collapse
...
Home / వినోదం / ఓటిటి / O.T.T News: త్వరలో అలరించనున్న మరాఠా జాంబీలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for T...

O.T.T News: త్వరలో అలరించనున్న మరాఠా జాంబీలు

2022-05-13  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link


జీ 5 సంస్థ యమజోరుమీదుంది. మంచి మంచి సినిమాలను డిజిటల్ ప్రేక్షకులకు అందిస్తోంది. సమ్మర్‌లో ఇంటివద్దే కూర్చొని ఎంజాయ్ చేయడానికి అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ ఓ మరాఠా సినిమాను ఓటీటీ ప్రేక్షకులకు అందించనుంది. ఆ మరాఠా సినిమా పేరు జోంబివలీ. ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో విడుదలైన ప్రేక్షకుల మన్ననలను పొందిన ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ ప్రేక్షకుల ముందురు రానుంది. మహారాష్ట్ర జాంబీలు సందడిని తమ ఇంట్లోనే కూర్చుని వీక్షించవచ్చు.    

వెన్నులో వణుకుపుట్టించే జాంబీస్   

డిఫరెంట్‌ జోనర్‌ చిత్రాలలో జాంబీస్‌        ఒకటి. ఒక వైరస్‌ సోకిన వ్యక్తి మరో మనిషిని చంపి తినేవారినే జాంబీస్‌ అంటారు. మనుషులను పీక్కు తినేందుకు వెంటపడే జాంబీస్‌ వెన్నులో వణుకుపుట్టిస్తాయి. ఈ తరహా సినిమాలు యాక్షన్‌హార్రర్‌ఎమోషన్స్‌తో కలగలపి ఎన్నో వచ్చాయి. తాజాగా ఓటీటీలోకి ఈ జోనర్‌లో ఓ మరాఠా సినిమా రానుంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య సర్పోట్‌దర్ తెరకెక్కించిన హారర్‌ కామెడీ చిత్రం జాంబీవిలీ'.    

మే 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్   

ఈ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. మే 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఇండియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మహారాష్ట్ర జాంబీలు మీకోసం వచ్చేస్తున్నాయి. యాక్షన్‌ కామెడీతో నిండి ఉన్న ఈ చిత్రం చూసేందుకు సిద్ధంగా ఉండండని జీ5 సంస్థ ట్వీట్‌ చేసింది.    

Jombvli Movie on OTT
 

మరాఠీలో తొలి జాంబీ మూవీ   

ఓ నగరంలో జాంబీ వైరస్‌ వ్యాప్తి కావడంతో అక్కడి ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనేదే సినిమా కథ. అలాగే మరాఠీ భాషలో తొలిసారిగా జాంబీ జానర్‌లో వచ్చిన చిత్రం ఇది. ఇందులో అమీ వాఘ్వైదేహి పరశురామితృప్తి ఖమ్కర్‌జానకి పాఠక్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.    

తెలుగులో జాంబీరెడ్డి   

తెలుగులో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో జాంబీ రెడ్డి    మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దక్షా నగార్కర్, ఆనందీ, తేజా సజ్జా, లహరి, హరితేజ, గెటప్ శీను తదితరులు నటించిన ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ..కామెడీని మిక్స్ చేసి తెరకెక్కించిన జాంబీరెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కరోనా వాక్సిన్ వికటించడంతో ఓ ఊళ్లో ప్రజలు జాంబీలుగా మారతారు. హీరోగా పాటు మరో నలుగురు తప్పా మిగతా అందరూ జాంబీలుగా మారిపోతారు. వీరంతా కలిసి ఆ జాంబీలను ఎలా ఎదుర్కొన్నారు అనేది జాంబీరెడ్డి సినిమాలో చూపించారు. కొన్నికామెడీ సన్నివేశాలు ఈ సినిమాలో చాలా హైలైట్‌గా ఉంటాయి.    

మరాఠా జాంబీలు ఎలా ఉంటాయి   

జాంబీ సినిమాలు హాలీవుడ్‌లో గతంలో అనేకం వచ్చాయి. తెలుగులో ప్రశాంత్ వర్మ తీసిన జాంబీ రెడ్డి కూడా పాస్ మార్కులు కొట్టేసింది. మరి మరాఠీ జాంబీలు ఏ విధమైన హంగామా చేయనున్నారో తెలుసుకోవాలంటే మే 20 వరకు ఆగాల్సిందే.    

 

 

 



2022-05-13  Entertainment Desk