ప్రపంచ ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ చైనా ప్రభుత్వానికి కట్టుబడి ఉందా? ఆ ప్రభుత్వం ఏం చెబితే అది చేసేందుకు సై అంటోందా? కేవలం వ్యాపారాన్ని విస్తరిందుకు మాత్రమే తన వ్యూహాన్ని రచిస్తోందా? బీజింగ్‌తో సఖ్యతను పెంచుకునేందుకు సాహసం చేస్తోందా అంటే అవుననే అనిపిస్తుంది తాజా పరిస్థితులను గమనిస్తుంటే. చడీచప్పుడు కాకుండా, గుట్టు గుట్టుగా ఆ దేశా అధ్యక్షుడు జిన్‌పింగ్ పుస్తకానికి సంబంధించిన అన్ని రేటింగ్లను సమీక్షలను అమెజాన్ తన చైనా వెబ్సైట్ నుంచి తొలగించింది . ఉన్నత స్థాయి అధికారుల కోరిక మేరకు 5 రేటింగ్ రాని అన్ని పుస్తకాలను తొలగించింది. జిన్‌పింగ్ పుస్తకానికి వచ్చిన ప్రతికూల సమీక్షలను దాచడానికే చైనా ప్రభుత్వ ఆదేశాన్ని అమెజాన్ పాటించిందని, చైనాలో తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి బీజింగ్ ఆదరణను పొందేందుకు అమెజాన్ ఈ ప్రయత్నం చేస్తోందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కస్టమర్ రివ్యూల తొలగింపు:
ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ చైనా ప్రభుత్వం అడిగినట్లుగానే చైనా ప్రీమియర్ జిన్‌పింగ్ పుసక్తం అన్ని కస్టమర్ రివ్యూలను తన చైనీస్ వెబ్సైట్ నుంచి తొలగించింది. రాయిటర్స్ కథనం ప్రకారం, ఈ పుస్తకానికి ఐదు కంటే తక్కువ రేటింగ్ రావడంపై చైనా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని, అందుకే అమెజాన్ వెబ్‌సైట్‌లోని అన్ని రేటింగ్లను, సమీక్షలను తీసివేసిందని తెలిపింది.అంతేకాదు ….తదుపరి కస్టమర్ రేటింగ్‌ను కూడా నిలిపివేసింది.
5 రేటింగ్ లేకపోవడమే కారణమా?:
జిన్‌పింగ్ ఈ పుస్తకానికి ఆంగ్లంలో టైటిల్ పెట్టారు. అది ఏమిటంటే ది గవర్నెన్స్ ఆఫ్ చైనా అని. ఈ పుస్తకం జిన్‌పింగ్ ప్రసంగాలు, రచనల మూడు వాల్యూమ్ల సేకరణ. సోషలిజం విత్ చైనీస్ క్యారెక్టరిస్టిక్స్ సిద్ధాంతం గురించి ఈ పుస్తకం తెలుపుతుంది. ది గవర్నెన్స్ ఆఫ్ చైనా పుస్తకం అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతుంది. కానీ కొన్ని ప్రతికూల సమీక్షలు రావడంతో పాటు Amazon.cn వెబ్సైట్లో పుస్తకానికి ఐదు కంటే తక్కువ రేటింగ్‌లు రావడంతో CCP అధికారులు వాటిని తీసివేయాల్సిందిగా అమెజాన్‌ను కోరారు. అసలు సమస్య అంతా ఐదు స్టార్ల కంటే తక్కువగా రేటింగ్ ఉండటమేనన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.
చైనాకు కట్టుబడి వున్న అమెజాన్:
ఎంతటి దిగ్గజమైనా, ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నా అమెరికన్ ఇ-టెయిల్ దిగ్గజం చైనీస్ ప్రభుత్వం చేసిన ఈ డిమాండ్‌కు కట్టుబడి ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చైనీస్ వెబ్సైట్లో పుస్తకానికి సంబంధించిన అన్ని సమీక్షలను , రేటింగ్లను నిశ్శబ్దంగా తొలగించింది. నివేదిక ప్రకారం కంపెనీ సైట్లో పుస్తకం రేటింగ్‌లు, సమీక్షలకు కూడా నిలిపివేసింది.
