ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లో టాప్ 100లో 4 భారత విశ్వవిద్యాలయాలు స్థానం సంపాదించుకున్నాయి. ఇక టాప్ 200లో 17 భారత యూనివర్సిటీలు స్థానం సంపాదించుకున్నాయి. గత ఏడాది టాప్ 200 ర్యాంకింగుల్లో 18 భారత వర్సిటీలు స్థానం సంపాదించుకోవడం తెలిసిందే. యధాప్రకారం చైనా, జపాన్ దేశాలు ఆసియా వర్సిటీల ర్యాంకింగుల్లో ఆధిపత్యం చలాయించడం గమనార్హం.
ఆసియా ప్రాంతంలో ఉత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితాలో చైనా యూనివర్శిటీలు ఈసారి కూడా ఆధిపత్యం చలాయించాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాకింగ్లలో తొలి రెండు స్థానాలూ గెల్చుకున్న చైనా టాప్ 100 జాబితాలో మొత్తం 30 చైనా యూనివర్సిటీలు చోటు సంపాదించాయి. వరుసగా మూడో సంవత్సరం కూడా చైనాకు చెందిన ట్సింగువా, పెకింగ్ యూనివర్శిటీలు ఆసియా టాప్ 100 ర్యాంకింగ్‌లలో తొలి రెండు స్థానాలూ చేజిక్కించుకున్నాయి.
అయితే ఉన్నట్లుండి సౌదీ అరేబియాకు చెందిన 6 యూనివర్శిటీలు ఆసియా టాప్ 100 వర్శిటీ జాబితాలో ఆరు స్థానాలు గెలుపొందాయి. గత సంవత్సరం నాలుగు సౌదీ వర్శిటీలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. సౌదీ అరేబియాకు చెందిన కింగ్ అబ్దులాజిజ్ యూనివర్శిటీ సౌదీలో ఉత్తమ వర్సిటీగా 28వ స్థానంలో నిలిచింది.
జపాన్ మాత్రం టాప్ 100లో ఈసారి ఆరు స్థానాలు పోగొట్టుకుని మొత్తం 8 స్థానాలు మాత్రమే నిలబెట్టుకుంది. 2021 సంవత్సరంలో మొత్తం 14 జపాన్ యూనివర్శిటీలు ఆసియా టాప్ 100 ర్యాంకింగ్స్ లో చోటు చేసుకున్నాయి. అయితే ఆసియా టాప్ 200 ర్యాంకింగ్‌లో జపాన్‌కి చెందిన 118 వర్సటీలు స్థానం సంపాదించుకుని గౌరవస్థానంలో నిలిచాయి.
భారత దేశానికి వస్తే చైనా, జపాన్, సౌదీ అరేబియాల కంటే ఎంతో వెనుకబడిపోవడం గమనార్హం. 2022 ఆసియా వర్శిటీల టాప్ 100 రాంకింగ్స్ లలో నాలుగు భారత వర్శిటీలకు మాత్రమే చోటు లభించింది. కాగా టాప్ 200 ర్యాకింగ్స్లో 17 భారత్ వర్సిటీలకు స్థానం దొరికింది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగుళూరు వర్శిటీ టాప్ 100లో 42 ర్యాంకు సాధించింది. ఇక 65, 68, 87 ర్యాంకులలో వరుసగా జేఎస్ఎస్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐఐటీ రోపార్, ఐఐటీ ఇండోర్ వర్శిటీలు నిలిచాయి.
100 నుంచి 200 ర్యాంకింగ్‌లలో చోటు సాధించిన భారత్ వర్సిటీలు
ర్యాంక్ 120 ఐఐటీ గాంధీనగర్
ర్యాంక్ 122 అలగప్ప యూనివర్శిటీ
ర్యాంక్ 127 థాపర్ ఇనిస్టిట్యూట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
ర్యాంక్ 131 సవేతీ యూనివర్సిటీ
ర్యాంక్ 139 మహాత్మా గాంధీ యూనివర్శిటీ
ర్యాంక్ 149 ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్శిటీ
ర్యాంక్ 153 బనారస్ హిందూ యూనివర్శిటీ
ర్యాంక్ 158 ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
ర్యాంక్ 160 జామియా మిలియా ఇస్లామియా
బోధనా వాతావరణం, రీసెర్చ్, సైటేషన్స్, ఇంటర్నేషనల్ అవుట్ లుక్, ఇండస్ట్రీ ఇన్కమ్ అనే అయిదు అంశాల ప్రాతిపదిన ఆసియా అత్యుత్తమ వర్సిటీలను ప్రతి ఏటా ఎంపిక చేస్తుంటారు. అయితే ఉన్నత విద్యకు, రీసెర్చ్ అండ్ ఇన్నేవేషన్కి సంబంధించి ఆసియా ఖండమే ఆత్యంత డైనమిక్ ఖండంగా ఉంటోందని చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ ఫిల్ బే చెప్పారు.
మరిన్ని చదువు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి