collapse
...
Home / వినోదం / ఇంగ్లీషు / O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News...

O.T.T Updates: ఆహాలో ... అశోకవనంలో అర్జున కళ్యాణం

2022-06-03  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

viswak 3 
 

డిజిటల్ ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం పండగే. వివిధ భాషల్లో సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ రోజు కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. 

అశోకవనంలో అర్జున కళ్యాణం    

తెలుగు ఓటీటీ కింగ్ ఆహాలో ..విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం స్ట్రీమింగ్ మొదలయింది. కొన్ని వారాల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విశ్వక్‌సేన్‌కు మంచి పేరు తెచ్చింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రేక్షకుల మనసులను తాకింది. ప్రస్తుతం మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఈ సినిమా సిద్ధమయింది. థియేటర్లలో చూడనివారు, ఈ సినిమాను మరోసారి చూసి ఆనందిద్దామని అనుకున్నవాళ్లుకు ఆహా ద్వారా చూసే అవకాశం కలుగుతోంది. 

ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌    

MX Playerలో ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్ మొదలయింది. హిందీ, తెలుగుతో పాటు తమిళం,కన్నడ భాషల్లో ఈ సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది. సన్నీ డియోల్ సోదరుడు బాబీ డియోల్‌ నటించిన ఈ వెబ్‌సిరీస్‌ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన ఈ 3వ సీజన్‌ కూడా అంచనాలకు తగ్గట్లు గానే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. నటి అరుణిత ఝా ఈ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటించింది. దర్శకుడు ప్రకాశ్ ఝా ఈ సిరీస్‌ను రూపొందించారు.

KGF 2 సినిమా    

కన్నడ హీరో యశ్ నటించిన KGF 2 సినిమా కూడా డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది. అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ మొదలయింది. కన్నడ, తెలుగుతో పాటు తమిళం, మళయాలం భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపించింది. కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ..టేకింగ్ భారతీయ సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. అబ్బురపరిచే సీన్లు ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకువెళ్లాయి. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కూడా ప్రభంజనం సృష్టించనుంది. 

అమేజాన్‌ ప్రైమ్‌లో సర్కారు వారి పాట     

మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన సర్కారు వారి పాట ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. 199 రూపాయలు అద్దె చెల్లించి ఈ సినిమాను చూసే అవకాశం కలుగుతోంది. పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన లభించింది. కొన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. కొన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చిన ఈ సినిమా డిజిటల్ ఫార్మాట్‌లో ఏ విధమైన టాక్ తెచ్చుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది. 

జూన్ 22 నుంచి డాక్టర్ స్ట్రేంజ్ 2    

డాక్టర్ స్ట్రేంజ్ 2 డిస్నీ హాట్‌స్టార్‌ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. జూన్ 22 నుంచి డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాడు. డాక్టర్ స్ట్రేంజ్ 2 ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఆ యా భాషలకు సంబంధించిన పోస్టర్లను హాట్‌స్టార్ సంస్థ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. 

అశోకవనంలో అర్జున కళ్యాణం   



2022-06-03  Entertainment Desk