collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / మత్తెక్కిస్తున్న ఇల్లీ భామ అందాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | New...

మత్తెక్కిస్తున్న ఇల్లీ భామ అందాలు

2022-06-04  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

[ieyana
 

బ్లాక్ అవుట్‌ఫిట్స్ బీటౌన్ భామల ఫేవరేట్ అయిపోయాయి. పార్టీలైనా, ఈవెంట్‌లైనా, ఫోటోషూట్‌లకైనా ముద్దుగుమ్మలు ఈ బ్లాక్ మంత్రాన్నే ఫాలో అవుతున్నారు. టీవీ నటీమనుల నుంచి సీనియర్ నటీమణుల వరకు అందరూ అందమైన నలుపు రంగు దుస్తులను ధరించి తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. మినీ డ్రెస్‌లు, కో-ఆర్డ్ సెట్‌ల నుంచి లెహంగా సెట్ ల వరకు అందరూ బ్లాక్ కలర్‌కు ప్రాధాన్యతను ఇస్తున్నారు. తాజాగా బెల్లీ బ్యూటీ ఇలియానా కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. 
 
నెట్టింట్లో వైరల్ అవుతున్న ఇల్లీ బేబీ పిక్స్ : 

ileyana 1-1
 

ఇలియానా డీక్రూజ్ ఫ్యాషన్ స్టైల్స్ రోజు రోజుకు మరింత మెరుగ్గా ఉంటున్నాయి. ఈ నటి తన ట్రెండీ ట్రెండీ ఫోటో షూట్ స్నిప్పెట్స్‌తో లేటెస్ట్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. తాజాగా ఈ బెల్లీ బేబీ అదిరిపోయే ఎత్నిక్ అవుట్‌ఫిట్‌తో తన ఫ్యాషన్ బార్‌ను మరింతగా పెంచేసింది. బ్లాక్ కలర్ క్రాప్ టాప్‌ హై వెయిస్టెడ్ స్కర్ట్‌ వేసుకుని కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపింది. ఈ అద్భుతమైన దుస్తులతో చేసిన పోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూస్తూ ఫ్యాన్స్ అదరహో అంటూ కితాబిచ్చేస్తున్నారు. 
 
మోనోక్రోమ్ ఎత్నిక్ లుక్‌తో మైండ్ బ్లాక్ : 

ileyana 3
 

ఇలియానా ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఆక్టివ్‌గా ఉంటోంది. ఆ మధ్యన కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిన ఈ భామ గత కొంత కాలంగా తనలోని ఆత్మస్థైర్యాన్ని పెంచుకుని తెరుముందుకు కాకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరిస్తోంది. ఫ్యాషన్ ఫోటో షూట్స్ చేస్తూ, తన పర్సనల్ ఫోటోలను , విషయాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఆనందంగా ఉంటోంది. ఇటీవల ఈ భామ మరో ఫ్యాషన్ ఫోటో షూట్ పిక్స్‌తో నెట్టింట్లో సందడి చేసింది. ఫ్యాషన్ డిజైనర్ రిధిమా భాసిన్‌కు మ్యూజ్‌గా వ్యవహరించిన ఇలియానా మోనోక్రోమ్ ఎత్నిక్ లుక్‌తో మైండ్ బ్లాక్ చేసింది. 
 
అందాలతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది: 

ileyana 2-1
 

వైట్ , మెరూన్ ప్రింట్స్ తో డిజైన్ చేసిన హై వెయిస్టెడ్ బ్లాక్ ఫ్లోయీ స్కర్ట్‌కు జోడీగా ప్లంగింగ్ నెక్‌లైన్ , ఫుల్ స్లీవ్స్ కలిగిన బ్లాక్ మిడ్‌రిఫ్ బేరింగ్ క్రాప్‌ టాప్‌ను ధరించింది ఈ బెల్లీ బ్యూటీ. మెడను పూజా డైమండ్స్ అండ్ రింగ్స్‌నుంచి సేకరించిన సిల్వర్ స్టేట్‌మెంట్ చోకర్‌ నెక్‌లెస్‌తో అందంగా అలంకరించుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ సనమ్ రత్‌సానీ ఇలియానాకు స్టైలిష్ లుక్స్‌ను అందించారు. భుజాల వరకు ఉన్న తన కురులను వేవీ కర్ల్స్ వచ్చే విధంగా లూజ్ గా వదులుకుంది ఈ దివా. కనులకు స్మోకీ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరాను పెట్టుకుని పెదాలకు న్యూడ్ లిప్ షేడ్ దిద్దుకుని కుర్రాళ్ల మనసును దోచేసింది.
 
గౌనులో సోయగాల విందు: 

ileyana 4
 

ఇలియానా ఫ్యాషన్ ఎంపికలు కన్నులకు పండుగగా ఉంటాయి. ఈ మధ్యనే ఈ భామ ఓ అద్భుతమైన అవుట్‌ఫిట్‌తో ఫెస్టివ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేసింది. ఫ్యాషన్ డిజైనర్ జిగర్ మాలీ షెల్ఫ్ నుంచి సేకరించిన డార్క్ పింక్ గౌన్ లో ఇలియానా అందాలు మరింత రెట్టింపయ్యాయి. ప్లంగింగ్ నెక్‌లైన్, భుజాల దగ్గర డ్రమాటిక్ కేప్‌తో ఈ గౌనును అద్భుతంగా తయారు చేశారు డిజైనర్లు. చెవులకు స్టేట్‌మెంట్ సిల్వర్ డాంగ్లర్స్‌ పెట్టుకుని తన లుక్‌కు మరింత అందాన్ని తీసుకువచ్చింది. 
 
 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 2022-06-04  Lifestyle Desk