collapse
...
Home / వినోదం / తెలుగు / 2021లో కథలకు ప్రాధాన్యమిచ్చిన టాలీవుడ్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

2021లో కథలకు ప్రాధాన్యమిచ్చిన టాలీవుడ్

2021-12-24  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

anjana VJ-5
 

2021లో కూడా టాలీవుడ్ పరిశ్రమను కష్టాలునష్టాలుసమస్యలు వెంటాడాయి. అయినా వాటిని తట్టుకొని ఇండస్ట్రీ నిలబడింది. 21 ఫస్టాఫ్ డల్ గా గడిచినా సెకండ్ హాఫ్ కాస్త మెరుగనిపించింది. థియేటర్లు తెరుచుకున్నాయి. 2021 మొదటి నుంచీ… థియేటర్లు మూతబడిన టైంలో ఓటీటీ కొంతవరకూ అండగా నిలబడిందనే చెప్పాలి. తెలుగు సినిమాలు చాలావరకు ఓటీటీలోనే వచ్చాయి. సెకండ్ హాఫ్ లో థియేటర్లలో రిలీజైన తర్వాత కొన్ని ఓటీటీకి వెళ్లాయి. మరికొన్ని డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజయ్యాయి. 

గత ఏడాదిఈ ఏడాది (2021) కరోనా కారణంగా సినిమాల నంబర్ కొంత తగ్గింది. డిసెంబర్ 23 నాటికి 111 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. 31 నాటికి మరో ఎనిమిది సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చాయి. అంటే 2021లో దాదాపు 119 తెలుగు సినిమాలు.

మంచి కథలతో మూవీస్

ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల్లో కథల పరంగా పెద్ద మార్పే వచ్చింది. రొటీన్ సినిమాలు కొన్ని వచ్చినా కథాబలం ఉన్న మూవీస్ చాలా వచ్చాయి. చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే స్టార్ హీరోలు కూడా స్టోరీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం చూశాం. దీనికి కారణం ఓటీటీ . ఈ ప్లాట్ ఫాం మొదట చిన్న సినిమాలకు వెల్ కం చెప్పింది. బిగ్ స్క్రీన్ కుఓటీటీ మీడియాకు మధ్య… మేకింగ్ లో ప్రెజెంటేషన్ లో తేడా ఉంది. వెరైటీ కథలకుకొత్త డైరెక్టర్లకుచిన్న బడ్జెట్ చిత్రాలకూ ఓటీటీ అండగా నిలిచింది. ఆ రన్ చూసిన స్టార్స్ కూడా రూట్ మార్చుకునిఓటీటీ వైపు మొగ్గు చూపించారు. ఈ ఏడాది  ఎంటర్ టైనర్స్ఫ్యామిలీ పిక్చర్స్కామెడీసస్పెన్స్ థ్రిల్లర్స్కొంత వల్గారిటీ ఉన్నవీ వచ్చాయి.

కొందరు హీరోలు దూరం 

ఇక  సీనియర్ హీరోలు,స్టార్ హీరోలుకుర్ర హీరోల సినిమాల విడుదల సంగతి చూద్దాం. సీనియర్ హీరోల్లో బాలకృష్ణనాగార్జునవెంకటేష్రవితేజ సినిమాలు వచ్చాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా ఒక్కటి కూడా ఈ ఏడాది రాలేదు. అలాగే స్టార్ హీరోల్లో మహేష్ బాబుజూనియర్ ఎన్ టిఆర్రాంచరణ్ప్రభాస్ ల సినిమాలేవీ ఈ ఏడాది రాలేదు. మరో విశేషమేంటంటే … గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ ఊరించిన నాగార్జున తనయుడు అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పిక్చర్ విడుదలైంది.

కొత్తవారికి గేట్ వే

 అంతా కొత్తవారే నటించిన జాతి రత్నాలు హిట్ కొట్టింది. కేరక్టర్ ఆర్టిస్టులు జగపతి బాబురాజేంద్రప్రసాద్ప్రకాష్ రాజ్తనికెళ్ల భరణిమురళీ శర్మ చాలా సినిమాలు వచ్చాయి. జగపతిబాబు ఎక్కువ సినిమాల్లో చేశారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్. చిన్న సినిమాలు చేసిన యంగ్ హీరోలుడైరెక్టర్లకు 2021 గేట్ వే అయింది. కొందరి తొలి చిత్రాలూ వచ్చాయి.

చాలాకాలం తర్వాత

హీరోయిన్ల పరంగా చూస్తే.. అనుష్కసమంత వంటి సీనియర్ హీరోయిన్ల సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాలేదు. ఆనాటి హీరోయిన్లు మీనాభూమికప్రియమణి చాలాకాలం తర్వాత కనిపించారు. రమ్యకృష్ణ ఏం తగ్గలేదు. కొంతకాలంగా టాలీవుడ్ కు దూరమైన శ్రుతి హాసన్ ఈ ఏడాది తెరమీద కనిపించింది. రకుల్తమన్నా కూడా అంతే. 

 హీరోల సినిమాలు

టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఎవరెవరు ఏఏ సినిమాలు చేశారో చూద్దాం. 

 రవితేజ మూవీ క్రాక్’ ఈ ఏడాది విడుదలైన మొదటి సినిమా . బాలకృష్ణ అఖండవెంకటేష్ నారప్పదృశ్యం 2 , నాగార్జున వైల్డ్ డాగ్రాజశేఖర్  దెయ్యం సినిమాలు రిలీజయ్యాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్అల్లు అర్జున్ పుష్పరానా దగ్గుబాటి - అరణ్యనాగచైతన్య లవ్ స్టోరీనాని - టక్ జగదీశ్శ్యాం సింగ రాయ్అల్లరి నరేష్ బంగారు బుల్లోడునందినితిన్- చెక్రంగ్ దేమాస్ట్రోమంచు విష్ణు - మోసగాళ్లుశర్వానంద్ - శ్రీకారంమహాసముద్రంగోపీచంద్ సీటీమార్ఆరడుగుల బుల్లెట్విజయ్ సేతుపతి- ఉప్పెన సినిమాలు చేశారు. మొత్తానికి టాలీవుడ్ హీరోలకు 2021 కాస్త ఉత్సాహంగాకాస్త ఇబ్బందిగా గడిచింది.

వి. మధుసూదనరావు

 

 

 

 

 



2021-12-24  Entertainment Desk