collapse
...
Home / లైఫ్ స్టైల్ / కళలు & సంస్కృతి / Becareful: డిజిటల్ రొమాన్స్ చేస్తున్నారా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telu...

Becareful: డిజిటల్ రొమాన్స్ చేస్తున్నారా?

2022-01-18  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Apps 11 (1)
 

సోషల్ మీడియా పుణ్యమాని అరచేతిలో ప్రపంచమంతా వచ్చిచేరుతోంది. ఎక్కడ  ఏమూలన చిన్న విషయం జరిగినా అది క్షణాల్లోనే వైరల్ అయ్యి ప్రపంచమంతా పాకిపోతోంది. స్మార్ట్ ఫోన్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో సరికొత్త యాప్‌లను సృష్టిస్తూ క్యష్‌ చేసుకునే వారు లేకపోలేదు. సమాచారం తెలుసుకోవడం, విషయంపై అవగాహన పెంచుకోవడం వరకు ఓకే కానీ, భారతీయ సంస్కృతినే పక్కదారిన పట్టించేందుకు కొన్న యాప్‌లు వక్రబుద్ధిని చూపిస్తున్నాయి. ఇప్పుడు ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా ఒక్క క్లిక్‌తో స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది . కానీ ప్రేమను, మానవ సంబంధాలను కూడా సోషల్ మీడియా ద్వారానే పెంచుకునేందుకు భారతీయులు ప్రేరేపితులు అవుతున్నారు.

డేటింగ్ యాప్‌ల పిచ్చిలో యువత:

అందుబాటులో ఉన్న వందల కొద్ది డేటింగ్ యాప్‌లను ఫాలో అవుతూ కొత్త ఫ్రెండ్‌షిప్‌కోసం పాకులాడుతున్నారు. దేశంలోని లక్షలాదిమంది యువత ఈ డేటింగ్ యాప్‌లకు బానిసలవుతున్నారు. ఇది ఎంతలా అంటే ప్రతి రోజు డేటింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఓ సర్వే వెల్లడించింది. దీనిని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యువతే కాదు పెళ్లైనవారు వయస్సుపైపడిన వారు ఈ విషసంస్కృతికి దాసోహమవుతున్నారు. వివాహేతర సంబంధాల పట్ల యువత ఆకర్షితులవడం, అందుకోసం అందుబాటులో ఉన్న యాప్‌లను ఆశ్రయించడంతో ఈ విష సంస్కృతి భారత్‌లో పెచ్చుమీరుతోంది. సంస్కృతి మాట పక్కన పెడితే ఈ డేటింగ్ యాప్‌లు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రేమ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేయడమూ ఓ మానసిక అనారోగ్యమే:

ఒకప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తల్లిదండ్రులు చూపించిన వారినే పెళ్లి చేసుకుని వారినే ప్రేమించేవారు. కాలం మారుతున్నా కొద్దీ నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ముక్కుమొఖం తెలియని వారి ప్రేమ కోసం డిజిటల్ రొమాన్స్ చేస్తోంది యువతరం. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ... ప్రేమను వెతుక్కునే ట్రెండ్‌కు మారింది నవతరం.  ఈ డేటింగ్ యాప్‌లు ఇద్దరు తెలియని వ్యక్తుల మధ్య సంబంధాలను ఏర్పరుచుకోచడానికి ఓ సాధనంగా మారాయి . అందుకు తగ్గట్లుగానే ఆన్‌లైన్‌లో వందల కొద్ది డేటింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వారి బిజినెస్ కూడా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా లాభాల దిశగా సాగుతోంది. టిండర్, బంబుల్, గ్రిండర్, హింగ్, బడూ వంటి డేటింగ్ యాప్‌లు  మరింత అప్‌డేట్‌ ఫీచర్స్‌తో సైబర్ స్పేస్ లో కొత్త ట్రెండ్ ను తీసుకువచ్చాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు రిలేషన్ కనెక్షన్‌తో పాటు రిలేషన్ రిజెక్షన్‌ను వంటి రెండు ఆప్షన్‌లను అందుబాటులో ఉంచుతోంది. దీని వల్ల మనిషిలో మానసిక ఆందోళనను  పెంచుతోందని రీసెంట్ అధ్యయనాలు తెలుపుతున్నాయి, అంతేకాదు తమపై తాము విశ్వాసం కోల్పుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.  డేటింగ్ యాప్‌ ల మోజులో పడి అవి పరోక్షంగా చేసే హాని గురించి పసిగట్టలేక ఎంతో మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంతే కాదు ప్రేమ కోసం డేటింగ్ యాప్‌లలో వెతకడం కూడా ఓ మానసిక అనారోగ్యమేనని అంటున్నారు వైద్యులు.

