూస్తోంది ముఖ్యంగా ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సస్టెయినబుల్ బిజినెస్మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లాంటి వీటిలో ప్రముఖంగా ఉన్నాయి. క్రమంగా ఈఎస్జీ రంగం పుంజుకోవడంతో భవిష్యత్తులో కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి, బ్రాండ్ ఈక్విటీ ని పెంచి వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. రాబోయే కాలంలో ఈ రంగం మరింత పుంజుకుంటుందని ఇండియా హెడ్ సేల్స్ శశికుమార్ అభిప్రాయపడుతున్నారు. ఈఎస్జీ ఉద్యోగాలు భారత్‌లోనే కాకుండా ఇతర ఆసియా దేశాలు ముఖ్యంగా మలేషియాలో గత మూడేళ్లలో పదిరెట్లు పెరిగాయి.
మరిన్ని చదువు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి