Courtesy:Twitter/@Vish3890
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా పూర్తిస్థాయి ఎలక్ర్టిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ 300 ను వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. అలాగే ఎలక్ర్టిక్ వెహికిల్ బిజినెస్ స్ర్టాటజీ "బార్న్ ఎలక్ర్టిక్ విజన్' ఈవీ అనే కాన్సెప్ట్‌ను కూడా ఆవిష్కరించనుంది.
ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఎంఅండ్ఎం ఇటీవల ఫోక్స్వ్యాగెన్తో భాగస్వామ్యం చేపట్టింది. వారి మాడ్యులర్ ఎలక్ర్టిక్ డ్రైవ్ మాట్రిక్స్ (ఎంఈబీ)ని వినియోగించుకుని ఎలక్ర్టిక్ కారుకు కావాల్సిన విడిభాగాలను తయారు చేసుకుంటుంది. ఎంఈబీ ఎలక్ర్టిక్ ఫ్లాట్‌ఫాం ద్వారా ఎంఅండ్ఎం తమ ఎలక్ర్టిక్ కారు ఫోర్టుపోలియోను సర్టిఫైడ్ వాహనాన్ని త్వరగా .. ఖర్చు తక్కువతో ఉత్పత్తి చేసుకోగలదు. ముందుగా ఎలక్ర్టిక్వెర్షన్ ఎక్స్‌యూవీ 300ను వచ్చే కేలండర్ సంవత్సరంలో విడుదల చేయాలనుకుంటున్నట్లు ఎంఅండ్ఎం చీఫ్ ఎగ్జి్క్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జేజురికర్ చెప్పారు. పేరుకు ఎలక్ర్టిక్ వెర్షన్ అయినా.. దీని పొడవు 4.2 మీటర్లు ఉంటుందని .. నాలుగు మీటర్ల కంటే తక్కువ ఉండదని చెప్పారు. ఇక్కడ నాలుగు మీటర్ల కంటే ఎక్కువ ఉండే వాహనాలను సెడెన్ అంటారు.
కాగా బార్న్ ఎలక్ర్టిక్ విజన్ వివరాలను బ్రిటన్ ఈ ఏడాది ఆగస్టు 15న ఆవిష్కరిస్తామని జెజురికర్ తెలిపారు. కాగా కంపెనీ 2027 నాటికి 13 ఎస్‌యూవీలను విడుదల చేయాలనుకుంటోంది. వాటిలో ఎనిమిది ఎలక్ర్టిక్ ఎస్యూవీలని తెలిపింది. కాగా ఎఎక్స్ వెరియెంట్ ఎక్స్‌యూవీ 700లో 700 కంటే ఎక్కువ సెమీకండకర్లున్నాయి. కాగా ఎంఎక్స్ వెరియెంట్ కొత్తగా విడుదల చేసిన ఎస్‌యూవీతో పోల్చుకుంటే వీటికి అత్యధికంగా 5 శాతం కంటే ఎక్కువ బుకింగ్‌లు జరిగాయి. ఉత్పత్తి పెంచడంతో పాటు సెమికండక్టర్ సరఫరా మెరుగుపడ్డంతో వెయిటింగ్ పీరియడ్ కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుందని జెజురికర్ చెప్పారు. ప్రస్తుతం చిప్ కొరతల నుంచి గాడినపడ్డాం కాబట్టి కంపెనీ వివిధ వర్గాల సరఫరాలదార్ల నుంచి సేకరిస్తోంది. కాబట్టి చిప్ సంక్షోభం నుంచి బయటపడినట్లేనని ఆయన తెలిపారు.
ఇక కస్టమర్ల అంచనాను మించిపోవాలి కాబట్టి కంపెనీ దీని కోసం అదనంగా రూ.1,900 కోట్లు పెట్టుబడులు పెంచి ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచింది. వాటిలో ఎక్స్యూవీతో పాటు ఇతర ప్రొడక్టుల ఉత్పత్తి పెంచుతోంది. వచ్చే మూడు సంవత్సరాల కాలానికి అంటే 22-24 ఆర్థికసంవత్సరానికి రూ.17,000 కోట్ల మూలధనం సమకూర్చుకుంది.
కాగా కంపెనీ ఎస్యూవీ విభాగంలో గ్లోబల్ ప్లేయర్ కావాలనుకుంటోందని గత ఏడాది వరల్డ్ క్లాస్ వాహనాన్ని విడుదల చేసిందని ఎంఅండ్ఎం ఎండీ, సీఈవో అనిష్ షా తెలిపారు. గ్లోబల్ ప్లేయర్కావాలంటే ఇండియాలో వెయిటింగ్ పీరియడ్ బాగా తగ్గాల్సి ఉంటుంది.అయితే గ్లోబల్ మార్కెల్ లీడర్ కావాలనే ఉద్దేశంతో భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యం తగ్గించమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సామర్ధ్యంతో పాటు అదనంగా ఎలక్ర్టిక్ వాహనాలను ఉత్పత్తి చస్తామని ఆయన వివరించారు. తమ ప్రధాన ఉద్దేశం ప్రస్తుతం తమ వాహనాలకు ఉన్న డిమాండ్ మాదిరిగానే కొత్తగా మార్కెట్లోకి తెచ్చే ఎస్‌యూవీల్లో కూడా లభించాలనేది ప్రధాన ఉద్దేవమన్నారు. గ్లోబల్ ఈవీ మార్కెట్లో తాము బలంగా ఎదుగుతామని. ఒక వ్యూహం ప్రకారం దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తామని షా తెలిపారు. కాగా ఇండియాలో ఎలక్ర్టిక్ ప్లాంట్‌ఫాం సీరిస్లేదన్నారు. యధాప్రకారం వాటంతట అవే రావాల్సిందేనని, అయితే భారత్‌లో పెద్ద ఎత్తున ఎలక్ర్టిక్ వాహనాల రేంజిని తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.