Courtesy:Twitter/@AshishonGround
నీట్ పీజీ (NEET PG) 2022 ఫలితాలను వైద్య శాస్త్రాల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారు బుధవారం ప్రకటించారు. ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో డాక్టర్ షాగన్ బాత్రా టాపర్‌గా నిలిచారు. డా. జోసెఫ్, డాక్టర్ హర్షితలు తర్వాత స్థానాల్లో నిలిచారు. ఢిల్లీకి చెందిన ఈ యువ మహిళా డాక్టర్ షాగన్ బాత్రా నీట్ పీజీ (NEET PG) 2002 ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలిచారు. 23 సంవత్సరాల వయస్సున్న షాగన్ బాత్రా స్కూల్ ఎడ్యుకేషన్‌లో కూడా టాపర్‌గానే నిలిచారు. అంతేకాదు ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడలిస్టుగా రికార్డు సృష్టించారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురంలో క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్‌లో కూడా ఆమె స్కూల్ ఫస్ట్ వచ్చారు. స్కూల్ డేస్ మొత్తంలా ప్రతిసారీ ఆమెకు టాప్ మార్కులు వచ్చేవి. తర్వాత 2016లో ఢిల్లీ లోని మౌలానా అజాద్ మెడికల్ కాలేజీ (ఎమ్ఎఎమ్సి)లో చేరారు. ఎంబీబీఎస్ బ్యాచ్ మొత్తంలో ఆమె గోల్డ్ మెడలిస్టుగా నిలిచారు. అయితే స్కూల్ డేస్ నుంచి తాను వరుసగా విజయాలు సాధిస్తున్నప్పిటికీ నీట్ టాపర్‌గా వస్తానని అసలు ఊహించలేదని డాక్టర్ షాగన్ బాత్రా చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో పాల్గొనడం ఆమెకి ఇదే తొలిసారి.
నీట్ టాపర్‌గా పేరుకెక్కడంతో తన తల్లితండ్రులు పట్టలేని సంతోషంతో ఉన్నారని, ప్యామిలీలో తానే మొట్టమొదటి డాక్టర్‌నని ఆమెచెప్పారు. ఆమె తండ్రి ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. మెడిసన్‌లో ఎండీగా అవుతానని తర్వాత సూపర్ స్పెషలైజషన్ తీసుకుంటానని డాక్టర్ షాగన్ బాత్రా చెప్పారు.
ముదితల్ నేర్వగరాని విద్య గలదే నేర్పింపదగన్ అని పాత పద్య భావం. కానీ ఈ సామెత ఇప్పుడు తిరగబడింది. నేర్పిస్తే మహిలలు నేర్చుకోవడం కాదు.. తమ ప్రతిభాపాటవాల ద్వారా మహిళు ఇప్పుుడు యావత్ సమాజానికే పాఠాలు నేర్పుతున్నారు. ఈ విషయంలో డాక్టర్ షాగన్ బాత్రా తాజా ఉదాహరణం అంతే..
మరిన్ని చదువు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి