collapse
...
Home / ఆరోగ్యం / కంటి సంరక్షణ / కనురెప్పల కుంగుబాటు - ఆరోగ్య కారణాలు-2 - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

కనురెప్పల కుంగుబాటు - ఆరోగ్య కారణాలు-2

2021-11-30  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

eyes2
 

కనురెప్పలు వంగిపోవడం లేదా కుంగిపోవడం కచ్చితంగా కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యను సూచిస్తుంది దీనికి చాలా కారణాలు ఉంటున్నాయి. వృద్ధాప్యంకంటికి గాయం తగలడంకంటి ఆపరేషన్పుట్టుకతోనే ఈ సమస్య ఏర్పడటంతలనొప్పికంటి కణితి,కంటి ఇన్ఫెక్షన్లు వంటివి కనురెప్పల కుంగుబాటుకు కారణాలు. ఈ రెండోభాగంలో మరిన్ని కారణాలు పేర్కొంటూ వీటిని ఎలా అధిగమించాలో చూద్దాం. 

హార్నర్ సిండ్రోమ్ 

కొన్ని నరాల మార్గాలకు దెబ్బతగిలినప్పుడు మీ కనురెప్పలు కిందికి వాలిపోవచ్చు. ఇలా దెబ్బతిన్న కన్ను చిన్నదైన కనుపాపను కలిగి ఉంటుంది. మీ ముఖంలో కొంత భాగం వాచి ఉండవచ్చు. కొంతమంది పుట్టుకపోనే హార్నర్ సిండ్రోమ్‌తో పుడతారు. అలాగే మీ మెదడుతలఊపిరితిత్తులు వంటి అవయవాల్లో కేన్సర్ కణితులు ఏర్పడి ఉంటే కూడా ఈ నరాలు దెబ్బతినిపోతాయి. ఈ పరిస్థితుల్లో మీ తలమెడకు రక్తసరఫరాను తగ్గిస్తున్న వ్యాధులను మీ డాక్టర్ తనిఖీ చేసి మీకు తగిన సూచనలిస్తారు. 

తలనొప్పి 

మీకు మైగ్రెయిన్ లేక మీ త్రిభుజాకార నరంలో సమస్య ఏదైనా ఉంటే కూడా ఈ హార్నర్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలు మీకు తటస్థించవచ్చు. త్రిభుజాకార నరం అనేది మీ ముఖందవడ గుండా సాగుతుంది. సాధారణంగా తలనొప్పి తగ్గిపోతే మీ కంటి సమస్య పరిష్కారం కావచ్చు. అయితే కొన్ని సార్లు తలనొప్పికి తలనొప్పికి మధ్య త్రిభుజాకార నరం దెబ్బతినే అవకాశం ఉంది. మీ తలనొప్పిని తగ్గించుకోవడానికి మీరు వాడిన మందులుఇతర చికిత్సల గురించి మీ డాక్టర్‌తో సంప్రదించాలి. ఇవి చిన్న చిన్న సమస్యలుగా కనిపించినప్పటికీ పరిస్థితి మరింత విషమించవచ్చు కూడా. 

కనురెప్పల్లో కణితి 

మీ డాక్టర్ దీన్ని యాంత్రికమైన రెప్పవాల్పుగా పిలవవచ్చు. అంటే మీ కనురెప్పలపై మీ ప్రమేయం లేకుండానే భారం పడి అవి కిందికి వాలిపోయి ఉండవచ్చని అర్థం. మీకు జన్యుపరమైన అపక్రమం ఉన్నట్లయితే మీ కంటి రెప్పలపై కణితి పెరిగే అవకాశం ఉంది. ఇది సాధారణంగా కేన్సర్ కాకపోవచ్చు. కానీ ఇలాంటి కణితిని తొలగించాలంటే మీకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. లేదా రేడియేషన్ చికిత్స చేయాల్సిరావచ్చు. అయితే జన్యుపరమైన అపక్రమానికి చికిత్స లేదని గుర్తించాలి. 

కంటి ఇన్ఫెక్షన్ 

అంటువ్యాధులులేదా కంటికురుపు వల్ల మీ కన్ను వాయవచ్చు. ఇవి తగ్గే క్రమంలో మీ కనురెప్పలు సాధారణ స్థితికి చేరుకోవచ్చు. దీనికి ఒకటి లేదా 2వారాలు అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. లేదా సహజంగానే ఇది తగ్గుముఖం పట్టవచ్చు కూడా. మీ కన్ను బాగా వాచి మూసుకుపోతేలేదా బాగా నొప్పి వేస్తూ పస ఏర్పడితేలేదా జ్వరం వస్తుంటే వెంటనే మీ డాక్టర్‌ని సంప్రదించాలి. కంటిలో పసిని తొలగించడానికి మీకు యాంటీబయోటిక్స్ మందులు వాడాల్సి ఉంటుంది లేదా ఆపరేషన్ అవసరం అవుతుంది. ఈలోగా కృత్రిమ కన్నీళ్లు లేదా వెచ్చబర్చేచల్లబర్చే కంప్రెస్‌ని వాడితే మీ కంటి సమస్య పరిష్కారం కావచ్చు. 

గుండెపోటు 

రక్తనాళం పేలిపోతేలేక అది బ్లాక్ అయితే మీ మెదడుకు తగినంత ఆక్సిజన్పోషకాహారం అందదు. దీనివల్లే గుండెపోటు వస్తుంది. దీనివల్ల కూడా మీ కనురెప్పలతోపాటు ముఖంలో కొంత భాగం పక్కకు వాలిపోయే ప్రమాదముంది. ఇలా తొలి లక్షణాలు కనిపించిన గంటలలోపే వైద్య సహాయం పొందితే మంచిది. తిమురుమాట్లాడటంలో సమస్యచూపు సమస్యనడక సమస్య వంటివి ఉన్నాయోమో చూడాలి. గుండెపోటు సమస్యను తొలగించుకోవాలంటే వ్యాయామం తినాలి. బాగా తినాలి. డయాబెటిస్కోలెస్ట్రాల్రక్తపోటు వంటివి అదుపులో ఉంచుకోవడానికి డాక్టర్ని సంప్రదించాలి. ధూమపానం అలవాటును పూర్తిగా మానేయాలి. 

మధుమేహం 

కాలం గడిచేకొద్ది అధిక బ్లడ్ షుగర్ మీ కంటి లోపలివెలుపలి రక్తనాళాలనునరాలను దెబ్బతీస్తాయి. వస్తువు రెండుగా కనిపించడంతోపాటు మీ కనురెప్పలు వాలిపోవచ్చు. డయాబెటిక్ థర్డ్ నెర్వ్ పాల్సీ స్థితిలో ఇది సంభవిస్తుంది. మీరు మధుమేహాన్ని అదుపులో ఉంచుకంటే రెప్పవాల్పు సమస్య కొన్నిసార్లు కనిపించకపోవచ్చు. అయితే మీ రెప్పవాల్పు సమస్య మీ చూపును దెబ్బతీసిఆరు నెలల పాటు సమస్య అలాగే కొనసాగితే అప్పుడు డాక్టర్ మీకు శస్త్ర చికిత్సను సిఫార్సు చేయవచ్చు. 



2021-11-30  Health Desk