వ్యాపారాన్ని రక్షించుకోవడానికే :
Amazon.cn వెబ్సైట్లో పుసక్తం మాండరిన్ శీర్షిక కోసం శోధించినప్పడు, పుస్తకం అనేక జాబితాలు, దాని అసలు చైనీస్ వెర్షన్ తో పాటు వివిధ వర్షన్లలో అనువదించబడిన కాపీలు కనిపిస్తున్నాయే కానీ ఏవాటిలోనూ రేటింగ్‌లు కానీ కస్టమర్ సమీక్షలు కానీ కనిపించకపోవడం గమనార్హం. చైనా ప్రభుత్వం ఆదేశాలను పాటించి జిన్‌పింగ్ పుస్తకం ప్రతికూల సమీక్షలను దాచి కేవలం ఆ దేశంలో తన వ్యాపారాన్ని రక్షించుకోవడానికి, బీజింగ్ యొక్క ఆదరణ పొందేందుకే కంపెనీ ఈ చర్యకు పాల్పడిందని స్పష్టంగా తెలుస్తోంది.
అమెజాన్ డాక్యుమెంటు అదే చెబుతోంది:
2018 ఇంటర్నల్ అమెజాన్ బ్రీఫింగ్ డాక్యుమెంట్‌ను ఉదహరిస్తూ, కేవలం దేశంలో ఆదరణ పొందేందుకే చైనా ప్రభుత్వం చైనా ప్రభుత్వంతో కలసి పనిచేస్తోందని రాయిటర్స్ తెలిపింది. సైద్ధాంతిక నియంత్రణ, ప్రచారమే కమ్యూనిస్ట్ పార్టీ తన విజయాన్ని సాధించడానికి , కొనసాగించడానికి వినియోగిస్తున్న టూల్ కిట్ అని ఈ పత్రం పేర్కొంది. ఇది సరైనదా లేదా తప్పా అనే దానిపై మేము తీర్పు ఇవ్వడం లేదని చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచ ఆర్థిక, రాజకీయ ఎంజెండాను వ్యాపించడంలో సహాయం చేయడం ద్వారా కంపెనీ చైనాలో మనుగడ సాగించడంతో పాటు అభివృద్ధి చెందిందని అమెజాన్ చైనాతో పని చేస్తున్న వారితో పాటు అనేక ఇంటర్వ్యూలలో అమెజాన్ వెల్లడించింది.
చైనా బుక్స్ పోర్టల్‌లో 90 వేల పుస్తకాలు:
ఈ ప్రచార ప్రాజెక్టులో భాగంగా, అమెజాన్ తన ప్రధాన యూనైటెడ్ స్టేట్స్ వెబ్సైట్ Amazon.com లో చైనా బుక్స్ అనే ప్రత్యేక పోర్టల్ ను కూడా సృష్టించింది. దానిలో 90వేల కంటే ఎక్కువ చైనా సంబంధిత ప్రచురణలు అమ్మకానికి ఉన్నాయి. ఇది చైనాలో అమెజాన్ వ్యాపారాలకు మద్దుతను పొందేందుకు కీలకమైన ప్రయత్నంగా పరిగణించబడుతోంది. కిండ్లీ ఫ్టాట్పారమ్ ద్వారా చైనాలో ఇ-బుక్స్ విక్రయించడానికి లైసెన్స్ పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అమెజాన్ తన డాక్యుమెంట్ లో పేర్కొంది. అదే విధంగా ఈ సమస్య నుంచి బయటపడేందుకు చైనా బుక్స్ ప్రాజెక్టులు ఎంతో కీలకంగా పనిచేసాయని తెలిపింది. అమెజాన్, చైనా ఇంటర్నేషనల్ బుక్ ట్రేడింగ్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్ ఈ ప్రాజెక్ట్. అంతే కాదు చైనా రాష్ట్ర ప్రచార నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్‌తో అమెజాన్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.