దేశంలోనే నాల్గవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా ఇండియా, దాని మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 లాంచ్‌తో దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. కియా భారతదేశంలో EV6 కోసం రూ.3 లక్షలతో బుకింగ్‌లను ప్రారంభించింది. Kia EV6 భారతదేశంలో పరిమిత సంఖ్యలో మాత్రమే దిగుమతి చేయబడుతోంది. కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. భారతదేశంలోని 12 నగరాల్లో ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల ద్వారా EVని ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు. కంపెనీ EV ప్లాట్‌ఫారమ్ E-GMPపై ఆధారపడింది. దాని వినియోగదారులకు ప్రీమియం మొబిలిటీ సొల్యూషన్లను అందించడానికి సిద్ధంగా ఉంది. కియా ఇండియా జూన్ మొదటి వారంలో EV6ని లాంచ్ చేయనుంది. అయితే లాంచ్‌కు ముందు తాము కియా ఈవీ 6ని సమీక్షించామని కంపెనీ వెల్లడించింది. EV బేస్ వేరియంట్ కోసం భారతదేశంలో రూ.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉండవచ్చు. టాప్-స్పెక్ వెర్షన్ వచ్చేసి రూ.45 లక్షల వరకు ఉండవచ్చు.
పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తారు..
భారత్‌లో జూన్ 2న కియా ఈవీ6 లాంఛ్ కానుంది. కియా ఈవీ6 బుకింగ్స్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకోనున్న ఈ వెహికల్ భారత్‌లో కియా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కానుంది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 ఈవీ ఆర్కిటెక్చర్‌పై అభివృద్ధి కాగా సాంకేతికంగా అత్యున్నతమైన అడ్వాన్స్డ్ కారుగా ఇది కస్టమర్ల ముందుకు రానుంది.కియా ఈవీ6 కేవలం 5.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. పరిమాణం విషయానికి వస్తే.. కియా ఈవీ6 మిడ్‌సైజ్ లగ్జరీ ఎస్‌యూవీలను తలపిస్తుంది. కియా ఈవీ6ను పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తారు. ఈ వాహనం త్వరలో రానున్న హ్యుందాయ్ ఐనిక్ 5, వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్‌లకు దీటైన పోటీ ఇవ్వనుంది. కియా ఈవీ 6 బ్లాక్ స్వెడ్ సీటు, వేగన్ లెదర్ బోల్ట్సర్తో పూర్తిగా నలుపు రంగులో ఉండే ఇంటీరియర్‌ను కలిగి ఉంది. కియా EV6 భారతదేశంలో ఐదు కలర్లలో లభించనుంది. మూన్‌స్కేప్, స్నో వైట్ పెర్ల్, రన్‌వే రెడ్, అరోరా బ్లాక్ పెర్ల్, యాచ్ బ్లూ.
కియా ఈవీ 6 ఛార్జింగ్..
ఈ కారు భారతదేశంలో ప్రత్యేకమైన GT లైన్ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. మల్టీ-ఛార్జింగ్ సిస్టమ్ వంటి వినూత్న సాంకేతికతలతో పూర్తిగా అమర్చబడి ఉంటుంది. ఇది అదనపు కంట్రోలర్ అవసరం లేకుండా 400V, 800V ఛార్జర్లతో పనిచేసే ప్రపంచంలోనే మొట్టమొదటి ఛార్జింగ్ సిస్టమ్. 800 V ఛార్జర్ 350KWh ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 18 నిమిషాలలో వాహనాన్ని 10% నుంచి 80% వరకూ ఛార్జ్ చేయగలదు.
కియా EV6 పవర్ ట్రెయిన్
ఈవీ 6 భారతదేశ వెర్షన్ 77.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. 2WDలో 229 PS విద్యుత్ శక్తిని, AWD వేరియంట్లో థ్రిల్లింగ్ 325 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, డబ్ల్యుఎల్టీపీ కంబైన్డ్ సైకిల్ ప్రకారం కారు 528 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కియా ఈవీ క్యాబిన్ విషయానికి వస్తే.. పనోరమిక్ డ్యుయల్ 31.24 సెం.మీ (12.3”) వంపు డిస్ప్లేలు నావిగేషన్, డ్రైవింగ్ డేటా, వెహికల్ ఫంక్షనాలిటీస్ డిస్ప్లేతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, వాహన వేగం, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సూచనలతో కూడిన ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎనేబుల్ చేయబడిన HUDని కూడా కలిగి ఉంటుంది.