2022-05-22News Desk అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయడమే తమ అభిమతమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున పనిచేయబోతున్నామని, కలిసి కట్టుగ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పర్చ బోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. View more
2022-05-22News Desk వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కేసు విచారణ పారదర్శకంగా జరపాలని పోలీసులను ఆదేశించారు. View more
2022-05-21News Desk ఇప్పటికే 45 డిగ్రీలకుపైగా ఎండలతో అల్లాడి పోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది కాస్త ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. తమిళనాడు, కర్ణాటకలోకి తీర ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కొన్నిప్రాంతాల్లో ఈదురు గాలులు, చిరుజల్లులు, భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. View more
2022-05-21News Desk కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో బయటపడిన సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, మిత్రులు ఈ డెత్ మిస్టరీపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా హత్యే అని యువకుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు తేల్చి చెప్తున్నారు. View more
2022-05-21News Desk పెట్రో ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న జనాలకు.. నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయలు, ఆకుకూరల ధరలు భగ్గున మండుతున్నాయి. టమాట ధర రోజు రోజుకు పెరిగిపోతుంది. సామాన్యులు ఎక్కువ ఉపయోగించేది టమాట ధర ఇప్పటికే చుక్కల్లోకి చేరింది. View more
2022-05-20News Desk ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల మధ్య పొసగడం లేదు. పలు జిల్లాల్లో ఒకే పార్టీకి చెందిన పలువురు నాయకుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆయా నేతల మధ్య పంచాయితీ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ వరకు చేరింది. వారి మధ్య రాజీ కుదిర్చేప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు. View more
2022-05-20News Desk దావోస్ లో జరిగే సదస్సులో పాల్గొనేందుకు ఆయన బయలు దేరారు. దాదాపు పది రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. పెట్టుబడుల ఆకర్షణ నిమిత్తం ఆయన ఆ పర్యటనకు బయలు దేరారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కు హాజరుకానున్నారు. View more
2022-05-20News Desk వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో అనుమానాస్పదంగా ఓ మృతదేహం లభించింది. తీరా చూస్తే ఆ యువకుడు అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పని చేసిన సుబ్రహ్మణ్యం కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. View more
2022-05-19News Desk ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టినప్పుడు ఎన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యవహారం కోర్టు మెట్ల వరకూ వెళ్లింది. ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఇటీవలి కాలంలో ఓ ప్రభుత్వ పాఠశాల హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఆ పాఠశాల విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటమే. View more
2022-05-19News Desk ప్రభుత్వంపై విమర్శలతో చంద్రబాబు చెలరేగుతుండగా.. వాటికి ప్రతి విమర్శలు చేస్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాక రేపుతున్నారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన వైఎస్సార్ జిల్లాలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు. View more
2022-05-19News Desk కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ డిమాండ్లు ఎక్కువగా రావడంతో కోనసీమకు ముందు డా.బీఆర్.అంబేద్కర్ పేరును చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు కోనసీమ జిల్లా పేరు మార్చుతూ ప్రభుత్వం ప్రాధమిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోనసీమ జిల్లా ఇక డా.బీఆర్.అంబేద్కర్ జిల్లాగా మారనుంది. View more
2022-05-18News Desk ఎండలతో ఉడికిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ అందించింది. ఈ రోజు నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో ఎండలు మండుతుండగా.. కొన్ని జిల్లాల్లోవాతావరణం పూర్తిగా మారిపోయింది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy