collapse
...
Home / వినోదం / ఇంగ్లీషు / O.T.T Movie Money Heist trailer review: అద్భుతం..ఆసక్తిదాయకం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu N...

O.T.T Movie Money Heist trailer review: అద్భుతం..ఆసక్తిదాయకం

2022-06-03  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Money Heist
 

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ స్పానిష్ సిరీస్ మనీ హీస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సిరీస్ అక్కడికే ఆగిపోతుంది అనుకుంటే మరింత గ్లోబలైజ్డ్ గా విడుదల కానుంది. మనీ హీస్ట్ స్పానిష్ సిరీస్ ఈ సారి ఏషియన్ జనాల సెంటిమెంట్స్ ని అట్రాక్ట్ చేస్తూ.. 'మనీ హీస్ట్ కొరియన్ జాయింట్ ఎకనామిక్ ఏరియాపేరుతొ కొరియన్ భాషలో విడుదల కానున్నట్టు మనీ ఫీస్ట్ మేకర్స్ ప్రకటించారు. అయితే వారి ప్రకటన వచ్చిన   24 గంటల్లోనే ఏకంగా 'మనీ హీస్ట్ కొరియన్ జాయింట్ ఎకనామిక్ ఏరియాఅఫీషియల్ ట్రైలర్ విడుదల చేయటమే కాకుండా..   జూన్  24  న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేసేశారు. 

ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే ప్లాన్

పేదధనిక వర్గాల మధ్య వ్యత్యాసాన్ని సమతుల్యం చేయడానికి చేసే రాబరీనే మనీ ఫీస్ట్ ఒరిజినల్ స్పానిష్ సిరీస్ కథాంశం. సమాజంలో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేని కొందరు వ్యక్తులు.. గ్రూప్‌గా ఏర్పడి ప్రభుత్వ ఖజానాని దొంగిలించి అవసరం ఉన్న వాళ్ళకి పంచి పెడుతుంటారు. సీజన్ 2అఫీషియల్ ట్రైలర్ చూస్తుంటే ఈ ఒరిజినల్ థీమ్‌నే ఎంచుకుని.. స్వల్ప మార్పులతో మని హీస్ట్ జాయింట్ ఎకనామిక్ ఏరియాని తెరెకెక్కించినట్టు అర్ధమవుతుంది. ఉత్తర కొరియాదక్షిణ కొరియా దేశాల బార్డర్స్ ని కలిపే ప్రదేశమే మనీ హీస్ట్ జాయింట్ ఎకనామిక్ ఏరియా. రెండు దేశాల భద్రత వ్యవహారాలను చూసే ఈ ఎకనామిక్ కారిడార్ నే టార్గెట్ చేసుకుని రాబరీ ప్లాన్ జరుగుతుంది. ఆ రెండు దేశాలకు కలిపి ఒక కామన్ కరెన్సీని ఏర్పాటు చేయాలనీ జాయింట్ ఎకనామిక్ పద్దతిని అనుకుంటే.. ఇది కాస్త ధనికులని మరింత ధనవంతులుగా చేస్తుంది.. పేదలు ఎప్పటికి మోసపోతూనే ఉంటారని.. ఈ సిస్టం నచ్చని గ్రూప్ ఆఫ్ పీపుల్ పెద్ద ఎత్తున దొంగతనానికి పాల్పడటమే మనీ హీస్ట్ జాయింట్ ఎకనామిక్ ఏరియా అసలు కథ. 

ట్రిలియన్ల దొంగతనానికి ప్లాన్ 

ఒరిజినల్ మనీ ఫీస్ట్‌ని సృష్టించిన అలెక్స్ పినా.. ఈ కొరియన్ మనీ ఫీస్ట్‌కి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేశాడు. రెండు దేశాల మధ్య ఉండే ట్రిలియన్ కరెన్సీని దొంగిలించేందుకు ప్రణాళికలు వేసే ప్రొఫెస్సర్ యూ జి-టే.. ఆ బాధ్యతని హీరో టోక్యోకి అప్పచెప్తాడు. టోక్యో పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు జున్ జోంగ్-సియో నటించాడు.  ప్రొఫెస్సర్ అప్పజెప్పిన పనికి టోక్యోనే నాయకత్వం వహిస్తాడు. సౌత్ కొరియానార్త్ కొరియాల నుండి ఇద్దరు మాజీ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ని రాబరీకి వాడుకుని ఎంత తెలివిగా ప్రభుత్వ ఖజనాని దొంగిలించాడన్నది   జూన్ 24న నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే. అలా తప్పక చూసేలా..   ఈ కొరియన్ సిరీస్‌పై తాజా ట్రైలర్ భారీ ఎత్తున అంచనాలని పెంచేసింది.



2022-06-03  Entertainment Desk