నిరాశకు లోనవుతున్న 49 శాతం మంది యూజర్స్‌:

డేటింగ్ యాప్‌లు వైవిధ్యమైన అనుభూతిని కల్పిస్తున్నపట్టికీ స్లో పాయిజన్ నెత్తికెక్కిస్తున్నట్లు అది ఇన్‌డైరెక్ట్‌గా మెంటల్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. ఓ సర్వే ప్రకారం ఈ డేటింగ్ యాప్‌లను వినియోగిస్తున్న 49 శాతం మంది యూజర్స్‌ నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని తెలిపింది. ఈ యాప్‌లను స్వైప్ చేసే ప్రతీ ఒక్కర్ మెంటల్ ఇల్‌నెస్‌గు గురవుతున్నారని స్పష్టం చేసింది.

డేటింగ్ యాప్‌లతో ఒత్తిడి పెరుగుతోంది:

డేటింగ్ యాప్స్‌ ప్రజలకు తమ భాగస్వాములను వెతుక్కునే వీలు కల్పించాయన్నది పాత వార్త. కానీ తమ డిజిటల్ డివైస్‌ల ద్వారా నిజమైన ప్రేమను కనుగొనే ప్రయత్నంలో ఓడిపోయిన వారు ఎంతో మందిని ఇప్పుడు మానసిక ఆందోళనతో సతమతం చేస్తోందన్నది కొత్త వార్త. భాగస్వామిని వెతుక్కోవడానికి వందల సర్చ్‌లు చేయడం ప్రయాసతో కూడిన పని మాత్రమే కాదు ఉద్రేకం కూడా కలుగుతుంది. ఈ యాప్స్ వాడకుండా ఉండలేని స్థితికి చేరినవారు చివరికి ఒంటరితనంతో బాధపెడుతోంది. ముఖ్యంగా ప్రతి మ్యాచికి స్పందించడం. ప్రతి రోజు యాప్‌ను సెర్చ్‌ చేయడం కూడా ఒత్తిడికి దారి తీస్తోందని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. డేటింగ్ యాప్‌లను సబ్‌స్క్రైబ్ చేయనివారితో పోల్చితే యాప్ యూజర్లే మూడు రెట్లు ఒత్తిడికి లోనవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.

శరీర ఆకృతిపైన కోసం పెరుగుతున్న ఆరాటం:

ఆన్‌లైన్ డేటింగ్ యాప్ కావడంతో వ్యక్తిగతంగా ఇంటరాక్షన్ లేకపోవడంతో ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే తమను అందంగా చూపించుకుని చాలా మంది సంబంధాలను ఏర్పరుచుకుంటారు. అందంగా ఉంటేనే ఎదుటివారు ఆకర్షితులవుతారని అప్పుడే వారి బంధం ముడిపడుతుందని నమ్ముతారు. వారికి వారే అందంగా లేమని నిర్థారించుకుంటారు, పక్కవారితో పోల్చుకుంటారు. 2016లో జరిగిన ఓ సర్వే ప్రకారం టిండర్ యాప్‌ను వినియోగించే యూజర్లు కాన్ఫిడెన్స్ లెవల్స్ మిగతా వారితో పోల్చితే తక్కువని తేలింది. ప్రత్యేకించి వారి శరీర ఆకృతిపై ఎంతో అసంతృప్తి ఉంటారని అంతేకాదు వారి పిక్ ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయడం అవమానంగా భావిస్తారని నివేదిక పేర్కొంది.  ఇది కూడా ఓ మానసిక అనారోగ్యమేనని నిపుణులు చెబుతున్నారు.

తమపై విశ్వాసాన్ని కోల్పోతున్న యూజర్లు:

డేటింగ్ యాప్ యూజర్‌ను రిజెక్ట్ చేయడం వల్ల కూడా అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది యాప్‌ల మీద పగతో కొన్ని విధ్వంసకర చర్యలకు పాల్పడితే మరికొంత మంది వ్యక్తిగతంగా తీసుకుని మానసిక ఆందోళనకు గురవుతున్నారు. తమపై తాము విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎక్కువ సమయం ప్రేమ కోసం డేటింగ్ సైట్‌లలో గడిపేవారు నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఆందోళనకు గురవుతున్నారు.

దీర్ఘకాలం పాటు ఇంటర్నెట్‌ను వినియోగించడం, డేటింగ్ యాప్‌లతో గడపడం ప్రతికూల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని  అనేక అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఫోనే ప్రపంచం కాదు. బయట ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది. కాబట్టి ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, మనుషులతో సఖ్యత పెంచుకుని ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుని ప్రపంచంలో సాధించే అంశాలు చాలానే ఉన్నాయి. వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 2022-01-18  Lifestyle Desk