6tvnews

Header - Ramky
collapse
...
Home / చదువు / అకౌంటింగ్‌ని సులభంగా మార్చే 6 రకాల సాంకేతికతలు

అకౌంటింగ్‌ని సులభంగా మార్చే 6 రకాల సాంకేతికతలు

2021-11-01  Education Desk
venus

accounting software
 

 

పెద్ద, చిన్న వాణిజ్య కార్యకలాపాలలో అకౌంటింగ్‌కి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఆర్థిక వ్యవహారాల ఇన్‌చార్జి ద్రవ్యవిధానం, ప్లానింగ్‌ని సమీక్షించి లోపాలు, మోసాలను నిరోధించడంలో తోడ్పాటునందిస్తారు. అమెరికాలో 670,000 మంది సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్లు (సీపీఏలు) ఉంటున్నారు. వీరు కంపెనీ పన్నులను సిద్ధం చేస్తూ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా వ్యవహరిస్తుంటారు.అకౌంటెంట్‌కి ఒరిజనల్ ఉపకరణాలుగా మెషిన్లు, పెద్దపెద్ద లెడ్జర్ పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు, ఈ కర్తవ్యాలను నిర్వహించడానికి కంప్యూటర్ అప్లికేషన్లు, ఇతర టెక్నాలజీలు ముందుకొచ్చాయి. అకౌంటింగ్‌లో కాస్త ఒత్తిడి తగ్గించుకోవాలని చూస్తున్నవారికి, అకౌంటింగ్‌ని సులభం చేసే 6 రకాల సాంకేతికతలను ఇక్కడ చూద్దాం. 


1. ఆన్‌లైన్ సీపీఏ కోర్సులు 

సీపీఏగా మీరు మారడానికి సహాయ పడే మొట్టమొదటి, అవసరరమైన టూల్ ఇది. సీపీఏ పరీక్షలో ఎలా పాస్ కావాలో మీరు తెలుసుకోవాల్సి ఉంది. దీనికి, మీకు సరైన ఆన్ లైన్ శిక్షణ కోర్సులు కావాల్సి ఉంది. 

సీపీఏ ఎగ్జామ్ గైడ్ వంటి ఆన్ లైన్ సంస్థలు క్లాసులను, అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్లు (ఏఐసీపీఏ) ద్వారా నమూనా పరీక్షలను నిర్వహించడంతో మాత్రమే ఆగిపోవు. మీ ప్రాంతానికి ప్రత్యేకమైన రెగ్యులేషన్లను కనుగొనడానికి ఇది మీకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ బోర్డ్స్ ఆఫ్ అకౌంటబిలిటీ వైపు మిమ్మల్ని నడిపిస్తుంది కూడా. 


2. సేల్స్ టాక్స్ సాఫ్ట్‌వేర్ 

ఒక ఫ్రీలాన్స్ అకౌంటెంటుగా మీరు పలురకాలైన క్లయింట్లతో వ్యవహరిస్తుంటారు. ఒక్కో రాష్ట్రం వేర్వేరు సేల్స్ టాక్స్ రేట్లను కలిగి ఉండవచ్చు. ఈ సమాచారాన్నంతటినీ మాన్యువల్‌గా లెక్కించడానికి బదులుగా, మీకు సహాయపడే సేల్స్ టాక్స్ సాఫ్ట్ వేర్‌ని మీరు ఉపయోగించవచ్చు. ఇది మీ క్లయింట్ల రిటర్న్‌లను సమర్థంగా ఫైల్ చేయడానికి మరియు ఆడిట్‌లో పొరపాట్లను తగ్గించడానికి మీకు వీలు కల్పిస్తుంది. పైగా, ఈ రకమైన టెక్నాలజీ మీ కస్టమర్ బేస్‌ని విస్తరించడంలో మీకు తోడ్పడుతుంది. దీనివల్ల సేల్స్ టాక్స్ పట్టికలను రూపొందించడం సులభమవుతుంది. 


3, క్లౌడ్ కంప్యూటింగ్ 

క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగం మరింత మరింతగా పెరుగుతూనే ఉంది. దీనికి ఒక కారణం ఏమిటంటే, కంప్యూటర్ నుంచి లేక స్మార్ట్ డివైస్ నుంచి ఆర్థిక సమాచారాన్ని పొందడానికి ఇది సులభమైన పద్ధతి కావడమే. రెండో కారణం ఏమటంటే, మీ కస్టమర్‌కి సంబంధించిన వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (పీఐఐ) కోసం ఇది విస్తృతమైన భద్రతను అందిస్తుండటమే. పలు ఆన్‌లైన్ సంస్థలు తమ అకౌంటింగ్ క్లయింట్లను సేవించడానికి విస్తృతంగా క్లౌడ్ టెక్నాలజీనీ ఉపయోగించుకుంటున్నాయి. ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్ స్టాల్ చేయడానికి బదులుగా వారి వెబ్ సైట్‌ లేదా అప్లికేషన్ ప్రాప్యతకకు, వారి సేవలను ఉపయోగించుకోవడానికి మీరు సబ్‌స్క్రిప్షన్ రుసమును చెల్లించాలి. 


4. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ 

ఇది క్లిప్టోకరెన్సీ రంగంతో ప్రాథమికంగా ముడిపడి ఉన్నప్పటికీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఫైనాన్స్ పరిశ్రమలో ఉపయోగిస్తుంటారు. ఇది ఎన్‌క్రిప్ట్ చేసిన డేటాను ఏకకాలంలో కాపాడుతూనే, మీకూ క్లయింట్లకు మధ్య లావాదేవీల విస్తృత జాబితాను నిర్వహిస్తుంది. కాబట్టి మార్పిడి సమయంలో ఈ సమాచారం సురక్షితంగా ఉంటుంది. అకౌంటెంట్లకు స్వతంత్ర ఆడిటర్లకు మధ్య డిజిటల్ కమ్యూనికేషన్లలో విస్తారతను కూడా బ్లాక్ చెయిన్ కనిష్టం చేస్తుంది. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ పద్ధతికి బదులుగా సమాచారం డిజిటల్‌ రూపంలో నిర్ధారించబడుతుంది. కాబట్టి సమస్యలను ఆటోమేటిక్‌గా పరిష్కరించవచ్చు. 


5. మెషిన్ లెర్నింగ్ 

మెషిన్ లెర్నిగ్ (ఎమ్ఎల్) వెనుక ఉన్న భావన కృత్రిమ మేథ (ఏఐ)కు సమాంతరంగా ఉండటమే. వీటిలో కృత్రిమ మేధ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడం వంటి కర్తవ్యాలను నిర్వహిస్తుంది. ఇక మొదటిదైన మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ లోకి మరింత సమాచారం జోడింపబడుతుంది కాబట్టి సంక్లిష్ట లావాదేవీలకు అల్గారిథమ్స్‌ని ఉపయోగిస్తుంటుంది.  త్వరలోనే, ఈ అల్గారిథమ్స్ స్టాండర్డ్ నుంచి పక్కకుపోయే ప్రతి అకౌంటింగ్ లోపానికి సంబంధించిన ఎరుకతో భద్రతను కలిగిస్తాయి. ఫలితంగా మరింత కచ్చితమైన రిపోర్టింగ్ చోటు చేసుకుంటుంది. అయితే, సరైన డేటా‌ని ఇన్ పుట్‌గా తీసుకున్నప్పుడే మెషిన్ లెర్నింగ్ సరిగా పనిచేస్తుంది. లేకపోతే అది చెత్తను నింపడం, చెత్తను బయటకు పంపడంగా ఉంటుంది. 


6. ఆప్టికల్ కేరక్టర్ రికగ్నిషన్ 

స్కానింగ్ టెక్నాలజీ దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ, పాత వెర్షన్లు అకౌంటింగ్ పరిశ్రమలో సమస్యలకు కారణమయ్యేవి. ఉదాహరణకు అప్లోడ్ చేసిన తర్వాత చేతిరాతతో కూడిన లెడ్జర్లు, నోట్స్ వెలిసిపోవడం లేదా స్పష్టంగా అర్థం కాని విధంగా కనిపించడం. ఆప్టికల్ కేరక్టర్ రికగ్నిషన్ ఆవిర్భావంతో ఇది పూర్తిగా మారిపోయింది. ఈ టెక్నాలజీ చేతిరాతతో ఉన్న మెటీరియల్‌ని మెషిన్ రీడబుల్ టెక్ట్స్‌గా మారుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది ఒక రిసిప్ట్‌ని సవరించదగిన ఆన్ లైన్ మెటీరియల్‌‍గా మారుస్తుంది. కాబట్టి దీన్ని నీట్‌గా ఎడిట్ చేయవచ్చు మరియు డెలివరీ చేయవచ్చు. రాతపూర్వక ప్రతి నుంచి మాన్యువల్ కాపీని వర్డ్ ప్రొసెసర్ అప్లికేషన్‌గా మార్చనవసరం లేదు. 

 

ముగింపు 

ఈ ఆరు రకాల సాంకేతికతలు అకౌంటింగ్‌ను సులభతరం చేస్తున్నాయి. మీ అవసరాలకు ఏది బాగా పనిచేస్తుందనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఈ టెక్నాలజీల్లో ఒకదాన్ని మీకు స్వీకరించినప్పుడు, మీ కస్టమర్లు, స్వతంత్ర అడిటర్ల గురించిన ఎరుక మీకు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మీ పని ఫలితాన్ని అందుకునేవారు వీరే కదా. 

అందుకే మీరు చూసిన తొలి ఉత్పత్తిని వెంటనే మీరు ఎంచుకోవద్దు. అలాగే అధిక కర్చుతో కూడిన క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ ఖర్చు తక్కువతో కూడిన దానికంటే ఉత్తమం అని మీరు భావించవద్దు. ఈ టెక్నాలజీలను మీరు చేపడుతున్నప్పుడు అవి ఎలాంటి సమాధానానలను మీకు ఇస్తాయి, పెట్టుబడిపై ఎంత రాబడిని మీకు కలిగిస్తాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. 


 


2021-11-01  Education Desk

rajapush