collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / ఏపీలో బోధన పద్దతుల్లో మార్పులు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News T...

ఏపీలో బోధన పద్దతుల్లో మార్పులు

2022-06-04  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

teaching
 

విద్యా రంగంలో చేసినన్ని ప్రయోగాలు బహుశా మరే రంగంలో ఏ ప్రభుత్వమూ చేపట్టి ఉండదు. విద్యార్థుల జీవితాలను భవిష్యత్ కు సారథులుగా రూపొందించవలసిన బృహత్తరబాధ్యత ఈ రంగానిదే. భావి పౌరులకు చక్కని చుక్కానిలా ముందుకు నడిపించేదీ ఈ రంగమే. తాజాగా మెరుగైన ఫలితాల సాధన లక్ష్యంగా కొన్ని మార్పులు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సపోర్టింగ్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ ఫార్మేషన్ (సాల్ట్) పేరుతో కొత్త విద్యా బోధన పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్త పద్ధతిలోకి ముందుగా టీచర్లను ససింద్ధం చేసేందుకు వీలుగా వారికి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. చిన్నారుల అభ్యాస సామర్థ్యాన్ని బట్టి బోధించడంలో ఇప్పుడు వారు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ (ఎస్ సీ ఈ ఆర్ టీ), డైట్ ఇనిస్టుట్యూట్స్, ఇతర విద్యా రంగ నిపుణులు పాల్గొంటున్నారు. ఇందుకోసం వరల్డ్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 1800 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు ఆర్థిక సాయం గ్రాంటు రూపంలో మంజూరైంది. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ లు చేపట్టిన ఈ కార్యక్రమం కింద మొత్తం విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం, అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, అటు టీచర్లు, ఇటు విద్యార్థుల సామర్థ్యం పెంపు చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా రూ. 700 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతారు. నాడు నేడు కార్యక్రమం కింద ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం పబ్లిక్ స్కూళ్లను పునర్మిర్మాణం, అప్ గ్రెడేషన్ పనులను నిర్వహిస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధులను ఉపయోగించి, పబ్లిక్ స్కూళ్లను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటారు.    

స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎస్ సురేశ్ కుమార్ వివరాలు ఇస్తూ, సాల్ట్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, టీచర్ల సామర్థ్యాలను పెంపొందించడం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత  పాఠశాల వరకు 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 40 లక్షల మంది విద్యార్థుల పురోగతిని ఈ పథకం కింద పర్యవేక్షించడానికి సాధ్యమవుతుంది. అంగన్ వాడీల పర్యవేక్షణలో ఉన్న 10 లక్షల మంది బాలబాలికలకు కూడా ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రాథమిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూపబ్లిక్ విద్యా రంగాన్ని చైతన్యవంతం చేసేందుకు నిర్ణయించుకున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టీచర్లు, ప్రధానోపాధ్యాయులు ఈ పథకం పూర్తిగా విజయవంతం చేసేందుకు నిర్మాణాత్మక లక్ష్యంతో కృషి చేయాలని ఆయన కోరారు.     


 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి   



2022-06-04  News Desk